M Bala Krishna, News18, Hyderabad
కరోనా (Corona) కారణంగా సాఫ్ట్ వేర్ కంపెనీలన్నీ(Software Companies) వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) అవకాశం కల్పించడంతో వివిధ ప్రాంతాల్లో ఉంటున్న ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వాసులంతా స్వగ్రామాలకు వచ్చేసి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. రెండేళ్లపాటు అంతా సవ్యంగానే సాగింది. కానీ ఇప్పుడు మాత్రం వారికి అనుకోని కష్టమొచ్చింది. వర్క్ ఫ్రమ్ హోం కంటే ఆఫీసుకే వెళ్లడం బెటర్ అని ఫీవుతున్నారు. ఇందుకు కారణం పవర్ కట్స్. ఏపీ లో పవర్ కట్స్ వర్క్ ఫ్రమ్ హోం చేస్తోన్నవారి పాలిట శాపంగా మారింది. కరెంట్ ఎప్పుడు వస్తోందో ఎప్పుడు పోతుందో తెలియక నానా ఇక్కట్లు పడుతున్నారు ఏపీలో వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న ఉద్యోగులు. ఏపీలో తరచుగా విద్యుత్ కోతలు, కనీసం ఐదు నుంచి ఆరు గంటల పాటు కొనసాగుతుండటంతో ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నవారు మళ్లీ తిరిగి కార్యాలయాలకు వెళ్లవలసి వస్తోంది.
కరెంటు కోతల కారణంగా గ్రామాల్లో ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగులు తమ బంధువుల ఇంటికి వెళ్తున్నారు. రాత్రి షిఫ్టుల్లో పనిచేసే వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. “కోవిడ్ వచ్చినప్పటి నుంచి గత రెండేళ్లుగా ఇంటి నుండి పని చేస్తున్నాము. గత నాలుగేళ్లలో ఎప్పుడూ విద్యుత్ కోతలను చూడలేదు, కానీ ఇప్పుడు మూడు-నాలుగు గంటలు పగలు కొన్ని సందర్భల్లో రాత్రి మొత్తం కరెంటు కోతలు ఉన్నాయి. ప్డస్తుతం నేను వాడుతున్నది పాత ల్యాప్టాప్ కావడంతో బ్యాటరీ బ్యాకప్ పెద్దగా ఉండదు దింతో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. నేను పూణేలో ఉన్న టెలికాం కంపెనీలో పని చేస్తున్నాను. కరెంట్ కట్ లు ఉండడంతో నన్ను తిరిగి ఆఫీస్ కి రమ్మని అడిగారు" అని అనంతపురం నుంచి వర్క్ ఫ్రమ్ హోం ద్వారా తన బాధ్యతలు నిర్వహిస్తున్న హేమంత్ న్యూస్18 కి తెలిపారు.
ఇదిలా ఉంటే కొంత మంది ఈ పవర్ కట్ లతో తాము చేస్తోన్న ఉద్యోగాన్ని ఎక్కడ కోల్పోతామోన్న బెంగతో ఉన్నారు. “పవర్ కట్ కారణంగా రోజు పనిని పూర్తి చేయలేకపోయామని హెచ్ ఓడీలకు చెప్పినప్పుడు, వారు మాకు ఒకటి లేదా రెండు సార్లు ఏం అనకపోయినప్పటికి రోజు ఇదే విధంగా పరిస్థితి ఉండడంతో వాళ్లు కూడా చాలా సీరియస్ అవుతున్నారు. పవన్ పోయినప్పుడు హాట్స్పాట్లు నెట్ కోసం ఉపయోగిస్తోన్నాప్పటిక పవర్ కట్ ఎక్కవ సేపు ఉండడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాము.. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉద్యోగం పోతుందేమోనని భయంగా ఉంది’’ అని కర్నూలుకు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి ప్రసాద్ అన్నారు.
"గత రెండేళ్లుగా మంచి అవుట్ పుట్ ఇచ్చినప్పటకి, ఇప్పుడు మా ఉన్నతాధికారులతో తిట్లు తినాల్సి వస్తోంది. పవర్ కట్ వలన తిరిగి ఆఫిస్ కి రమ్మని లేదా రిజైన్ చేయమని అంటున్నారు. దీంతో మా కుటుంబంతో కలిసి మళ్లీ బెంగళూరుకు మకాం మార్చాను.” సతీష్ ఓ సాప్ట్ వేర్ ఇంజినీర్ తెలిపారు. ఏపీలో ఇదే పరిస్థితిలు కొనసాగితే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోందని చాలా మంది మళ్లీ తీరిగి తాము పని చేస్తోన్న నగరాల బాట పట్టారు. మరో వైపు ఏపీ వ్యాప్తంగా గతంలో ఎన్నడూ లేని విధంగా రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటల పవర్ కట్ ఉంది. ఇప్పటికే ఈ అంశంపై ప్రతిపక్ష పార్టీలు కూడా చాలా ఆందోళనలు చేపడుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోం కాస్త ఈ పవర్ కట్స్ తో పోవడంతో చాలా మంది ఉద్యోగులు దిగులు చెందుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Power cuts, Work From Home