హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

What a Talent: జయం సినిమాను గుర్తు చేస్తున్న చిన్నారి.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు

What a Talent: జయం సినిమాను గుర్తు చేస్తున్న చిన్నారి.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు

రివర్స్ రైటింగ్ తో అద్భుత ప్రతిభ

రివర్స్ రైటింగ్ తో అద్భుత ప్రతిభ

What a Talent: ఆమె హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది. కానీ ఏం రాసిందో ఎవరికీ అర్థం కాదు.. అయినా ఆమె వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కింది ఎందుకో తెలుసా..? అలాగే ఆమె రాసింది చదవాలి అంటే.. అద్ధం పట్టుకోవాల్సిందే.. ఎందుకంటారా..?

S jagadesh, visakhaptnam, News 18.

What a Talent:  జయం సినిమా (Jayam Movie) చాలామంది చూసే ఉంటారు.. అందులో హీరోయిన్ చెల్లెలు ట్రైన్ పై తెలుగు పదాలను రివర్స్ లో రాస్తుంది. వాటిని మళ్లీ అద్దంలో చూస్తే తప్ప అక్కడ ఏంరాసిందో అర్థం కాదు.. అయితే ఇలాంటి రైటింగ్ కేవలం సినిమాలోనే కాదు.. అచ్చం ఇప్పుడు అలానే అక్షరాలను రివర్స్ లో రాస్తూ రికార్డులు సృష్టిస్తోంది మన వైజాగ్ (Vizag) అమ్మాయి రమ్య . అదే ఆమె టాలెంట్.. ఆమెకు ఉన్న ప్రతిభను చూసి ప్రపంచమే నివ్వెర బోతోంది. ఇలా అక్షరాలు.. రివర్స్ (mirror writing) లో రాస్తూ ప్రతిభ చాటిన అమ్మాయి పేరు మామిడి రమ్య (Mamidi Ramya). అనకాపల్లి జిల్లా (Anakapalli district) నర్సీపట్నం మండలం, ధర్మసాగరం గ్రామానికి చెందిన మామిడి మోహన్ రావు, మీనాక్షిల కూతురే ఈ రమ్య. ఈమె చిన్నప్పుడు అన్ని అక్షరాలను రివర్స్ లో రాస్తుంటే వాళ్ల టీచర్లు, ఇంట్లో వాళ్లు అరిచేవారు. అలా రాయకూడదని చెప్పినా.. తనకు ఇలానే బాగుందంటూ రాస్తుండేది. అయితే రమ్య రాసింది ఏదైనా ఎవరైనా చదవాలి అంటే..? చాలాకష్టంగా ఉండేది. తను రాసింది అర్థం కావాలంటే అద్దం కోసం వెతుక్కోవాల్సిందే.. తనురాసిన అక్షరాలను అద్దంలో చూస్తేకానీ, ఏంరాస్తుందో తెలిసేది కాదు.

చిన్నప్పటి నుండి ఇంట్లో వాళ్ళు పేర్లు, ఫ్రెండ్స్ పేర్లు రివర్స్ లో రాస్తూ ఉండేది. అలా సరదాగా మొదలైన ఈ అలవాటు క్రమక్రమంగా ఆమెలో ఆసక్తిని పెంచింది. అందరిలో భిన్నంగా ఉండాలనుకునే రమ్య. ఈ రివర్స్ రైటింగ్ లో పట్టు సాధించాలనుకుంది. అనుకున్నదే తడవుగా.. ఇలా రాసేవాళ్ళు మనరాష్ట్రంలో, దేశంలో ఎంతమంది ఉన్నారు? అంటూ గూగుల్లో సెర్చ్ చేయడం మొదలు పెట్టింది రమ్య. ఇలా రాస్తే వరల్డ్ లెవల్, ఇంటర్నేషనల్, గిన్నిస్ రికార్డులు వస్తాయని తెలుసుకుంది. అప్పటి నుండి తెలుగు భాషను రివర్స్ లో రాయడం, స్పీడ్ గా రాయడం మొదలుపెట్టింది. ప్రతిరోజూ సాధన చేస్తుండేది.

ఇదీ చదవండి : రాజధాని ప్రకటన తరువాత.. రాసలీలల ఆడియో తప్పా.. ఏం చేశారు..? మాజీ మంత్రిపై టీడీపీ సెటైర్లు

ఆమె ఉత్సాహం చూసిన తరువాత.. తల్లిదండ్రులు సైతం రమ్యకు ప్రోత్సాహం అందించారు. వందేమాతరం పాటను రివర్స్ లో రమ్య ఒక నిమిషం 30 సెకన్లలో రాయడం నేర్చుకుంది. ఒక్క తెలుగు భాష కాకుండా హిందీ, ఇంగ్లీష్ కూడా రివర్స్ లో రాయడం మొదలు పెట్టింది.ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే రెండు నిమిషాలకి 250 పదాలు రాయగలుగుతుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, తన కృషితో చేతి రాతల ద్వారా విశేష ప్రతిభను కనబరుస్తోంది.


ఇదీ చదవండి : : మాజీ మంత్రి బొజ్జల మృతి.. పార్టీకి తీరని లోటన్న చంద్రబాబు.. కేసీఆర్ సంతాపం

తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలను రివర్స్ లో రాస్తూ సత్తా చాటుతోంది. ఆమె ప్రతిభకు వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్ర్ అవార్డు వరించింది. మూడు బాషల్లో ఆమె ప్రతిభ ప్రదర్శనను గిన్నిస్, వరల్డ్ వైడ్, ఇంటర్నేషనల్ వైడ్ ఆఫ్ రికార్డు అధికారులకు పంపింది. రమ్య ప్రతిభకు ముందుగా వరల్డ్ వైడ్ ఆఫ్ రికార్డు లో చోటు దక్కింది. ఇంకా గిన్నిస్ బుక్.. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డుకి కూడా అప్లైచేశానని అందులోకూడా తాను కచ్చితంగా చోటు సంపాదించుకుంటానని రమ్య చెబుతోంది.

First published:

Tags: Andhra Pradesh, AP News, VIRAL NEWS, Visakhapatnam

ఉత్తమ కథలు