Home /News /andhra-pradesh /

Andhra Pradesh: కొత్త జంట శోభనం ఎలా..? జగనన్న ఇళ్లపై సొంత పార్టీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Andhra Pradesh: కొత్త జంట శోభనం ఎలా..? జగనన్న ఇళ్లపై సొంత పార్టీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

జగనన్న ఇళ్లు పై సొంత పార్టీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

జగనన్న ఇళ్లు పై సొంత పార్టీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగనన్న కాలనీ ఇళ్ల పై అధికార పార్టీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఆ కాలనీల్లో నిర్మిస్తున్న ఇళ్లలో బెడ్ రూమ్ లు బాగులేవని.. రాత్రి పూట ఆ పని ఎలా చేస్తారు అంటూ బోల్డ్ కామెంట్స్ చేసి.. అంందరికీ షాక్ ఇచ్చారు.

ఇంకా చదవండి ...
  ఏపీలో ప్రతి పేదవాడికి ఇళ్లు ఉండాలన్నదే తన సంకల్పం అన్నారు సీఎం జగన్. తన కలనే అధికారులంతా వారి కలగా చేసుకుని పేదవారికి ఇళ్లు అందేలా చేయాలని ఇటీవలే ఆదేశాలు జారీ చేశారు కూడా. మౌలిక వసతులు త్వరగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. దేశం మొత్తం ఏపీవైపు చూసేలా జగనన్న కాలనీలు ఉండాలి సీఎం జగన్ చెబుతుంటే.. ఏపీలో పేదల ఇంటి పథకంపై విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. నివాస యోగ్యం కాని ప్రాంతాల్లో కాలనీలు కడుతున్నారని.. లబ్ధి దారుల ఎంపికలోనూ అవకతవకలు ఉన్నాయని.. అలాగే బలవంతంగా పేదల భూములు లాక్కున్నారంటూ పలు ఆరోపణలు వినిపించాయి. అయితే ఇలా ప్రభుత్వ పథకాలపై విపక్షాలు విమర్శలు చేయడం సర్వ సాధారణం అయితే.. జగనన్న ఇళ్లపై అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆరోపణలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది..

  జగనన్న ఇళ్లపై హౌసింగ్ రివ్యూలో నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే న‌ల్ల‌పురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జగనన్న ఇళ్లలో బెడ్రూమ్స్ సరిగా లేవంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. బెడ్ రూమ్స్‌లో పెళ్ళయిన కొత్త జంటలకు శోభనానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందంటూ కాస్త ఘాటుగానే మాట్లాడారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇళ్లలో లో ఇలా బెడ్ రూమ్ చాలా చిన్నదిగా ఉంటే ఎలా అని ప్రశ్నించారు. లబ్ధిదారులు రాత్రివేళల్లో బెడ్ రూమ్ లో ఏదైనా పని చేయాలనుకున్నా ఇబ్బందిగా ఉంటుందంటూ కాస్త అడల్ట్ కామెంట్లు చేశారు.

  ఇదీ చదవండి: దేవాలయాల్లో అక్రమాలపై ఏపీ సర్కార్ సీరియస్.. ఆకస్మిక తనిఖీలపై ఆదేశాలు

  బెడ్ రూమ్ లో పెద్ద మంచం వేయాల్సి వస్తే కష్టంగా ఉంటుందని పేర్కొన్నారు. బాత్ రూమ్ బయట ఏర్పాటుచేసి బెడ్రూమ్ సైజు పెంచాలని సూచించారు. అర్బన్ ప్రాంతాల్లో కేవలం 6 అంకణాల్లోనే ఇళ్లు నిర్మించనున్నారని.. అలాంటి ఇళ్లలో హాల్లో శోభనం చేసుకొని బెడ్రూమ్‌లో పడుకోవాల్సి వస్తుందంటూ ఎమ్మెల్యే డబుల్ మీనింగ్ డైలాగులు పేల్చారు. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యే ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు చేయ‌డం ఇప్పుడు చ‌ర్చనీయాంశం అయింది. మరి ప్రసన్నకుమార్ రెడ్డి కామెంట్స్‌పై అధినాయ‌క‌త్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

  ఇదీ చదవండి: వంశ చరిత్రను తిరగతోడిన ఎంపీ.. అశోక్ గజపతి రాజుపై విజయసాయి సంచలన వ్యాఖ్యలు

  ప్రతిపక్ష, విపక్షం అని తేడా లేకుండా ప్రసన్న కుమార్ రెడ్డి ఎప్పుడు అగ్రసివ్ గానే ఉంటారు. ఇటీవ‌ల ఆ జిల్లా ఎస్పీగా రిలీవ్ అయిన‌ భాస్కర్‌ భూషణ్‌ను ఈ ఏడాది జ‌న‌వ‌రిలో బాహాటంగానే విమ‌ర్శించారు. భాస్కర్ భూషణ్ జిల్లా ఎస్పీలా కాకుండా టీడీపీ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతో పెట్టుకోవద్దు.. జాగ్రత్తగా ఉండు అంటూ అందరి ముందే హెచ్చరించారు. అప్ప‌ట్లో ఆయన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపాయి.

  ఇదీ చదవండి: : పయ్యావుల సైలెన్స్ కు కారణం ఏంటి? ఆ నిర్ణయం తీసేసుకున్నారా? ముహూర్తం ఫిక్స్ అయ్యిందా..?
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Ap welfare schemes

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు