చిత్తూరు జిల్లా : ఓ వైపు కరోనా మహమ్మారి పచ్చనిపల్లెలను కలవరపెడుతుంటే మరో వైపు మద్యం షాపులు భయాందోళనలకు గురిచేస్తున్న పరిస్థితులు చిత్తూరు జిల్లా శ్రీసిటీ పారిశ్రామిక పరిసర గ్రామాల్లో నెలకొంది. సత్యవేడు మండలం శ్రీసిటీ సెజ్ పరిధిలోని అప్పయ్యపాళ్యెం గ్రామంలో మద్యం దుకాణాన్ని తొలగించాలంటూ మహిళలు ,గ్రామస్తులు నిరసన చేపట్టారు.తమిళనాడు నుండి మద్యం ప్రియులు అధికసంఖ్యలో ఇక్కడకు వస్తుండటం గ్రామస్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు మహిళలు వాపోతున్నారు.మద్యం షాపు వద్ధకు చేరుకుని ప్రశ్నించిన మహిళలకు సిఎం జగన్మోహన్ రెడ్డిని అడగండి అంటూ ఉద్యోగులు వెటకారంగా సమాధానం ఇవ్వడంతో మద్యం షాపు వద్ధ మహిళలు బైటాయించి ఆంధోళనను ఉధృతం చేశారు.ఇంటికి ఒక బిడ్డ ఈ మద్యంషాపు వల్ల రోడ్డు ప్రమాదంలో మరణించాడని, ఆకుటుంబం లో చోటుచేసుకున్న విషాదం మరేకుటుంబంలో జారకుండా ఉండాలంటే మద్యం షాపును వెంటనే తొలగించాలని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడు నుండి మద్యం కోసం గుంపు గుంపులు గా వస్తున్న వారిని చూస్తుంటే ఎక్కడ కరోనా భారిన పడతామోనని గ్రామస్తులు మనోవేదనకు గురౌతున్నారు. శ్రీసిటీ యాజమాన్యం,సంబంధిత అధికారులు చొరవ తీసుకుని గ్రామంలోని మద్యం షాపును పూర్తిగా తొలగించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Chitoor, Liquor, Wine shops