హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Assembly: క్రాస్ ఓటింగ్ అనుమానంతో ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయొచ్చా..? ఆ నలుగురి భవిష్యత్తు కార్యచరణ ఏంటి..?

AP Assembly: క్రాస్ ఓటింగ్ అనుమానంతో ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయొచ్చా..? ఆ నలుగురి భవిష్యత్తు కార్యచరణ ఏంటి..?

సీఎం జగన్ కు వరుస షాక్ లు

సీఎం జగన్ కు వరుస షాక్ లు

AP Assembly: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి షాకిచ్చారు నలుగురు ఎమ్మెల్యేలు.. దీంతో బలం లేకున్నా టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. జరిగింది రహస్య ఓటింగే అయినా.. క్రాస్ ఓట్ చేసింది ఎవరో తమకు తెలుసని.. నలుగురు ఎమ్మెల్యేలను అధిష్టానం సప్పెండ్ చేసింది.. మరి వారు ఏం చేయబోతున్నారు.. వైసీపీ అధిష్టానం నిర్ణయం సరైందేనా..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Guntur, India

Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

AP Politics:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీలో అసమ్మతి జ్వాలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అందులో భాగంగానే తాజాగా జరిగిన  ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLA Quota MLC Elections).. బలం లేకపోయినా టీడీపీ (TDP) అభ్యర్ధిని విజయం వరించింది. ఏడు ఎమ్మెల్సీ సీట్లు గెలవాలనుకున్న వైసీపీ (YCP) కి ఊహించని షాక్ తగిలింది. అయితే సొంత పార్టీ ఎమ్మెల్యేలే.. ప్రత్యర్ధి పార్టీకి క్రాస్ ఓటు వేయడంతో ఇలా జరిగిందని వైసీపీ అంచనాకు వచ్చింది.  ఓ నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారని వైసీపీ పెద్దలు అనుమానిస్తున్నారు.  క్రాస్ ఓటింగ్ చేశారనే అనుమానంతో ఆనం. రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy) , కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) , ఉండవల్లి శ్రీదేవి (Undavalli Sridevi) , మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (Mekapati Chandrasekhar Reddy) లను సస్పెండ్ చేస్తున్నట్లు సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishnareddy)  ప్రకటించారు.

ఈ నలుగురు ఎమ్మెల్యేలు..  ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు నుంచి క్రాస్ ఓటింగ్ వేసేందుకు కోట్లాది రూపాయలు తీసుకున్నట్లు పార్టీ భావిస్తున్నట్లు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అయితే తమ పార్టీ అంతర్గత విచారణలో వీరు క్రాస్ ఓటింగ్ చేసినట్లు నిరూపితమైందన్నారు సజ్జల..  ఆ నలుగురూ అమ్ముడు పోయారని చెప్తూనే తమ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవన్నారు.

ఆనం, కోటంరెడ్డి ల వ్యవహారం అందరికీ తెలిసిందే. వారు మొదటి నుంచి వైసీపీకి వ్యతిరేకంగానే ఓటు వేస్తారనే ప్రచారం ఉంది. అయితే  శ్రీదేవీ, చంద్రశేఖర్  రెడ్డిలు వెర్షన్ మాత్రం వేరేలా ఉంది.  తాము పార్టీ చెప్పిన వారికే ఓటేశామని చెబుతున్నారు. అయితే రహస్య ఓటింగ్ లో వారు మాత్రమే ఓటు వేశారని ఎలా చెబుతారు అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఆయా ఎమ్మెల్యేల అనుచరుల వాదన కూడా అదే.. ఎలాంటి వివరణ తీసుకోకుండా..? ఆదారాలు లేకుండా ఇలాంటి చర్యలు తీసుకోవడం సరైంది కాదంటున్నారు ఆయా ఎమ్మెల్యేల అనుచరులు.

ఇదీ చదవండి : ఆ స్కామ్‌లో చంద్రబాబుకు భారీ ముడుపులు.. అసెంబ్లీలో సీఎం జగన సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

అయితే కొన్నాళ్ళ పాటు వారిని అలా వదిలేస్తే ఇంకా ఎంతమంది అసమ్మతులు ఉన్నారు అనే విషయం కనిపెట్టే అవకాశం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇలాంటి సంఘటనల కారణంగా పార్టీలో మిగిలిన నాయకులలో  అభధ్రతా భావం పెరిగే అవకాశం ఉందంటున్నారు.  దీంతో  అంతిమంగా పార్టీకి నష్టం చేసే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఇది పార్టీ అంతర్గత వ్యవహారం అంటున్నారు ఆ పార్టీ పెద్దలు.

ఇదీ చదవండి: ఆ ఇద్దరు చరిత్ర హీనులే.. వచ్చే ఎన్నికల్లో టీడీపికి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన రోజా

ఏది ఏమైనప్పటికీ పార్టీ లైన్ కి వ్యతిరేకంగా పనిచేసిన వారు ఎవరైనా, వాళ్ళు ఎంతటి వారైనా ఖచ్ఛితంగా చర్యలు తీసుకుని తీరవలసిందే. కానీ వారి మీద వచ్చిన ఆరోపణలపై ఆధారాలు కూడా బయట పెడితే ప్రజలు పార్టీని నమ్ముతారని.. ఆయా నేతల అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, Ap mlc elections, AP News

ఉత్తమ కథలు