హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vizag Steel plant: కేంద్రంపై వైసీపీ-టీడీపీ ఉమ్మడి పోరాటం.. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం మొండి వైఖరిపై నిరసన

Vizag Steel plant: కేంద్రంపై వైసీపీ-టీడీపీ ఉమ్మడి పోరాటం.. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం మొండి వైఖరిపై నిరసన

కేంద్రంపై వైసీపీ,టీడీపీ పోరాటం

కేంద్రంపై వైసీపీ,టీడీపీ పోరాటం

Vizag Steel plant: ఉప్పునిప్పులా ఉండే వైసీపీ -టీడీపీలను ఆ అంశం కలిపింది.. మొన్నటి వరకు రెండు పార్టీలు ఎవరికి వారు కేంద్రానికి దగ్గరగానే ఉంటూ వచ్చారు. ఒకరిపై ఒకరు విమర్శలు తప్పా.. కేంద్రాన్ని పల్లెత్తు మాట అనే పాపానికి పోలేదు. కానీ తాజా రెండు పార్టీలు ఉమ్మడిగా కేంద్ర ప్రభుత్వం తీరుపై నిరసన తెలిపాయి.

ఇంకా చదవండి ...

Vizag Steel plant: ఆంధ్రప్రదేశ్ ను కేంద్రం చిన్న చూపు చూస్తోందని.. రాష్ట్రంలో అన్ని ప్రధాన పార్టీలు విమర్శలు చేస్తుంటాయి. బడ్జెట్ కేటాయింపుల విషయంలో.. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో.. ఇక విభజన హామీలు అమలు చేసే అంశం కావొచ్చు.. ప్రతి విషయంలోనూ కేంద్రం మొండి చేయి చూపిస్తోందని.. ఇటు వైసీపీ, అటు టీడీపీ నేతలు చెబుతూ ఉంటారు. కానీ ఆ రెండు పార్టీల నేతలు మాత్రం బహిరంగంగా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించరు. తప్పు మీది అంటే మీది అంటూ ఒకరిపై ఒకరు మండిపడతారు మినహా.. కేంద్రాన్ని పల్లెత్తు మాట అనే సాహసం చేయడం లేదు. ఇటీవల స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో సైతం అధికార వైసీపీ కానీ ప్రాధాన ప్రతిపక్షం టీడీపీ కానీ.. లేదా బీజేపీ మిత్రపక్షం జనసేన సైతం.. ఈ విషయంలో తప్పు మీది అంటే మీది అని తిట్టుకున్నాయి తప్పా.. ఒక్కరు కూడా తమ ఆవేదనను కేంద్రాన్ని తెలియజేసే ప్రయత్నం చేయడం లేదు. అయితే తాజాగా తొలిసారి రెండు పార్టీలు ఒక్కటయ్యాయి. రాష్ట్రకి సంబంధించిన అతి పెద్ద సమస్య ఇదే అంటూ కేంద్రానికి వ్యతిరేకంగా లోక్ సభ సాక్షిగా గట్టిగా నినాదలు వినిపించాయి.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ ఎంపీలు బుధవారం లోక్‌స‌భ‌లో ఆందోళన బాట పట్టారు. టీడీపీ, వైసీపీ ఎంపీలు ఉమ్మడిగా కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై టీడీపీ, వైసీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి రామ‌చంద్ర ప్ర‌సాద్ సింగ్‌ సమాధానమిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రయివేటికరించాలన్న కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణయం సరైనదేనని బదులిచ్చారు. ఈసందర్భంగా ఆయన సభలో మాట్లాడుతూ పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ వ‌ల్ల కంపెనీలు బాగ‌య్యాయ‌ని 2019-20 ఆర్థిక స‌ర్వే వెల్ల‌డించిందని, ఈక్రమంలో విశాఖ స్టీల్ ప్లాంట్ డిజిన్విస్ట్‌మెంట్ కూడా స‌రైన నిర్ణ‌యమేనని ప్రకటించారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ అంశాన్ని పునఃప‌రిశీలించాల్సిన అవ‌స‌రం లేదని రామ‌చంద్ర ప్ర‌సాద్ క్లారిటీ ఇచ్చేశారు. ఇక ఈ విషయంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదన్నారు. మంత్రి సమాధాన్ని ఏపీ ఎంపీలు తప్పు పట్టారు. కేవలం సొంత గనులు లేకపోవడంతోనే స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి వెళ్లిందని.. వాటిని సరఫరా అయ్యే విధంగా చేయాలని ఏపీ ఎంపీలు కోరారు. ఆంధ్రా ఎంపీల వాదనపై మంత్రి రామ‌చంద్ర ప్ర‌సాద్ స్పందిస్తూ క్యాప్టివ్ మైన్స్ లేకున్నా విశాఖ స్టీల్ ప్లాంట్ గ‌తంలో లాభాలు ఆర్జించిందని గుర్తు చేశారు. ఉత్పాద‌క‌త త‌గ్గిపోయి, కెపాసిటి యుటిలైజేష‌న్ త‌గ్గిపోయిందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విస్త‌ర‌ణ వ‌ల్ల అప్పులు పెరిగిపోయి, ఏడువేల కోట్ల రూపాయల న‌ష్టాలు వ‌చ్చాయన్న ఉక్కుమంత్రి..అందుకే పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ చేయాలనీ భావిస్తున్నామనిట్టు తెలిపారు.

దాంతో పాటు స్టీల్ ప్లాంట్‌కు భూములిచ్చిన రైతుల కుటుంబాల‌కు ఉద్యోగాలు ఇచ్చామని, నష్ట‌ప‌రిహారం స‌హా వారికి అన్ని సౌక‌ర్యాలు క‌ల్పించామని అన్నారు. అయితే సభలో కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానంపై ఆంధ్రప్రదేశ్ ఎంపీలు సంతృప్తి చెందలేదు. ఈవిషయంపై వైకాపా ఎంపీ మార్గాని భ‌ర‌త్‌ మాట్లాడుతూ..క్యాప్టివ్ మైన్స్ లేకున్నా విశాఖ స్టీల్ ప్లాంట్ గ‌తంలో లాభాలు ఆర్జించిందన్న కేంద్ర ప్ర‌భుత్వం స‌మాధానంతో మేము అంగీక‌రించబోమని అన్నారు. కేవలం సొంత‌గ‌నులు లేక‌పోవ‌డం వ‌ల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ న‌ష్టాల్లో ప‌డిందని..నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఎక్కువ శాతం వ‌డ్డీల‌కు అప్పులుచేశారని ఎంపీ భరత్ అన్నారు. పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ‌పై పునఃప‌రిశీల‌న చేయాలని కోరారు. అయితే ఎవరి వాదన ఎలా ఉన్నా.. కేంద్రానికి వ్యతిరేకంగా వైసీపీ, టీడీపీ నేతలు ఇలా ఉమ్మడి పోరాటం చేయడం మంచిదే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాజకీయంగా ఎన్ని విబేధాలు ఉన్నా.. ఇలా కలిసి ఉమ్మడి పోరాటంతోనే కేంద్రం మెడలు వంచ వచ్చే అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది.

First published:

Tags: Andhra Pradesh, AP News, Lok sabha, TDP, Vizag Steel Plant, Ycp

ఉత్తమ కథలు