Home /News /andhra-pradesh /

WOMAN SUSPECT DEATH AFTER HAVING EXTRAMARITAL AFFAIR WITH SON IN LAW IN KADAPA DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT

Affair: అల్లుడి తమ్ముడితో అక్రమ సంబంధం..ఇద్దరి మధ్య గొడవ.. ఇంతలోనే అనూహ్య ఘటన..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Affair: ఒంటరిగా ఉన్న మహిళలు తోడు కోసం పాకులాడితే.., తమ అవసరాలు తీర్చే భాగస్వామి కోసం మగవాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలా కొనసాగే బంధాలు వివాదాల్లో ముగిసిపోతున్నాయి. చిన్న కారణాలే వారి సహజీవనాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి.

    GT Hemanth Kumar, Tirupathi, News18

    ఈ రోజుల్లో అక్రమ సంబంధాలు తరచూ వెలుగుచూస్తున్నాయి. అవే అనర్ధాలకు దారితీస్తున్నాయి. అగ్నిసాక్షిగా మనువాడిన వారిని కాదని తాత్కాలిక సుఖాల వెంట పరుగులుపెట్టేవారు పెరిగిపోతున్నారు. భర్త చనిపోయిన మహిళలు.., భార్యకు దూరంగా ఉండే పురుషులు లైంగిక సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఒంటరిగా ఉన్న మహిళలు తోడు కోసం పాకులాడితే.., తమ అవసరాలు తీర్చే భాగస్వామి కోసం మగవాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలా కొనసాగే బంధాలు వివాదాల్లో ముగిసిపోతున్నాయి. చిన్న కారణాలే వారి సహజీవనాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఓమహిళ వావి వరసలు మరచి అల్లుడి తమ్ముడితో ఎఫైర్ పెట్టుకుంది. కానీ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కడప జిల్లా (Kadapa District) చింతకొమ్మదిన్నె మండలంలోని గూడవాండ్లపల్లెలో మహిళా ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారన చేపట్టారు.

    పోలీసులు తెలిపిన వివరాల మేరకు తెలంగాణ (Telangana State) రాష్ట్రాంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudeam District) కు చెందిన సోని కొంతకాలంగా సీకేదిన్నే మండలం గూడవాండ్ల పల్లెలో నివాసముంటోంది. సోనికి ఇద్దరు కుమార్తెలు. భర్త కొన్నేళ్ల క్రిందట అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో కూలినాలి చేసుకుంటూ తన ఇద్దరు కుమార్తెలను పెంచి పెళ్లిళ్లు చేసింది. పెద్ద కుమార్తెను కృష్ణా జిల్లా తిరువూరు మండలం అక్కపల్లెకు చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేసింది. పెద్ద కూతురి ఇంటికి తరచు వెళ్ళివస్తూ రాకపోకలు సాగించేది. అదే సమయంలో తన అల్లుడికి సోదరుడైన హిమామ్‌ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది.

    ఇది చదవండి: ప్రేమ పెళ్లి చేసుకున్నవాడ్ని మోసం చేయడానికి నీకు మనసెలా వచ్చింది.. మరీ అంత పచ్చి మోసమా..?


    కడప జిల్లాలో సహజీవనం
    ఇద్దరూ వావి వరసలు మరిచి ఇంట్లో నుంచి వచ్చేసి సహజీవనం చేస్తున్నారు. సీకే దిన్నె మండలం గుడవాండ్లపల్లెలోని దళితవాడలో ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటున్నారు. ఇద్దరు కూలి పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. ఈక్రమంలో సోమవారం రాత్రి ఇద్దరూ కలిసి పీకలదాకా తాగారు.

    ఇది చదవండి: ఆమెకు భర్త లేడు.. అతడికి భార్యలేదు.. ఇద్దరికీ మిస్డ్ కాల్ పరిచయం.. ఓ అర్ధరాత్రి షాకింగ్ ఘటన


    మద్యం మత్తులో ఇద్దరి మధ్య చిన్న వాగ్వాదం చోటు చేసుకుంది. ఇద్దరూ కాసేపు గొడవపడ్డారు. అనంతరం సోనీ తన పెద్దకుమార్తె వద్దకు వెళ్తానని చెప్పడంతో మళ్లీ మాటామాటా పెరిగింది. ఇద్దరూ ఒకర్నొకరు దూషించుకున్నారు. ఈ క్రమంలో మనస్తాపం చెందిన సోనీ అర్ధరాత్రి ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హిమామ్ ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Extramarital affairs, Kadapa

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు