కర్నూలులో రాజకీయ కాక...జనసేనలో చేరికపై మంత్రి అఖిలప్రియ క్లారిటీ

గన్‌మెన్లను ఉపసంహరించడంపై స్వయంగా హోంమంత్రి చినరాజప్పే క్లాస్ తీసుకున్నారు. మంత్రి హోదాలో ఉండి నిరసన వ్యక్తంచేయడం సరికాదని మందలించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆమె పార్టీ మారతారని ప్రచారం జరిగింది. ఇటీవల సీఎం చంద్రబాబు టూర్‌కు ఆమె డుమ్మాకొట్టడంతో..ఆ ప్రచారానికి మరింత బలం చేకూరింది.

news18-telugu
Updated: January 11, 2019, 5:31 PM IST
కర్నూలులో రాజకీయ కాక...జనసేనలో చేరికపై మంత్రి అఖిలప్రియ క్లారిటీ
భూమా అఖిలప్రియ
news18-telugu
Updated: January 11, 2019, 5:31 PM IST
ఏపీ రాజకీయాల్లో మంత్రి అఖిలప్రియ వ్యవహారం కొంతకాలంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఆమె టీడీపీ పట్ల అసంతృప్తితో ఉన్నారని..పార్టీతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రచారం జరిగింది. మంత్రిగా ఉన్నప్పటికీ..పార్టీలో సరైన గౌరవం దక్కడం లేదని అనుచరులతో ఆమె వాపోయారట. ఈ క్రమంలోనే భూమా అఖిలప్రియ టీడీపీకి గుడ్‌బై చెప్పి.. జనసేనలో చేరుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఐతే ఆ ప్రచారంపై స్వయంగా ఆమే క్లారిటీ ఇచ్చారు. టీడీపీని వీడే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు.

టీడీపీని వీడే ప్రసక్తే లేదు. కొందరు పనిగట్టుకుని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. జనసేనలో చేరతానని మీడియాలో వార్తలు రాస్తున్నారు.  వీటిని నమ్మొద్దు. చంద్రబాబు వల్లే ఆళ్లగడ్డకు నీళ్లొచ్చాయి. నియోజకవర్గ అభివృద్ధికి అడిగినన్ని నిధులను సీఎం చంద్రబాబు ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డలో గెలిచి చంద్రబాబుకు కానుకగా ఇస్తా. పోలీసులు తన అనుచరులను వేధిస్తున్నారనే గన్‌మెన్లను దూరంగా ఉంచాను. గన్‌మెన్ల వివాదాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాను.
అఖిలప్రియ, ఏపీ పర్యాటకశాఖ మంత్రి
కాగా, కర్నూలు జిల్లా నేతలను అఖిలప్రియ కలుపుకొని వెళ్లడం లేదని..పార్టీ అధిష్టానికి పలుమార్లు ఫిర్యాదులు అందాయి. టిడిపిలో కొందరు నేతలు త‌నకు వ్య‌తిరేకంగా పనిచేస్తున్నారని ఆమె అసంతృప్తితో ఉన్నారట. దానికి తోడు తన వ్యతిరేకులకు పార్టీ హైకమాండ్ ప్రాధాన్యత ఇవ్వడంతో అఖిలప్రియ అలక బూనినట్లు సమాచారం. అంతేకాదు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆళ్లగడ్డ టికెట్‌ను భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డికి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అటు గన్‌మెన్లను ఉపసంహరించడంపై స్వయంగా హోంమంత్రి చినరాజప్పే క్లాస్ తీసుకున్నారు. మంత్రి హోదాలో ఉండి నిరసన వ్యక్తంచేయడం సరికాదని మందలించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆమె పార్టీ మారతారని ప్రచారం జరిగింది. ఇటీవల సీఎం చంద్రబాబు టూర్‌కు ఆమె డుమ్మాకొట్టడంతో..ఆ ప్రచారానికి మరింత బలం చేకూరింది.

తల్లి శోభానాగిరెడ్డి మ‌ర‌ణం అనంతరం జరిగిన ఉపఎన్నిక‌ల్లో ఆళ్ల‌గ‌డ్డ ఎమ్మెల్యేగా అఖిలప్రియ విజయంసాధించారు. తండ్రి భూమానాగిరెడ్డి స‌హ‌కారంతో జిల్లా రాజ‌కీయాల్లో ప‌ట్టు సాధించేందుకు ప్ర‌య‌త్నించారు. ఐతే అంతలోనే తండ్రీకూతుళ్లు వైసీపీకి గుడ్‌బై చెప్పి టీడీపీ పార్టీలో చేరిపోయారు. అనంతరం కొన్ని రోజులకు భూమానాగిరెడ్డి చనిపోయారు. తల్లీతండ్రి కోల్పోయిన అఖిలప్రియకు చంద్రబాబునాయుడు మంత్రి పదవి ఇచ్చి..టూరిజం శాఖను కేటాయించారు. కానీ అఖిలప్రియ వ్యవహారశైలిపై కొందరు నేతలు అధిష్టానానికి ఫిర్యాదుచేయడంతో.. ఆళ్లగడ్డ టీడీపీలో ముసలం నెలకొంది. ఐతే టీడీపీ వీడేది లేదని స్పష్టంచేసిన అఖిల...ఇప్పటికైనా సీనియర్ నేతలతో కలుపుకొని వెళ్తారా? లేదా? అన్నది చూడాలి.

First published: January 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...