వైసీపీ విజయం... టీడీపీ ఓటమి... ఆ సర్వే ప్రకారం ఈ ఫలితం

AP Assembly Election 2019 : ఎగ్జిట్ పోల్ ఫలితాల్ని కూడా చూసేసిన మనకు... ఇప్పటికీ గెలుపు ఎవరిది అన్నది తేలని అంశం. గురువారం లీడింగ్‌లో ఏ పార్టీ అభ్యర్థులు ఉంటే, ఆ పార్టీ గెలిచిందని చెప్పుకోవచ్చు. మరి ఈ సర్వే సంగతేంటి?

Krishna Kumar N | news18-telugu
Updated: May 22, 2019, 10:38 AM IST
వైసీపీ విజయం... టీడీపీ ఓటమి... ఆ సర్వే ప్రకారం ఈ ఫలితం
చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్(File)
  • Share this:
ఏపీ ఎన్నికలపై ఈ నెల 19 రకరకాల ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. వాటిలో కొన్ని ప్రధాన సంస్థలు ఇచ్చిన ఫలితాలు తాము ఊహించినవే అని అటు వైసీపీ, ఇటు టీడీపీ రెండూ చెప్పుకున్నాయి. ఐతే 9 సంస్థలు వైసీపీకి అనుకూలంగా ఫలితాలు ఇస్తే, రెండు సంస్థలు, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్... టీడీపీకి అనుకూలంగా అంచనాలు ఇచ్చిన విషయం మనకు తెలుసు. తాజాగా మరో పేరున్న సంస్థ ఎగ్జిట్ పోల్స్ కాస్త ఆలస్యంగా విడుదల చేసింది. ప్రముఖ నేషనల్ పేపర్ ది హిందూ- సీఎస్‌డీఎస్-లోక్‌నీతి సంస్థ ఈ ఎగ్జిట్ పోల్స్‌ను ప్రకటించింది. ఈ సంస్థ ఎన్ని సీట్లు అన్నది చెప్పకుండా... ఎంత శాతం ఓట్లు ఏ పార్టీకి వచ్చాయన్నది చెప్పింది. ఆ ప్రకారం వైసీపీకి అధిక శాతం ఓటింగ్ వచ్చిందని చెప్పింది. అలా చూస్తే వైసీపీ గెలిచినట్లే. అదెలాగో, ఎందుకో చూద్దాం.

ది హిందూ- సీఎస్‌డీఎస్-లోక్‌నీతి సంస్థ ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం... ఏపీలో వైసీపీకి 43 శాతం ఓట్లు... టీడీపీకి 38 శాతం ఓట్లు పడతాయట. ఆ రకంగా చూస్తే... రెండు పార్టీల మధ్యా ఓట్ల తేడా 5 శాతం ఉంది. మీకు గుర్తుండే ఉంటుంది... 2014లో వైసీపీ కంటే టీడీపీ ఎక్కువగా సాధించిన ఓట్లు 1.95 శాతమే. అప్పట్లో టీడీపీ 102 స్థానాలు గెలిస్తే, వైసీపీ 67తో సరిపెట్టుకుంది. ఈసారి అందుకు రివర్స్‌గా టీడీపీ కంటే వైసీపీ 5 శాతం ఎక్కువ ఓట్లు పొందుతుందని ఈ సర్వే చెబుతోంది. దానర్థం వైసీపీ గెలుస్తుందని అనుకోవచ్చు. ఐతే, కొన్ని సందర్భాల్లో మాత్రం ఓట్ల శాతం ఎలా ఉన్నా... దానితో సంబంధం లేకుండా... గెలుపు అవకాశాలుంటాయని కూడా మనకు తెలుసు.

వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులూ అందరూ ఇలాంటి సర్వేలను సూపర్ అంటున్నారు. అదే సమయంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు మాత్రం వీటిని తప్పుపడుతున్నారు. సర్వే తమకు అనుకూలంగా ఉంది కాబట్టి వైసీపీ వర్గం మెచ్చుకోవడంలో ఆశ్చర్యం లేదు. ఏపీ ఓటర్ల నాడిని పట్టుకోవడంలో సర్వే సంస్థలు ఫెయిలవుతున్నాయని టీడీపీ ఆరోపించడం కూడా సహజమే ఎందుకంటే సర్వేలు ఆ పార్టీకి అనుకూలంగా లేవు కాబట్టి... ఏ సర్వేలు ఎలా ఉన్నా... గురువారం నాటి తీర్పు మాత్రం ఒరిజినల్. సో... మధ్యమధ్యలో ఇలాంటి సర్వేలను తెలుసుకుంటూనే అసలు ఫలితాల కోసం ఎదురుచూద్దాం.

 

ఇవి కూడా చదవండి :

నెల్లూరులో ఉగ్రవాదుల కలకలం... ఇస్రోను టార్గెట్ చేస్తున్నారా...

ఏపీలో మళ్లీ ఎన్నికలు తప్పవా... టీడీపీ ప్లాన్ అదేనా... వైసీపీ ఏం చేస్తుంది ?ఢిల్లీ మాల్ స్పాలో సెక్స్ రాకెట్... ఒక్కో పనికి ఒక్కో రేటు

పబ్‌జీ ఆడొద్దన్నందుకు భర్తపై కోపం... విడాకులు కోరిన భార్య
First published: May 22, 2019, 10:38 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading