Home /News /andhra-pradesh /

YCP LEADER SAJJALA RAMA KRISHNA REDDY KEY COMMENTS ON CHANDRABABU NAIDU AND POWER CHARGES NGS

Current Shock in AP: విద్యుత్ చార్జీలు పెంచడానికి చంద్రబాబే కారణం.. వైసీపీ నేత సంచలన ఆరోపణలు

విద్యుత్ ఛార్జీలు పెరగడానికి కారణం చంద్రబాబే-సజ్జల

విద్యుత్ ఛార్జీలు పెరగడానికి కారణం చంద్రబాబే-సజ్జల

Current Shock in AP: ఆంధ్రప్రదేశ్ లో సామాన్యుడి నడ్డి విరిగింది. విద్యుత్ ఛార్జీల మోతతో మరో భారం పడింది. ఇప్పటికే దీనిపై పొలిటికల్ మంటలు చెలరేగుతున్నాయి. ఈ పరిస్థితికి చంద్రబాబు నాయుడే కారణం అంటూ వైసీపీ కీలక నేత సంచలన ఆరోపణలు చేశారు.. వైసీపీ ప్రభుత్వంలో ధరలు పెరుగుదలకు చంద్రబాబుతో లింకేంటి అనుకుంటున్నారా..?

ఇంకా చదవండి ...
    Current Shock in AP:  ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఛార్జీల పెంపు వ్యవహారంపై పొలిటికల్ మంటలు చెలరేగుతున్నాయి.  విద్యుత్ ఛార్జీల బాదుడుపై  (AP Electricity Charges) పై ప్రతిపక్షాలు  తీవ్ర స్థాయిలో  మండిపడుతున్నాయి. అంతేకాదు ప్రతిపక్షంలో ఉండగా బాదుడే.. బాదుడు అంటూ ప్రస్తుత సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) చేసిన విమర్శలు, కామెంట్స్ ను వైరల్ చేస్తన్నాయి.  వైసీపీ ప్రభుత్వం మూడేళ్లలో ఏడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిందని టీడీపీ ఆరోపిస్తోంది. మరోవైపు దీనిపై దశల వారీ పోరాటినికి సిద్ధమైంది. ఇటు కమ్యూనిస్టు పార్టీలు ఇప్పటికే ఆందోళన బాట పట్టాయి.  అసలు ఈ చార్జీల పెరుగుదలకు అసలు  కారణం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే అంటూ అధికార పార్టీ విమర్శిస్తోంది.

    విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై మోయలేని భారం వేస్తుందంటూ చంద్రబాబు చేసిన ఆరోపణలపై ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి స్పందించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి వల్ల తప్పని పరిస్థితుల్లో విద్యుత్ చార్జీలు స్వల్పంగా పెరిగాయని పేర్కొన్నారు. ప్రజలపై భారం పడుతుందని తెలిసినా విద్యుత్ చార్జీలు పెంచడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో స్వల్పంగా కూడా చార్జీలు పెరగకుండా చర్యలు తీసుకుంటున్నామని సజ్జల అన్నారు. రాష్ట్రంలో నేడు విద్యుత్ చార్జీలు పెంచడానికి కారణం ఆనాడు చంద్రబాబు చేసిన తప్పిదాలే అంటూ సజ్జల మండిపడ్డారు.

    ఇదీ చదవండి : ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సొంతింటి కల నేరవేర్చే దిశగా అడుగులు

    2014-19 మధ్య చంద్రబాబు భారీగా అప్పు, బకాయిలు ప్రభుత్వానికి మిగిల్చి వెళ్లారని.. టీడీపీ హయాంలో అడ్డదిడ్డంగా విద్యుత్ చార్జీలు పెంచారని సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 500 యూనిట్ల వరకూ ఒక్క పైసా కూడా పెంచలేదన్న సజ్జల.. మూడేళ్లుగా తమ ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచకుండా.. ప్రజలపై భారం వేయకుండా ప్రభుత్వంమే భరించిందని అన్నారు. విద్యుత్ చార్జీల పెంపుపై నిన్నటి నుండి ప్రతిపక్ష పార్టీలు గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నాయని సజ్జల మండిపడ్డారు.

    ఇదీ చదవండి : ప్రజల కోరిక మేరకు విద్యుత్ చార్జీలు పెంపు.. ప్రభుత్వం వివరణపై ఆగ్రహ జ్వాలలు

    అప్పులు చేసినా చంద్రబాబులా దుబారా ఖర్చులు చెయ్యలేదన్నారు సజ్జల.. వైసీపీ ప్రభుత్వం ఆ అప్పులన్నీ ప్రజల సంక్షేమం కోసమే ఖర్చు చేసినట్లు తెలిపారు. పెట్రోల్, డీజిల్ పై రోజుకి రూపాయి పెంచే బీజేపీ కూడా తమపై విమర్శలు చేస్తుందని సజ్జల రామకృష్ణ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. పెట్రో ధరల పెంపుపై జీవీఎల్, సోము వీర్రాజు కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదన్న ఆయన..చేతనైతే బీజేపీ నేతలు రేపటి నుండి పెట్రోల్ రేట్లు పెరగకుండా చూడాలంటూ విమర్శించారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Chandrababu Naidu, Sajjala ramakrishna reddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు