మండలిలో విజయసాయికి ఏం పని? గవర్నర్‌కు యనమల ఫిర్యాదు

మండలిలో విజయసాయికి ఏం పని? గవర్నర్‌కు యనమల ఫిర్యాదు

యనమల రామకృష్ణుడు(File)

విపక్ష ఎమ్మెల్సీలను ప్రలోభపెడుతున్నారని లేఖలో పేర్కొన్నారు యనమల. సభా వాతావరణాన్ని చెడగొడుతున్న అలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ హరిచందన్ భిశ్వభూషన్‌కు విజ్ఞప్తి చేశారు.

  • Last Updated:
  • Share this:
    శాసనమండలిలో జరుగుతున్న పరిణామాలపై విపక్ష నేత యనమల రామకృష్ణుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శాసన మండలి గ్యాలరీలో కూర్చొని సభ్యులను ప్రభావితం చేస్తున్నారని గవర్నర్ హరిచందన్ భిశ్వభూషణ్‌కు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. గ్యాలరీ నుంచి వైసీపీ సభ్యులకు సలహాలు, సూచనలు చేస్తూ మండలిని తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. వైసీపీకి చెందిన బయటి వ్యక్తులు సభ లోపలికి వచ్చి శాసన మండలి కార్యకలాపాలకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అంతేకాదు విపక్ష ఎమ్మెల్సీలను ప్రలోభపెడుతున్నారని.. స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. సభా వాతావరణాన్ని చెడగొడుతున్న అలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ హరిచందన్ భిశ్వభూషన్‌కు విజ్ఞప్తి చేశారు. సీఆర్డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు విషయంలోనూ విపక్షాలకు తగిన సమయం ఇవ్వడం లేదని.. ఈ విషయంలో జోక్యం చేసుకొని ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పట్ల గౌరవం పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
    Published by:Shiva Kumar Addula
    First published: