GT Hemanth Kumar, News18, Tirupati
దాంపత్య జీవితం.. నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం. నమ్ముకున్న దంపతుల మధ్య ఉన్న నమ్మకాన్ని కోల్పోతే సంసారంలో ఆటుపోట్లు తప్పవు. అందుకే దాపత్య జీవితంలో అబద్ధాలకు తావు లేకుండా చూసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. కట్టుకున్న భార్య.. కన్న బిడ్డల కోసం విదేశాలకు వెళ్లి కష్టపడుతున్నాడో వ్యక్తి. మూడేళ్ళుగా అక్కడే ఉంటూ కుటుంబానికి డబ్బులు పంపుతున్నాడు. కానీ ఓ రోజు భార్య వికృత చేష్టలు బహిర్గతం అయ్యాయి. భర్త దూరంగా ఉండటంతో వేరొక వ్యక్తితో వివాహేతర సంభంధం పెట్టుకుంది. ఆమె భర్త డబ్బులు పంపండం మానేయడంతో వడ్డీకి డబ్బులు ఇచ్చి జీవనం సాగిస్తోంది. మొండి బకాయిలు రాబట్టడానికి ఓ పోలీసుతో ఎఫైర్ పెట్టుకుంది. చివరకి అనుకోని ఘటన ఆమె జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది.
వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కడప జిల్లా (Kadapa District) వేంపల్లె పట్టణంలోని భరత్ నగర్ లో షేక్ ఫరహన్ అనే మహిళ తన పిల్లలతో కలసి నివాసం ఉంటోంది. ఉపాధి కోసం ఆమె భర్త మూడేళ్ల క్రితం కువైట్ వెళ్ళాడు. తన ఖర్చులకు పోనూ మిగిలిన డబ్బులను భార్యాబిడ్డలకు పంపించాడు. భర్త అంతదూరం ఉండటతో పిల్లల్ని చక్కగా చూసుకోవాల్సిన భార్య.. దారి తప్పింది. తన కోరికలు తీర్చుకునేందుకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తెలిసిన వారు కొందరు భర్తకు సమాచారమిచ్చినా అతడు మాత్రం అవేమీ పట్టించుకోలేదు. కానీ పరహాన్ ప్రియుడు బాషా.. ఆమెకు వద్దకు వచ్చిన సమయంలో, ఏకాంతంగా గడిపే సమయంలోనూ భర్తకు వీడియో కాల్ చేసి బాగోతాన్ని బయటపెట్టాడు.
దీంతో భర్త.. ఫరహాన్ కు డబ్బులు పంపడం మానేశాడు. అప్పటికే వడ్డీ వ్యాపారం చేస్తున్న ఫరహాన్ కొంతకాలం ఆ డబ్బుతో నెట్టుకొచ్చింది. ఐతే మొండిబకాయిలు వసూలు చేసుకునే క్రమంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఓ పోలీస్ తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. అతడి సాయంతోనే రావాల్సిన బకాయిలను వసూలు చేసుకునేది. ఐతే తనను కాదని పోలీస్ అక్రమ సంబంధం పెట్టుకుందని ఫరహాన్ పై ఆమె ప్రియుడు ఇడ్లీ బాషా కక్ష పెంచుకున్నాడు. అదే సమయంలో ఫరహాన్ అనుమానాస్పద స్థితిలో రక్తపుమడుగులో పడి మృతి చెందింది.
ఇది చదవండి: మొగుడు మంచోడని ఊరంతా చెప్పుకుంది.. కానీ అంత మాయ చేస్తాడనుకోలేదు..
ఐతే తన బిడ్డను ఇడ్లీ బాషానే గొంతుకోసి హత్య చేశాడని ఫరహాన్ తల్లి ఆరోపిస్తోంది. పోలీస్ తో సన్నిహితంగా ఉంటుందనే ఇంత ఘాతుకానికి పాల్పడ్డాడని ఆరోపించింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Extramarital affairs, Kadapa