Home /News /andhra-pradesh /

YCP LEADERS ATTACK TDP LEADERS AND SMASH SHOPS IN GUNTUR NK

టీడీపీ నాయకుల ఇళ్లపై వైసీపీ దాడులు... ఘటనపై లోకేష్ ఫైర్

నారా లోకేష్ (File)

నారా లోకేష్ (File)

Andhra Pradesh : రాజకీయ విశ్లేషకులు అంచనా వేసినట్లే జరుగుతోంది. ఏపీలో... వైసీపీ వర్సెస్ టీడీపీ పోరు నానాటికీ ఉద్ధృతమవుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడే... ఇక టీడీపీ నేతలకి చుక్కలు చూపిస్తారనీ, సమస్యలు తప్పవని చాలా మంది అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఏపీ జిల్లాల్లో అదే జరుగుతోంది. ఎక్కడికక్కడ టీడీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలే టార్గెట్‌గా రాజకీయ దాడులు జరుగుతున్నాయి. దీనిపై ఇప్పటికే టీడీపీ అధినాయకత్వం గగ్గోలు పెడుతోంది. తాజాగా... గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడిలో టీడీపీ నాయకుల ఇళ్లు, షాపులపై వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. వినాయక నిమజ్జనం సందర్భంగా టీడీపీ నేతల ఇళ్ల వైపు వెళ్తూ... మందు బాటిళ్లను ఆ ఇళ్లపైకి విసిరేశారు. దగ్గర్లోని షాపుల అద్దాల్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఓ మహిళ తలకు పెద్ద గాయాలయ్యాయి. ఇలాగైతే తాము బతకలేమనీ... తమను చంపేస్తున్నారనీ... బాధితులు లబోదిబో మంటున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు... అక్కడ అదనపు సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.

ఇలాంటి దాడులపై నిన్న మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ స్పందించారు. బాధితుల్ని కలిసిన ఆయన... కొత్త ప్రభుత్వం రాజన్న రాజ్యం తెస్తుందని అనుకుంటే రాక్షస రాజ్యం తెచ్చిందని విమర్శించారు. ఏ తప్పుచేయకపోయినా అక్రమ కేసులు పెట్టి అమాయకులను ఇబ్బంది పెడుతున్నరనీ, కులమతాలకు అతీతంగా టీడీపీకి ఓటు వేసిన ప్రతీ ఒక్కరని టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. 100 రోజులు ఓపిక పట్టి సహనంగా ఉన్నామనీ ఇక ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. దాడుల బాధితులకు రూ.10 వేలు సాయంతో పాటు వాళ్ల పిల్లలకు ఉన్నత విద్య అందిస్తామన్నారు.
Published by:Krishna Kumar N
First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Nara Lokesh

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు