హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

మద్యం షాపులకు వ్యతిరేకంగా విశాఖలో మహిళల ఆందోళన

మద్యం షాపులకు వ్యతిరేకంగా విశాఖలో మహిళల ఆందోళన

విశాఖపట్టణంలో మహిళల ఆందోళన

విశాఖపట్టణంలో మహిళల ఆందోళన

గత 40 రోజులుగా మద్యం అమ్మకాలను నిలిపివేయడంతో తమ కాపురాలు సజావుగా సాగుతున్నాయని.. మళ్లీ ఇప్పుడు షాపులు తెరవడంతో భర్తలు చిత్రహింసలు పెడుతున్నారని కొందరు మహిళలు వాపోయారు.

  ఏపీలో మద్యం అమ్మకాలపై తీవ్ర దుమారం రేగుతోంది. కరోనా లాక్‌డౌన్ వేళ లిక్కర్ అమ్మకాలకు ఎందుకు అనుమతిచ్చారని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అక్కడ ఎవరూ సామాజిక దూరం పాటించడం లేదని.. కరోనా వైరస్ మరింత వ్యాపించే ప్రమాదముదని హెచ్చరించారు. ప్రభుత్వంపై ఓ వైపు విపక్షాలు మండిపడుతున్న వేళ.. మరోవైపు మహిళలు సైతం రోడ్డెక్కారు. మద్యం అమ్మకాలను నిలివేయాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నారు. మంగళవారం విశాఖపట్టణంలో స్ధానిక మహిళలు ఆందోళన చేపట్టారు. ముఖానికి మాస్క్‌లు ధరించి ధర్నా చేశారు.

  గత 40 రోజులుగా మద్యం అమ్మకాలను నిలిపివేయడంతో తమ కాపురాలు సజావుగా సాగుతున్నాయని.. మళ్లీ ఇప్పుడు షాపులు తెరవడంతో భర్తలు చిత్రహింసలు పెడుతున్నారని కొందరు మహిళలు వాపోయారు. మద్యంను మరచిపోతున్నారని సంబరపడే లోపే.. రాష్ట్రంలో వైన్ షాప్‌లను తెరిచి మహిళలకు మళ్లీ ఇబ్బందులు తెచ్చిపెట్టారని మండిపడ్డారు. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో కూరగాయలు, నిత్యావసర దుకాణాలకు కేవలం 3 గంటలే అనుమతి ఇస్తున్నారని.. కానీ మద్యం షాపులకు మాత్రం 7 గంటల పాటు నడుపుతున్నారని మహిళలు ఆందోళన చేపట్టారు.


  కాగా, సోమవారం వైన్ షాపుల ముందు మద్యం ప్రియులు పెద్ద ఎత్తున గుమిగూడడంతో సీఎం జగన్ సంచన నిర్ణయం తీసుకున్నారు. నిన్నే మద్యం ధరలను 25 శాతం పెంచిన జగన్ సర్కారు.. మరో 50 శాతం ధరలను పెంచేసింది. నిన్నటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మద్యం ధరలను భారీగా పెంచేసింది. మొత్తంగా 75శాతం మద్యం ధరలను ప్రభుత్వం పెంచింది. ఇప్పటికిప్పుడే పెంచిన ధర అమల్లోకి వచ్చింది. ఈ నెలాఖరులోగా మరో 15శాతం మద్యం దుకాణాల తగ్గించాలని ప్రభుత్వం సంకల్పించింది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Liquor sales, Liquor shops, Visakhapatnam, Wine shops

  ఉత్తమ కథలు