Home /News /andhra-pradesh /

WONDER FISH HUGE TEKU FISH CAUGHT IN EAST GODAVARI DISTRICT HER WEIGHT 750 KGS NGS

Big Fish: వామ్మో ఇలాంటి చేపను ఎప్పుడైనా చూశారా..? క్రేన్ తెస్తే కాని బయటకు రాలేదు.. వెయిట్ ఎంతో తెలుసా?

మత్స్యకారులకు చిక్కిన పెద్ద చేప

మత్స్యకారులకు చిక్కిన పెద్ద చేప

very Big Fish: సినిమాల్లో మాత్రమే కనిపించే చేపలు.. నిజంగా కంటికి కనిపిస్తే షాక్ తినాల్సిందే.. అస్సలు ఎప్పుడైనా ఇలాంటి చేపను చూసి ఉండరు.. ఎందుకంటే ఆ చేప బరువు తెలిస్తే నోరు వెల్లబెట్టడం ఖాయం.. ఎందుకంటే ఆ చేపను బయటకు తీయడానికి ఓ క్రేన్ ను రప్పించాల్సి వచ్చింది.

ఇంకా చదవండి ...
    750 KGs Huge Teku Fish Caught: కొన్ని విన్న వాటిని నమ్మలేం.. నిజం కాదేమో అబద్ధం చెబుతున్నారేమో అనుకుంటాం.. కళ్లతో చూస్తేనే నమ్ముతా.. అలా కొన్ని విషయాలను చూస్తే షాక్ అవుతాం.. ఎందుకంటే అది నమ్మలేని నిజం కాబట్టి.. అలాంటి ఘటనే మత్స్యకారులకు ఎదురైంది. వేటకు వెళ్లిన మత్య్సకారులకు ఓ పెద్ద చేప చిక్కింది. కాని ఎంతలా బయటకు తీసినా రావడం లేదు.. దీంతో ఏం చేయాలో తెలియక దానిని బయటకు తీసేందుకు ఏకం క్రేన్ ను తెప్పించారు.. తీరా ఆ చేప బయటకు వచ్చాక చూశాక అంతా షాక్ కు గురయ్యారు.. ఈ ఆశ్చర్యకర ఘటన తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది మినీ హార్బర్‌లో చోటు చేసుకుంది. సుమారు 750 కేజీల కు పైగా బరువు ఉండే టేకు చేప ఉప్పాడ మత్స్యకారులకు వలకు చిక్కింది. దానిని క్రేన్ సహకారంతో బయటకు తీసుకురావాల్సి వచ్చింది...

    అలా నీటి నుంచి క్రేన్ సహకారంతో బోటు నుండి మినీ వాన్ పైకి ఎక్కించి కాకినాడ మార్కెట్టుకు తరలించారు. ఇంత పెద్ద చేపను చూడడానికి చుట్టుపక్కల జనాలు పోటెత్తారు. ఇంత పెద్ద చేపను చూడడం ఇదే ఫస్ట్ టైం అంటూ స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. సాధారణంగా మత్స్యకారులు చిన్న చిన్న వలలు వేసి చేపలు పడుతుంటారు. సముద్రంలో వేటకు పెద్ద వలలు ఊపయోగిస్తుంటారు. అయితే పెద్ద వలకు చిక్కిన ఈ చేపను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. అసలు ఇది చేపేనా అంటూ మొదట్లో సందేహించారు. చివరికి మొత్తం పరిశీలించిన తరువాత దానిని చేపగానే నిర్ధారించారు. ఎలాగోలా ఒడ్డుకు చేర్చాలి అని వారు చేసిన ప్రయత్నం ఫలించలేదు. దీంతో మత్స్యకారులు.. మార్కెట్‌కు తరలించడానికి పెద్ద సాహసమే చేయాల్సి వచ్చింది.



    ఎందుకంటే ఆ చేప బరువు ఒకటి, రెండు వందల కేజీలు కాదు.. ఏకంగా 750 కేజీలకు పైగా బరువు ఉంది. సముద్రం నుంచి మార్కెట్‌కు తరలించడానికి క్రేన్లు ఉపయోగించాల్సి వచ్చింది. ఈ తంతునంతా అక్కడి జనమంతా చాలా ఆశ్చర్యంగా చూశారు. అలసు ఇంత చేప ఉంటుందని ఎప్పుడు వినలేదు కూడా అంటున్నారు. ఆ చేపను మనుషులంతా పట్టుకున్న అస్సలు కదలడం లేదు. అందుకే క్రేన్ ఉపయోగించక తప్పలేదు. దానిని కాకినాడకు ట్రక్కులో తరలించడం కూడా కష్టంగానే మారింది. సముద్రంలో కొన్ని సందర్భాల్లో అరుదైన ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. 750 కిలోల టేకు చేప మత్స్యకారుల వలకు చిక్కడంతో వారంతా ఆనందంతో ఎంజాయ్ చేశారు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, East Godavari Dist, Fish, Fishermen

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు