రాయపాటికి రూ.400 కోట్లు ఇవ్వడానికే ఏపీ కేబినెట్ మీటింగ్... వైసీపీ ఆరోపణ...

AP Assembly Election 2019 : రాయపాటి కుటుంబం వైసీపీలోకి వెళ్లబోతోందనే వార్తలు వస్తున్న తరుణంలో విజయసాయి రెడ్డి కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: May 14, 2019, 5:42 AM IST
రాయపాటికి రూ.400 కోట్లు ఇవ్వడానికే ఏపీ కేబినెట్ మీటింగ్... వైసీపీ ఆరోపణ...
విజయసాయి రెడ్డి, రాయపాటి సాంబశివరావు, చంద్రబాబునాయుడు
Krishna Kumar N | news18-telugu
Updated: May 14, 2019, 5:42 AM IST
AP Cabinet Meeting : కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి పొంది మరీ నేడు కేబినెట్ మీటింగ్ పెడుతున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఇది జరగనుంది. కరవు, ఫొణి తుఫాను, మంచినీటి సరఫరా, ఉపాధి పనులను సమీక్షించేందుకే కేబినెట్ మీటింగ్ పరిమితం కావాలని ఈసీ స్పష్టం చేసింది. కొత్త నిర్ణయాలు, రేట్ల మార్పు, బకాయిల చెల్లింపులు వంటి నిర్ణయాలేవీ తీసుకోరాదని క్లియర్‌గా చెప్పింది. అంతే కాదు... కేబినెట్‌‌లో తీసుకున్న నిర్ణయాలను ఈసీ అనుమతి పొందాకే అమలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కేబినెట్ మీటింగ్ తర్వాత ప్రెస్ మీట్ పెట్టకూడదని కూడా ఆదేశించింది.

అసలీ కేబినెట్ పెడుతున్నది ప్రజా సమస్యల్ని పరిష్కారానికి కాదనీ, దీని వెనక పెద్ద కుట్ర ఉందని ఆరోపిస్తోంది ప్రతిపక్ష వైసీపీ. పోలవరం ప్రాజెక్టు పనులను నిర్వహిస్తు్న్న టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌కి అక్రమంగా రూ.400 కోట్లు చెల్లించేందుకే కేబినెట్ సమావేశం పెడుతున్నారని ఆరోపించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. పోలవరం ప్రాజెక్టు చెల్లింపులన్నీ నిలిపివేయాలన్న ఆయన... కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులపై ఆడిటింగ్ జరిపిన తర్వాతే పేమెంట్స్ చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర విభజన జరిగిన సమయంలో... పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించింది. తద్వారా ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత కేంద్రంపై పడింది. ఐతే.. చంద్రబాబు మాత్రం... ఆ ప్రాజెక్టును తమ ప్రభుత్వమే పూర్తి చేస్తుందంటూ బాధ్యతను తీసుకున్నారు. ఆ ప్రాజెక్టు నిర్మాణ పనులను రాయపాటికి చెందిన ట్రాన్ స్ట్రాయ్ (Transstroy) సంస్థ చేతిలో పెట్టారు. నిజానికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేంత సామర్థ్యం ట్రాన్ స్ట్రాయ్‌కి లేదన్నది నిపుణుల మాట. అందుకు తగ్గట్టుగానే ట్రాన్స్‌ట్రాయ్ చేతిలో పెట్టాక ప్రాజెక్టు నిర్మాణ పనులు మందగించాయన్న విమర్శలు ఉన్నాయి. 2019 కల్లా ప్రాజెక్టును పూర్తి చేస్తామని రాయపాటి చెప్పారు. అది సాధ్యమేనా అన్న సందేహాలు కలుగుతున్నాయి ఏపీ ప్రజలకు.
Loading...
అసలు విషయం ఇదేనా : రాయపాటి ఫ్యామిలీ వైసీపీ వైపు చూస్తోందనీ, వారిని బుజ్జగించేందుకే చంద్రబాబు పోలవరం పేరుతో డబ్బు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం ఒకటి జరుగుతోంది. నరసారావు పేట నుంచీ టీడీపీ ఎంపీగా బ‌రిలో ఉన్న రాయ‌పాటి సాంబ‌శివ‌రావు... టీడీపీలో కొన‌సాగుతున్నారు. ఆయ‌న సోద‌రుడు, మాజీ ఎమ్మెల్యే రాయ‌పాటి శ్రీనివాస్ తన కొడుకుతో స‌హా టీడీపీని వీడి... వైసీపీలో చేరబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో రాయ‌పాటి సోద‌రులు కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరారు. ఆ ఎన్నిక‌ల్లో న‌రసారావుపేట నుంచి ఎంపీగా పోటీ చేసి రాయపాటి గెలిచారు. అప్పటికే రాయ‌పాటి పోల‌వ‌రం నిర్మాణంలో ప్రధాన కాంట్రాక్టర్‌గా ఉన్నారు. ఆ విషయంలో నష్టాలు వచ్చాయని ఆయన అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. ఆయ‌న సోద‌రుడు రాయ‌పాటి శ్రీనివాస్‌కు టీడీపీ అధినాయ‌క‌త్వం ఎమ్మెల్సీ అవ‌కాశం ఇస్తామ‌ని హామీ ఇచ్చి, నిలబెట్టుకోలేదు.

తాజా ఎన్నిక‌ల టైంలో రాయ‌పాటికి నరసారావుపేట ఎంపీ టికెట్ ఇచ్చినా... ఆయన కొడుకు రంగారావుకు అసెంబ్లీ సీటు ఇచ్చేందుకు చంద్రబాబు ఒప్పుకోలేదు. అందుకే సోద‌రుడు రాయ‌పాటి శ్రీనివాస్ కుటుంబం టీడీపీపై అసంతృప్తితో ఉన్నారు. ఈ పరిస్థితుల మధ్య రాయపాటి ఫ్యామిలీని బుజ్జగించేందుకూ, ఆయనకు పోలవరం ప్రాజెక్టు విషయంలో వచ్చిన నష్టాల్ని భర్తీ చేసేందుకు రూ.400 కోట్లు ముట్టజెప్పబోతున్నారన్నది వైసీపీ నేతల ఆరోపణగా కనిపిస్తోంది.

ఈ నెల 11న సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వెంటనే పోలవరం, రాజధాని నిర్మాణం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమాయత్తమయ్యారు. అప్పట్లో ఎన్నికల సంఘం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అందువల్ల ఇవాళ్టి సమావేశంలో పోలవరంపై చర్చిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆ క్రమంలో అక్రమాలు జరుగుతాయన్న అంచనాతో విజయసాయిరెడ్డి ఇలాంటి ఆరోపణ చేసినట్లు తెలుస్తోంది.

 

ఇవి కూాడా చదవండి :

మంగళగిరిలో లోకేష్‌కి భారీ మెజార్టీ... టీడీపీ రిపోర్టులో ఏం తేలిందంటే...

మా తమ్ముడు బంగారం... పవన్ కళ్యాణ్‌పై నాగబాబు ఆసక్తికర కామెంట్స్...

ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్... ఒక్కో ఎమ్మెల్యే రేటు రూ.30 కోట్లు..?

జగన్ కి శ్రీ రెడ్డి సపోర్ట్... వైసీపీ లోకి ఎంట్రీ..? మరో రోజా అవుతారా..?

 

First published: May 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...