టీడీపీకి షాక్... వైసీపీ ఖాతాలోకి గోదావరి జిల్లాలు... కొత్త సర్వేలో ఆసక్తికర అంశాలు...

AP Assembly Election 2019 : 2014లో గోదావరి జిల్లాల ఓటర్లు టీడీపీకి జై కొట్టారు. మరి ఈసారి వైసీపీకి మొగ్గు చూపారంటోంది ఆ సర్వే... ఆ వివరాలు తెలుసుకుందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: April 29, 2019, 6:43 PM IST
టీడీపీకి షాక్... వైసీపీ ఖాతాలోకి గోదావరి జిల్లాలు... కొత్త సర్వేలో ఆసక్తికర అంశాలు...
జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్
  • Share this:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గోదావరి జిల్లాల ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందన్నది ఆసక్తి రేపుతోంది. ప్రధానంగా గోదావరి జిల్లాల్లో ఏ పార్టీ గెలిస్తే, ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. అందుకు తగ్గట్టే 2014లో టీడీపీకి జైకొట్టగా... ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి 2019లో ప్రజలు ఎవరివైపు నిలిచారన్న దానిపై ఇప్పటికే చాలా రకాల విశ్లేషణలు తెరపైకి వచ్చాయి. తాజాగా మరో సర్వే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో చెప్పిన అంశాలు ఆసక్తి రేపుతున్నాయి. ప్రధానంగా గోదావరి జిల్లాల్లో టీడీపీ బలహీన పడగా, వైసీపీ బలపడిందనీ, జనసేన కొంత ప్రభావం చూపిస్తోందని లెక్కలేసింది. ఆ వివరాలు ఇవీ....

తూర్పు గోదావరి జిల్లా : ఈ జిల్లాలో 19 అసెంబ్లీ స్థానాలున్నాయి. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ 12 స్థానాలు గెలుచుకోగా... అప్పటి టీడీపీ మిత్రపక్షం బీజేపీ 1 స్థానాన్ని సొంతం చేసుకుంది. వైసీపీ 5 చోట్ల సత్తా చాటింది. ఆ సర్వే ప్రకారం 2019లో టీడీపీ 6 చోట్ల కచ్చితంగా గెలుస్తుందనీ, మరో 3 స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయనీ తెలుస్తోంది.

ఇక వైసీపీ విషయానికొస్తే ఆ పార్టీ 7 స్థానాల్లో కచ్చితంగా గెలుస్తుందనీ, 2 స్థానాల్లో టీడీపీకి, 1 స్థానంలో జనసేనకి పోటీ ఇస్తుందని తెలిసింది. ఇక గోదావరి జిల్లాల్లో ప్రభావం చూపిస్తుందని చెప్పుకుంటున్న జనసేన 2 స్థానాల్లో కచ్చితంగా గెలుస్తుందని, మరో స్థానంలో టీడీపీకి పోటీ ఇస్తుందని తెలిసింది. ఓవరాల్‌గా ఈ జిల్లాలో ఆ సర్వే ప్రకారం టీడీపీ బలం తగ్గగా... వైసీపీ పుంజుకుంది. ఐతే, ఎన్నికల తర్వాత టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటే, టీడీపీ కూటమి, వైసీపీ మధ్య హోరాహోరీ ఉంటుందని అంచనా వేసింది.

పశ్చిమ గోదావరి జిల్లా : ఈ జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలున్నాయి. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ మొత్తం 15 అసెంబ్లీ స్థానాలనూ గెలుచుకుంది. అందువల్ల ఈసారి ఒక్క స్థానం తగ్గినా జిల్లాలో ఆ పార్టీ బలహీన పడినట్లే. తాజా సర్వే ప్రకారం టీడీపీ 4 స్థానాల్లో కచ్చితంగా గెలుస్తుందనీ, మరో 2 స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయనీ, మరో స్థానంలో వైసీపీకి గట్టి పోటీ ఇస్తుందని తెలిసింది.

ఇక వైసీపీ విషయానికొస్తే, 2014లో ఈ జిల్లాలో ఒక్క స్థానమూ గెలవని ఆ పార్టీ ఈసారి 6 స్థానాల్లో కచ్చితంగా గెలుస్తుందనీ, మరో స్థానంలో గెలిచే అవకాశాలు ఉన్నాయనీ, మరో రెండు స్థానాల్లో టీడీపీ, జనసేనకు పోటీ ఇస్తోందని తెలిసింది. ఇక ఈ జిల్లాలో జనసేన 1 స్థానంలో కచ్చితంగా గెలుస్తుందనీ, మరో స్థానంలో గెలిచే అవకాశం ఉందనీ, ఇంకో స్థానంలో టీడీపీకి గట్టి పోటీ ఇస్తోందని సర్వే చెబుతోంది. క్షేత్ర స్థాయిలో ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని, అత్యంత టెక్నికల్ అంశాల్ని జోడించి ఈ సర్వే చేసినట్లు చెబుతున్నారు.

ఇవీ కారణాలు : గోదావరి జిల్లాల్లో టీడీపీ బలహీనపడటానికీ, వైసీపీ బలపడటానికీ కాస్ట్ కార్డ్‌తోపాటూ 6 అంశాలు ప్రధాన కారణం అని ఆ సర్వే వివరిస్తోంది. అవి 1. వైసీపీ ప్రకటించిన 45 ఏళ్లకే పెన్షన్ 2.పిల్లలకు ఉచిత విద్య, 3.నవరత్నాలు, 4.రైతు రుణమాఫీ హామీని టీడీపీ పూర్తిగా నిలబెట్టుకోలేకపోవడం, 5.రాజధాని వల్ల గుంటూరు జిల్లాకే తప్ప గోదావరి జిల్లాలకు కలిసి రాలేదన్న భావన, 6. ఎన్నికలకు 6 నెలల ముందు ఓట్ల కోసమే పసుపు-కుంకుమ లాంటి పథకాలు తెచ్చారే తప్ప, తమ క్షేమాన్ని కోరి కాదని ప్రజలు భావించినట్లుగా ఆ సర్వే వివరిస్తోంది.

ఇప్పటికే ఇలాంటి చాలా విశ్లేషణలు, సర్వేలూ వచ్చాయి. వాటిలో ఇది మరొకటి. మే 23న ఫలితాలు వచ్చేలోపు ఇంకెన్ని వస్తాయో చెప్పలేం. వీటిని నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజలు ఎవరికి ఓటు వేశారో మే 23 వరకూ ఎవరికీ తెలీదు. కాకపోతే, ప్రజల్లో ఉన్న ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి సర్వేలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. 

ఇవి కూడా చదవండి :

ఉత్తరాంధ్రలో వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ... ప్రభావం చూపిస్తున్న జనసేన...

పవన్ కళ్యాణ్ బాటలో నాగబాబు... జబర్దస్త్ విషయంలో ఏమన్నారంటే...

మాకొద్దీ ఎన్నికల బెట్టింగ్ బాబోయ్... టెన్షన్ తట్టుకోలేకపోతున్న ప్రజలు...

టైమ్ ట్రావెల్ సాధ్యమేనా... ఈ ప్రపంచంలో రియల్ అవెంజర్స్ ఉన్నారా... ఆధారాలు ఇవిగో....
First published: April 29, 2019, 6:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading