హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

World Bank : జగన్ సర్కారుకు ప్రపంచ బ్యాంక్ కొత్త అప్పు -కేంద్రం ఆమోదంతో 1800కోట్లు -దేనికంటే

World Bank : జగన్ సర్కారుకు ప్రపంచ బ్యాంక్ కొత్త అప్పు -కేంద్రం ఆమోదంతో 1800కోట్లు -దేనికంటే

జగన్ సర్కారుకు ప్రపంచ బ్యాంక్ రుణం

జగన్ సర్కారుకు ప్రపంచ బ్యాంక్ రుణం

జగన్ సర్కారుకు మాత్రం కొత్త అప్పులు పుడుతూనే ఉన్నాయి. ఏపీ సర్కారు తాజగా ప్రపంచ బ్యాంకుతో చేసుకున్న ఒప్పందం మేరకు సుమారు రూ.1800కోట్ల రుణం లభించనుంది. కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో, కేంద్ర ప్రతినిధులు, ఏపీ, ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల మధ్య ఈ ఒప్పందం కుదిరింది.

ఇంకా చదవండి ...

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఆర్థికంగా దివాళా తీసింది.. ఆంధ్రప్రదేశ్ పరిధి దాటి అప్పులు చేస్తుండటంతో కేంద్రం ఆంక్షలు విధించింది.. అప్పులు కట్టలేని ఏపీని డీఫాల్టర్‌గా ప్రకటించబోతున్నారు.. ఇక ఏపీకి అంతర్జాతీయ సంస్థలేవీ అప్పులు ఇవ్వవు.. అంటూ వైసీపీ వ్యతిరేక వర్గాలు ప్రతిరోజూ ఊదరగొడుతున్నా.. సీఎం జగన్ (CM Jagan) సర్కారుకు మాత్రం కొత్త అప్పులు పుడుతూనే ఉన్నాయి. ఏపీ సర్కారు తాజగా ప్రపంచ బ్యాంకుతో చేసుకున్న ఒప్పందం మేరకు సుమారు రూ.1800కోట్ల రుణం లభించనుంది. కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో, కేంద్ర ప్రతినిధులు, ఏపీ, ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. ఈనెల 18నే సంబంధిత మెమోరండం ఆఫ్ అండర్ట్సాండింగ్(ఎంవోయూ)పై సంతకాలు జరిగాయని మూడు పక్షాలూ మంగళవారం నాడు కీలక ప్రకటన చేశాయి. ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లలో విద్యా ప్రమాణాల పెంపునకు ఈ డబ్బును ఖర్చు చేయనున్నారు. పూర్తి వివరాలివి..

ఏపీకి ప్రపంచ బ్యాంక్ రుణం

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ స్కూళ్లలో విద్యా ప్రమాణాల పెంపు కోసం జగన్ సర్కారుకు ప్రపంచ బ్యాంకు 250మిలియన్ డాలర్లు (సుమారు 1800 కోట్లు) రుణాన్ని అందజేయనుంది. ‘ఏపీలోని 45వేల ప్రభుత్వ స్కూళ్లలో చదువుతోన్న 50 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన అభ్యాసాన్ని మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్ట్ కోసం భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం , ప్రపంచ బ్యాంకులు ఈనెల 18న చట్టపరమైన ఒప్పందాలపై సంతకం చేశాయి’అని మంగళవారం నాడు అధికారిక ప్రకటన వెలువడింది.

ఏపీలో 3కాదు, 2రాజధానులు -సమ్మర్, వింటర్ క్యాపిటల్స్ -సీఎం జగన్‌కు బీజేపీ బంపర్ ఆఫర్లక్షల మందికి లబ్ది

కేంద్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి రజత్ కుమార్ మిశ్రా, ఏపీ పాఠశాల విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ బుడితి రాజశేఖర్, ప్రపంచ బ్యాంక్ ఇండియా డైరెక్టర్ జునైద్ అహ్మద్‌లు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఏపీలోని 45వేల ప్రభుత్వ పాఠశాల్లోని(6 నుంచి 14 ఏళ్ల వయసున్న) 40 లక్షల మంది విద్యార్థులు, అంగన్ వాడీ కేంద్రాల్లోని (3 నుంచి 6 ఏళ్ల వయసున్న) 10 లక్షల మంది పిల్లలు అలాగే, 1,90,000 మంది టీచర్లు, 50 వేల మంది అంగన్ వాడీ కార్యకర్తలకు ఈ ఒప్పందం ద్వారా ప్రయోజనం చేకూరుతుందని ప్రకటనలో తెలిపారు.

Kuppam : చదువుల తల్లి ప్రియ.. ఎంత పని చేశావమ్మా! కష్టాలకు ప్రళయం తోడై.. కుటుంబాన్ని అలా చూడలేక..ఈ డబ్బుతో ఏం చేస్తారంటే..

ఈ ప్రాజెక్టులో భాగంగా పేద, గిరిజన విద్యార్థులు, బాలికలకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. అంగన్వాడి టీచర్లకు, సిబ్బందికి ప్రత్యేక ఫౌండేషన్ కోర్సులు ప్రవేశపెట్టనున్నారు. డిజిటల్ వసతులు లేక విద్యలో నష్టపోతున్న పేద గిరిజన విద్యార్థుల కోసం టెలివిజన్, రేడియోలో ప్రత్యేక కంటెంట్ రూపకల్పన చేయాలని భావిస్తున్నారు. కరోనా లాంటి మహమ్మారులతో విద్యార్థులు నష్ట పోకుండా ఉండే దిశగా కొత్త లెర్నింగ్ విధానాలు అమలు చేసేలా చర్యలు తీసుకోనున్నారు.

వారేవా జగన్!! మూడు రాజధానుల కొత్త బిల్లులో మహా తెతివి -అంతరాత్మను టేబుల్‌పై పెట్టేసి: somuకేంద్రం సమర్థన

క్వాలిటీ ఎడ్యుకేషన్ కు ప్రపంచ స్థాయి యాక్సెస్ కల్పించడం భారత ఆర్థిక, సామాజిక రంగానికి ప్రధానమైనదని, విద్యార్థులకు లెర్నింగ్ కష్టాలు తీర్చుతూ, చిన్నప్పటి నుంచే పునాదులను పటిష్టం చేసి, ప్రభుత్వ స్కూళ్లను శక్తివంతమైన విద్యా కేంద్రాలుగా మార్చాలనే ఏపీ సర్కారు ఆలోచనలకు ఈ ప్రాజెక్టు ఎంతగానో తోడ్పడుతుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.

నా భార్యనూ గదిలో అలా ఫొటోలు తీశారు -ఆత్మహత్య ఆగింది కూడా ఇందుకే -భువనేశ్వరి ఉదంతో భారీ కుదుపుఒప్పందాల్లో ఏముంది?

ఏపీలో ప్రభుత్వ పాఠశాలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఎం జగన్.. నాడు నేడు కార్యక్రమం ద్వారా స్కూళ్ల రూపురేఖల్ని పూర్తిగా మార్చేయడం, ఇంగ్లీష్ మీడియం బోధనతో విప్లవాత్మక మార్పులు చేపట్టడం తెలిసిందే. కాగా, విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపర్చేలా ప్రపంచ బ్యాంకుతో ఏపీ సర్కారు కుదుర్చుకున్న ఒప్పందంలో ఏవైనా క్లాజులు ఉన్నాయా? లేవా? అనేది తెలియాల్సి ఉంది. ఎయిడెడ్ స్కూళ్లను ప్రభుత్వంలో విలీనం చేయడానికి జరిగిన ప్రయత్నంలో జగన్ సర్కారుపై పెద్ద ఎత్తున విమర్శలు రావడం, ప్రభుత్వ స్కూళ్లను, వాటి స్థలాలను తాకట్టు పెట్టి జగన్ కొత్త అప్పులు తీసుకుంటారనే ఆరోపణలు వచ్చిన దరిమిలా ప్రపంచ బ్యాంకుతో తాజా రుణ ఒప్పందంపైనా చర్చ జరుగుతోంది..

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP Schools, World Bank

ఉత్తమ కథలు