Polavaram Project: పోలవరం ప్రాజెక్టు పనుల్లో అపశృతి.. పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన కార్మికులు

ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు పనుల్లో అపశృతి చోటుచేసుకుంది. ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద పనిచేస్తున్న పనులు చేస్తున్న ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందాడు.

news18-telugu
Updated: November 21, 2020, 2:46 PM IST
Polavaram Project: పోలవరం ప్రాజెక్టు పనుల్లో అపశృతి.. పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన కార్మికులు
పోలవరం ప్రాజెక్టు(ఫైల్ ఫొటో)
  • Share this:
ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు పనుల్లో అపశృతి చోటుచేసుకుంది. ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద పనిచేస్తున్న పనులు చేస్తున్న ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందాడు. వివరాలు.. శుక్రవారం రాత్రి పోలవరం ప్రాజెక్ట్ 49వ క్లస్టర్ వద్ద బిహార్‌కు చెందిన మహమ్మద్ పనులు నిర్వహిస్తున్నాడు. అయితే అనుకోకుండా అతడు పై నుంచి జారిపడ్డాడు. సరిగా స్పీడ్ ఛానల్‌లో ఉన్న నీటిలో పడటంతో అతడు గల్లంతయ్యాడు. అయితే కార్మికుడు నీటిలో పడి గల్లంతైన పట్టించుకోకుండా పనులు జరపడంపై తోటి కార్మికులు ఆందోళనకు దిగారు. ప్రాజెక్టు వద్ద నిరసన తెలియజేశారు. ఈ క్రమంలో రెండు వాహనాలకు కూడా ధ్వంసం చేశారు.

మరోవైపు ప్రమాదవశాత్తు నీటిలో జారిపడిన మహమ్మద్‌ ఆచూకీ కోసం గాలింపు చేపట్టిన సిబ్బంది.. అతని మృతదేహాన్ని వెలికితీశారు. శనివారం అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక, ప్రాజెక్టు వద్ద ఆందోళన చేస్తున్న కార్మికులతో పోలీసులు చర్చలు జరిపారు. వారిని శాంతింపజేశారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కార్మికుడు మహమ్మద్ మృతికి నిరసనగా శనివారం ఉదయం నుంచి ప్రాజెక్టు వద్ద పనులు నిలిపివేశారు.
Published by: Sumanth Kanukula
First published: November 21, 2020, 2:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading