Sajjala: తెలుగు రాష్ట్రాల్లో కుందుకూరు ఘటనపై రాజకీయ దుమారం ఆగడం లేదు. టీడీపీ (TDP) సభలో తొక్కిసలాట ఘటనలో తప్పెవరిది అనే దానిపై రచ్చ రచ్చ జరుగుతోంది. ఈ ఘటన ఎలా జరిగినా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్స్ గ్రేషియో ప్రకటించాయి. మరోవైపు ఈ ఘటనకు ప్రధాన కారణం ఏంటి అన్నదానిపైనా.. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. తాజాగా ఏపీ ప్రభుత్వ (AP Government) సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Rama Krishna Reddy) ఘాటుగా స్పందించారు. చంద్రబాబు (Chandrababu) పబ్లిసిటీ పిచ్చికి 8 ప్రాణాలు పోయాయని ఆరోపించారు. ఇది అనుకోకుండా జరిగిన ఘటన కాదని.. చంద్రబాబు వికృత విన్యాసంలో భాగంగానే ఈ నరబలి జరిగిందంటూ సజ్జల తీవ్రంగా ఆరోపించారు. కావాలనే ఇరుకు రోడ్డులో చంద్రబాబు సభ పెట్టారని సజ్జల ఆరోపించారు.
అక్కడ ఉన్నది చిన్న ఇరుకైన రోడ్డు.. కానీ అక్కడ రోడ్డుకి ఇరువైపుల ఫ్లెక్సీలు కట్టి.. 100 అడుగుల రోడ్డుని 30 అడుగుల టన్నెల్‌గా మార్చారని సజ్జల విమర్శించారు. కనీసం జరిగిన తరువాత అయినా ఎవరిలోనైనా పశ్చాత్తాపం ఉంటుందని.. కానీ ఇంత జరిగినా చంద్రబాబులో ఎక్కడా పశ్చాత్తాపం కనిపించడం లేదని సజ్జల విమర్శించారు.
అంతేకాదు పెద్ద విషాదం చోటు చేసుకున్నా..? ఎవరిలోనైనా పశ్చాత్తాపం కనిపిస్తుంది. కానీ దీన్ని కూడా ఎలా ఉపయోగించుకోవాలా అని ఆలోచిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. కందుకూరు ఘటనపై చంద్రబాబుకి మాట్లాడే అర్హత లేదని.. ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి : అన్నదమ్ముల మధ్య ముదిరిన వైరం.. టీడీపీ శ్రేణుల్లో కలవరం
అంతకుముందు పుష్కరాల్లోనూ అమాయక ప్రజలను బలి తీసుకున్నారంటూ సజ్జలు విమర్శలు గుప్పించారు. కందుకూరు ఘటనకు చంద్రబాబే పూర్తిగా బాధ్యత వహించాలని పేర్కొన్నారు. చంద్రబాబుది శవాలపై పేలాలు ఎరుకునే మనస్తత్వమని.. యజ్ఞంలో ప్రాణాలు అర్పించారు అని మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉద్యమం, సమిధలు, పోరాటం అని మాట్లాడుతున్నారని.. 8 మందిని బలి తీసుకోవడం మామూలు విషయమా..? అంటూ వ్యాఖ్యానించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Sajjala ramakrishna reddy