YSRCP Leader: అందుకే అలా చేశా..! తన తప్పులేదంటున్న వైసీపీ మహిళా నేత

YSRCP Leader: అందుకే అలా చేశా..! తన తప్పులేదంటున్న వైసీపీ మహిళా నేత

టోల్ ప్లాజా వద్ద వైఎస్ఆర్సీపీ మహిళానేత దేవళ్ల రేవతి వాగ్వాదం

గుంటూరు జిల్లా కాజా టోల్ ప్లాజా వద్ద జరిగిన ఘటనలో తన తప్పేం లేదని ఆంధ్రప్రదేశ్ వడ్డెర కార్పొరేషన్ ఛైర్ పర్సన్ దేవళ్ల రేవతి స్పష్టం చేశారు. టోల్ ప్లాజా సిబ్బందే తనపై దౌర్జన్యం చేశారన్నారు.

  • Share this:
    కాజా టోల్ ప్లాజ్ ఘటనలో తనకేం సంబంధం లేదని ఆంధ్రప్రదేశ్ వడ్డెర కార్పొరేషన్ ఛైర్ పర్సన్ దేవళ్ల రేవతి స్పష్టం చేశారు. టోల్ ప్లాజా సిబ్బందే తనపై దౌర్జన్యం చేశారన్నారు. తన తల్లిని గుంటూరు నుంచి విజయవాడ ఆస్పత్రికి తరలిస్తుండగా టోల్ ప్లాజ్ సిబ్బంది అడ్డుకున్నారన్నారు. టోల్ ప్లాజా సిబ్బందితో పాటు సివిల్ డ్రెస్ లో ఉన్న గూండాలు తనతో అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా కారు డ్రైవర్ ను దుర్భాషలాడినట్లు ఆరోపించారు. అరగంట పాటు తనను రోడ్డుపైనే అడ్డుకొని దూషించారని ఆరోపించారు. కేవలం తాను వాగ్వాదమాడిన వీడియోలోనే బయటపెట్టి తన పరువు తీస్తున్నారని మండిపడ్డారు. టోల్ ప్లాజ్ సీసీ ఫుటేజ్ కూడా బయటపెడితే నిజాలు తెలుస్తాయని చెప్పారు.

    ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ ఛైర్ పర్సన్ గా నియమితులైన దేవుళ్ల రేవతి గుంటూరు నుంచి విజయవాడ వస్తుండగా.. కాజా టోల్ ప్లాజా వద్ద సిబ్బంది టోల్ చెల్లించాఛల్సిందిగా కోరారు. దీంతో ఆమె టోల్ ప్లాజా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అడ్డుగా పెట్టిన బారికేట్లని స్వయంగా ఆమె తోసేశారు. అక్కడితో ఆగకుండా సిబ్బందిపై కేకలు వేశారు. రేవతి వాగ్వాదానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

    వాళ్లే దౌర్జన్యం చేశారు: రేవతి
    టోల్ ప్లాజా ఘటనలో తన తప్పేం లేదని వడ్డెర కార్పొరేషన్ ఛైర్ పర్సన్ రేవతి స్పష్టం చేశారు. తన తల్లి మెట్లపై నుంచి పడిపోవడంతో కాలికి గాయమైందని.. ఆమెను విజయవాడలోని రమేష్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా టోల్ ప్లాజా సిబ్బంది అడ్డుకున్నారన్నారు. తాను ఫలానా అని చెప్పినా తక్కువ చేసి మాట్లాడుతూ దుర్భాషలాడినట్లు చెప్పారు. టోల్  పాస్ అయ్యేందుకు తనకు లోకల్ పాస్ ఉందని చెప్పినా అక్కడి సిబ్బంది పట్టించుకోలేదన్నారు. తనకు జరిగిన అవమానం మొత్తం మహిళా లోకానికే జరిగిన అవమానం అని చెప్పారు. నిన్న జరిగిన ఘటనపై టీడీపీ నేతలు, కార్యకర్తలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అకారణంగా సోషల్ మీడియాలో తన పరువు తీస్తున్నారని ఆమె ఆరోపించారు. టోల్ ప్లాజా సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్న ఆమె.. సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై డీజీపీకి కంప్లైంట్ ఇచ్చినట్లు తెలిపారు.
    Published by:Purna Chandra
    First published: