హోమ్ /వార్తలు /andhra-pradesh /

Lakshmi Parvathi: ఎన్టీఆర్ మళ్లీ జన్మిస్తారా..? ఆయన ఆత్మ ఏం చెప్పింది..? 26 ఏళ్ల తరువాత బయటపడ్డ రహస్యం..!

Lakshmi Parvathi: ఎన్టీఆర్ మళ్లీ జన్మిస్తారా..? ఆయన ఆత్మ ఏం చెప్పింది..? 26 ఏళ్ల తరువాత బయటపడ్డ రహస్యం..!

Lakshmi Prvathi: ఎన్టీఆర్ మళ్లీ పుడతారా..? పుడితే ఎక్కడ ఎలా పుడతారు..? ఆయన ఆత్మ మాట్లాడిందా.. మరి ఇంతకాలం ఆ సంగతి బయటకు ఎందుకు రాలేదు.. తాజాగా ఆయన 26వ వర్ధంతి సందర్భంగా లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు..

Lakshmi Prvathi: ఎన్టీఆర్ మళ్లీ పుడతారా..? పుడితే ఎక్కడ ఎలా పుడతారు..? ఆయన ఆత్మ మాట్లాడిందా.. మరి ఇంతకాలం ఆ సంగతి బయటకు ఎందుకు రాలేదు.. తాజాగా ఆయన 26వ వర్ధంతి సందర్భంగా లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు..

Lakshmi Prvathi: ఎన్టీఆర్ మళ్లీ పుడతారా..? పుడితే ఎక్కడ ఎలా పుడతారు..? ఆయన ఆత్మ మాట్లాడిందా.. మరి ఇంతకాలం ఆ సంగతి బయటకు ఎందుకు రాలేదు.. తాజాగా ఆయన 26వ వర్ధంతి సందర్భంగా లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు..

  Lakshmi Parvathi: ఎన్టీఆర్ 26వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులంతా నివాళులర్పించారు. ఇదే సమయంలో వైసీపీ నేత.. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి  (Lakshmi Parvathi)నివాళులర్పించిన తరువాత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ (NTR) చనిపోయినప్పుడు ఆయన ఆత్మతో మాట్లాడానని.. అయితే దానికి సంబంధించిన రహస్యాన్ని 26 ఏళ్ల తరువాత బయటపెడుతున్నాను అన్నారు ఆమె. ఎన్టీఆర్ చనిపోయిన సమయంలోనే  జీవిత, రాజశేఖర్‌ (Jeevitha Rajasekhar) తనను మద్రాస్ తీసుకెళ్లి ఒక అమ్మాయితో మాట్లాడించారన్నారు. అప్పుడు ఎన్టీఆర్ ఆత్మ 16 ఏళ్ల అమ్మాయిలో ప్రవేశించిందని.. ఆ అమ్మాయితోనే మాట్లాడాను అన్నారు. తనతో ఆ అమ్మాయి అనేక విషయాలు పంచుకుందని లక్ష్మీపార్వతి తెలిపారు. ముఖ్యంగా ఎన్టీఆర్ మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) నే జన్మిస్తామని ఆ రోజు లక్ష్మి పార్వతికి చెప్పారంట.. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరి ముఖ్యమంత్రుల మనస్సులో తాను ఉంటాను అన్నారంట.. ముఖ్యమంత్రి ఎవరైనా వారు ప్రజలకు మంచి చేయాలని తాను ప్రబోధం చేస్తుంటానని ఆయన ఆత్మ తనతో చెప్పిందన్నా లక్ష్మీ పార్వతి..

  ఆ అమ్మాయితో మాట్లాడినప్పటి నుంచి తనకు ఓ నమ్మకమం ఏర్పడింది అన్నారు లక్ష్మీ పార్వతి. ఆయన ఎక్కడ ఉన్నా.. ఎన్టీఆర్ ఎప్పుడూ తెలుగు ప్రజలను విడిచిపెట్టి ఉండరని లక్ష్మీపార్వతి అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ ఆత్మ ఇక్కడే.. మన మధ్యే ఉంటుందని ఆమె అన్నారు. ఈ ఘాట్‌ దగ్గరని కాదు కానీ.. తెలుగు రాష్ట్రాల ప్రజలు అందరి దగ్గర ఆయన ఆత్మ తిరుగుతూ బాగోగులు చూసుకుంటోందని ఆమె వెల్లడించారు. ఎన్టీఆర్ మహానుభావుడని.. ఎప్పటికీ ప్రజల మనసుల్లో చిరస్మరణీయంగా ఉంటారని తెలిపారు. జాతికి ఇలాంటి వారు ఒకళ్లే పుడతారని ఆమె అభిప్రాయపడ్డారు.  తెలుగువారి గౌరవాన్ని చాటిన మహనీయుడు ఎన్టీఆర్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారన్నారు.

  ఇదీ చదవండి : ఏపీలో మళ్లీ పీఆర్సీపై రచ్చ.. సమ్మెకు సై అంటున్నఉద్యోగ సంఘాలు

  అప్పట్లో జాతీయ స్థాయిలో బలంగా ఉన్న కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్నో పార్టీలను ఏక తాటిపైకి తెచ్చిన ఘనత ఎన్టీఆర్ దే అన్నారు. తాను బతికున్నంత వరకు ఎన్టీఆర్ తనకు తోడుగా ఉంటారని అభిప్రాయపడ్డారు. అడుగుడుగనా తనను రక్షించుకుంటూనే ఉన్నారన్నారు. ఆయన జ్ఞాపకాల్లోనే తాను ఇంకా బతుకుతున్నాను అన్నారు.

  ఇదీ చదవండి : రాజకీయ నాయకులను భయపెడుతున్న కరోనా.. ఇప్పటి వరకు వైరస్ బారిన పడ్డవారు వీరే

  మరోవైపు ఏపీలో ఎన్టీఆర్ విగ్రహాల ధ్వంసం ఘటనలపైనా లక్ష్మీపార్వతి స్పందించారు. ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేయించడం ద్వారా సీఎం జగన్ చాలా హుందాగా వ్యవహరించారని ప్రశంసించారు. దుర్గిలో విగ్రహ ధ్వంసంపై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో మాట్లాడి వాస్తవాలు తెలుసుకున్నానని తెలిపారు. ప్రతిపక్షాలు హుందాగా వ్యవహరించాలని ఆమె సూచించారు. అయితే ఇంతకాలం ఆమె ఎందుకు  ఆ విషయం గురించి చెప్పలేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అలాదే ఏన్టీఆర్ విగ్రహం పై దాడి జరిగితే.. ఆయన సతీమణి అయిన లక్ష్మీ పార్వతి స్పందన అదేనా అని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

  First published:

  ఉత్తమ కథలు