Rape and murder : నొప్పులకు మందులు ఇస్తానని ఆమెను గుడిసెలోకి తీసుకువెళ్లాడు.. ఆగకుండా.. ఆమెపై... !

ప్రతీకాత్మక చిత్రం

Rape and murder : వ్యవసాయ పనుల కోసం కూలీలను పిలిచేందుకు వెళ్లిన ఓ మహిళపై కామంధుడి కన్నుపడింది.. మాయమాటలతో ఆమెను ఇంట్లోకి తీసుకువెళ్లి... ఆపై అత్యాచారం చేశాడు.. ఆమె ప్రతిఘటించడంతో దారుణంగా హత్య చేశాడు.. అయితే గ్రామస్థుల చేతిలో నిందితుడుగా బలయ్యాడు..

 • Share this:
  మహిళలు ఒంటరిగా కనిపడితే చాలు.. మగవాళ్ల కళ్లు కామంతో  మూసుకుని పోతున్నాయి.. వయస్సుతో సంబంధం లేకుండా నీచంగా వ్యవహరిస్తున్నారు..  దీంతో తన కోసమే వచ్చినట్టుగా మహిళలపై లైంగికదాడి ( rape ) చేస్తున్న సంఘటనలు కలకలం రేపుతున్నాయి.. అయితే చివరికి అత్యాచార నిందితులకు చావే శరణ్యం అవుతున్నా వారిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. ఈ క్రమంలోనే  తాజాగా ఆంధ్రప్రదేశ్ ( Andrapradesh ) ప్రకాశం జిల్లాలో కూలీల కోసం వచ్చిన మహిళపై దారుణానికి ఒడిగట్టిన సంఘటన ( prakasham ) జిల్లా జరుగుమల్లి మండలం కామేపల్లిలో వెలుగు చూసింది.

  కామేపల్లి గ్రామానికి చెందిన వంకాయలపాటి విజయలక్ష్మికి 42 సంవత్సరాలు.. వ్యవసాయ పనుల కోసం కూలీలను పిలిచేందుకు ఆదివారం ( sunday )రాత్రి 8.30 గంటల సమయంలో వుడ్డెపాలెం వెళ్లింది. సోమవారం ఉదయం పని కోసం కూలీలను పిలుస్తుండగా అదే కాలనీకి చెందిన వల్లెపు ఓబయ్య(51) ఈ విషయాన్ని గమనించాడు. విజయలక్ష్మిని పలకరించి ఆమెతో మాటలు కలిపాడు. మాటల్లో పడిన ఆమె వాటి కుట్రను పసిగట్టలేకపోయింది.. దీంతో ఆమె మోకాళ్ల నొప్పులకు మందులిస్తాను ( medicine ) రమ్మంటూ విజయలక్ష్మిని ఇంటికి తీసుకుని వెళ్లాడు.. నిజమే అనుకుని నిందితుడితో వెళ్లిన ఆమె ఇంట్లోకి వెళ్లడతో.. బలత్కరించేందుకు ప్రయత్నించాడు. ఊహించని ఈ సంఘటనతో విజయలక్ష్మి తీవ్రంగా ప్రతిఘటించి గట్టిగా కేకలు వేసింది. విషయం బయటకు చెబితే తన పరువు పోవడంతో పాటు బయట ఇబ్బందులు ఎదురవతాయని భావించిన ఓబయ్య గట్టిగా అరుస్తున్న విజయలక్ష్మిపై వెంటనే దాడి చేశాడు. కదలకుండా... కాళ్లు, చేతులు కట్టేసి ఆపై గొడ్డలితో నరికి చంపాడు.

  ఇది చదవండి :  హైదరాబాద్‌లో టీ బాగా కాస్లీ గురు.. కప్పు చాయ్ 1000 రూపాయలట..!


  ఆ తర్వాత.. ఇంటి నుంచి బయటకు వచ్చి విజయలక్ష్మిని హత్యచేసిన ( murder ) విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పాడు. దీంతో వారు జరిగిన విషయాన్ని జరుగుమల్లి పోలీసులకు చెప్పారు.. ఈ క్రమంలోనే స్థానిక ఎస్సై రజియా సుల్తానా బేగం హుటాహుటిన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అక్కడే ఉన్న నిందితుడు ఓబయ్యను తన వాహనంలో ఎక్కించుకుని స్టేషన్‌కు ( police station ) తరలించేందుకు ప్రయత్నించారు.

  ఇది చదవండి : సోదరి ప్రియున్ని హత్య చేసి .. ఆ తర్వాత శవాన్ని నేరుగా స్టేషన్‌కే తీసుకెళ్లాడు.. ఆ తర్వాత...?


  అయితే విషయం తెలిసిన గ్రామస్థులు అప్పటికే ఆగ్రహంతో ఊగిపోతున్నారు.. దీంతో గ్రామస్థులు ఒక్కసారిగా ఓబయ్యపై దాడి చేశారు. పోలీసు వాహనంలో ఉన్న ఓబయ్యను బయటికి లాగి దాడి చేశారు. అడ్డుకోబోయిన ఎస్సై పైనా కూడా దాడి చేశారు. ఆగ్రహంతో స్థానికులు విచక్షణారహితంగా దాడి చేయటంతో ఓబయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఆ గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.. పోలీసులపై కూడా దాడి కొనసాగడంతో పెద్ద ఎత్తున పోలీసులు సైతం మోహరించారు.
  Published by:yveerash yveerash
  First published: