క్లర్క్ పోస్టు కోసం డబ్బులు గుంజి.. కామ కోర్కెలు తీర్చాలని..

గతంలోనూ అతను చాలామంది మహిళలను వేధించాడని.. అతనిపై కఠిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేస్తోంది.

news18-telugu
Updated: July 3, 2019, 5:40 PM IST
క్లర్క్ పోస్టు కోసం డబ్బులు గుంజి.. కామ కోర్కెలు తీర్చాలని..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: July 3, 2019, 5:40 PM IST
గుంటూరు జిల్లా అటవీశాఖ అధికారిపై ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది.దీనిపై స్థానిక పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది.తనకు అటవీశాఖలో క్లర్క్ ఉద్యోగం ఇప్పిస్తానని డీఎఫ్‌వో(జిల్లా అటవీ అధికారి) తన వద్ద నుంచి రూ.2లక్షలు తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. అయితే
చెప్పినట్టుగా తనకు ఉద్యోగం ఇవ్వలేదని.. దానిపై ప్రశ్నిస్తే లైంగికంగా వేధిస్తున్నాడని వాపోయింది.అతని వేధింపులు భరించలేక పోలీసులను ఆశ్రయించినట్టు వెల్లడించింది. డబ్బుల కోసం గట్టిగా నిలదీస్తే.. ఎదురు కేసులు పెడుతానని బెదిరిస్తున్నట్టు తెలిపింది. గతంలోనూ అతను చాలామంది మహిళలను వేధించాడని.. అతనిపై కఠిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేస్తోంది. కేసు నమోదు చేసుకున్న గుంటూరు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


First published: July 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...