Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ... ఓ కార్యకర్త... తనకు ప్రాణహాని ఉందంటూ... సెల్ఫీ వీడియోలో బోరున ఏడ్చాడు. తనను సీఎం జగన్ (అన్నా అని పిలుస్తూ) కాపాడాలని వేడుకున్నాడు తుళ్లూరు మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు శృంగారపాటి సందీప్. తనకు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, తుళ్ళూరు సీఐ ధర్మేంద్ర బాబు వల్ల ప్రాణ హాని ఉందని అతను తన సెల్ఫీ వీడియోలో చెప్పాడు. ఐదేళ్ల నుంచి పార్టీ కోసం కష్టపడ్డాననీ... ఎన్నికల ముందు నుంచి తాడికొండ నియోజకవర్గంలో చాలా సేవా కార్యక్రమాలు నిర్వహించానని తెలిపాడు. ఎమ్యెల్యే ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉండి... తన దగ్గర సమస్య చెప్పుకోవడంతో... తాను తెలిసిన వారి ద్వారా డబ్బు అప్పుగా తెచ్చి ఇచ్చాననీ... ఇప్పుడు ఆ డబ్బు తిరిగి ఇమ్మంటే ఇవ్వకపోగా... ఎమ్మెల్యే... తనపైనే అక్రమ కేసులు బనాయించారని ఏడుస్తూ చెప్పాడు.
వారం నుంతి తన కుటుంబానికి దూరంగా దాక్కొని బ్రతుకుతున్నానన్న సందీప్... ఇంట్లో పిల్లలు, భార్య, తల్లిదండ్రులు నాకోసం చాలా బాధపడుతున్నారని తెలిపాడు. "నన్ను సీఎం జగన్ మాత్రమే కాపాడగలరన్న ఉద్దేశంతోనే సెల్ఫీ వీడియో ద్వారా అభ్యర్థిస్తున్నాను తప్ప... మీడియాలో కనిపించాలని కాదు. నాకు చావే శరణ్యం" అని సందీప్ బోరుమన్నాడు.
సందీప్ అభ్యర్థన ఇప్పుడు సంచలనమైంది. ఓ ఎమ్మెల్యే వల్ల ఓ కార్యకర్తకు ఇలాంటి పరిస్థితి రావడం దారుణమన్న సందీప్... తాను సామాన్యుడిని కాబట్టి... ఎమ్మెల్యేను ఎదుర్కోవడం తన వల్ల కాదన్నాడు. దీనిపై సీఎం జగన్ ఎలా స్పందిస్తారన్నది తేలాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.