AP Capital: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజధానిపై జరుగుతున్న రచ్చను చల్లార్చే ప్రయత్నం చేశారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల. సుప్రీం కోర్టు తీర్పునకు లోబడే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) వైజాగ్ (Vizag) వెళ్తారని స్పష్టం చేశారు. అలాగే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Buggana Rajendranath Reddy) వ్యాఖ్యలపై వివాదాన్ని సద్దుమణిగేలా చేసేందుకు.. తాను క్లారిటీ ఇస్తున్నాను అన్నారు. బుగ్గన వ్యాఖ్యలు పూర్తిగా పరిశీలిస్తే.. వికేంద్రీకరణకు మద్దతుగానే ఉన్నాయన్నారు.. ఏదేమైనా మూడు ప్రాంతాల అభివృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు.. ప్రధాన వ్యవస్థలు మూడు ప్రాంతాల్లో పెడతామన్నారు. మరింత మెరుగైన విధంగా చట్టం తెస్తామన్నారు.
తమ ప్రభుత్వం ముందు నుంచి చెబుతునట్టు.. విశాఖపట్నంలో సెక్రటేరియట్ ఉంటుంది.. అమరావతిలో అసెంబ్లీ.. కర్నూలులో హైకోర్టు ఉంటాయని మరోసారి స్పష్టం చేశారు సజ్జల.. రాజధాని అనేది కేవలం మనం పెట్టుకునే పేరు మాత్రమే అన్నారు. అమరావతిలో మాత్రమే మొత్తం రాజధాని ఉండాలనుకునేవారు మాత్రమే ఇలా లేనిపోని గందరగోళం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి : ఇన్ఫోసిస్ రాకకు డేట్ ఫిక్స్.. వారికి మాత్రమే అవకాశం.. పూర్తి వివరాలు ఇవే
అసలు ఇంతకీ బుగ్గన ఏమన్నారంటే..? బెంగళూరులో జరిగిన రోడ్ షోలో ఏపీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుగ్గన.. ఏపీ రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులు అంటూ ప్రజల్లోకి మిస్ కమ్యూనికేట్ అయిందని, ఏపీ పరిపాలన విశాఖ నుంచే జరుగుతుందని.. తద్వారా ఏపీకి విశాఖ ఒక్కటే రాజధాని అనే సంకేతాలిచ్చారు.
ఏపీకి మూడు రాజధానులు అనే కాన్సెప్ట్ వాస్తవం కాదు అన్నారు. అందుబాటులో ఉన్న మౌలిక వసతుల పరంగా చూస్తే ఏపీ రాజధానిగా విశాఖే బెస్ట్ అని.. రాష్ట్ర పాలన అంతా విశాఖ నుంచే జరుగుతుందన్నారు. తమ ప్రభుత్వ నిర్ణయం కూడా అదే అన్నారు.. విశాఖ ఇప్పటికే ఓడరేవు నగరంగా, కాస్మోపాలిటన్ నగరంగా గుర్తింపు పొందిందని. భవిష్యత్ లోనూ విశాఖ అభివృద్ధికి ఎంతో అవకాశం ఉందని.. కర్నూలు రెండో రాజధాని కాదన్నారు. అక్కడ కేవలం హైకోర్టు ప్రధాన బెంచ్ ఉంటుందంతే అన్నారు. కర్ణాటకలోని ధార్వాడ్, గుల్బర్గాలలో హైకోర్టు బెంచ్ లు ఉన్నాయన్నారు.
ఇదీ చదవండి : కాపుల చుట్టూ కమలం ప్రదక్షిణలు.. ఇటు ఎంపీ జీవీఎల్.. అటు వైపు కన్నా..? అసలు ప్లాన్ ఇదే
ఆ వ్యాఖ్యలను సమర్థించుకుంటూ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. శ్రీశైలంలో పర్యటించిన ఆయన.. సీఎం జగన్ చెప్పినట్టు త్వరలోనే పరిపాలన వైజాగ్ నుంచి జరుగుతుందన్నారు. విభజన సమయంలో రెవిన్యూ లోటు, ఆర్థిక ఇబ్బందులు ఉన్న మాట వాస్తవం అన్నారు. ఉద్యోగుల జీతాలు ఒకటి, రెండు రోజులు లేట్ అవడం కొత్తేమీ కాదన్నారు. గతంలోనూ జరిగాయన్నారు. 1920 శ్రీబాగ్ ఒప్పందం అంటే వికేంద్రీకరణ అందరికీ తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap capital, AP News, Buggana Rajendranath reddy, Sajjala ramakrishna reddy