ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు ముగిసినా.. గెలుపొటములకు సంబంధించిన పంచాయతీలు మాత్రం నడుస్తూనే ఉన్నాయి. ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు గ్రామస్తులపై కక్ష సాధిస్తున్న సందర్భంగాలు చోటు చేసుకుంటున్నాయి. ఓ గ్రామంలో తనను ఏకగ్రీవంగా ఎన్నుకోలేదన్న కోపంతో ఓమహిళ శ్మశానానికి దారిని కట్టేసింది. వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా బుచ్చునాయుడు కండ్రిగ మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన ముత్యాలమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని అంత్యక్రియలు నిర్వహించేందుకు శ్మశానానికి తుసుకెళ్తుండగా.. గ్రామానికి చెందిన బుజ్జమ్మ అనే మహిళ అడ్డుకున్నారు. తనను సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటామని మాట ఇచ్చిన గ్రామస్తులు మోసం చేసి వేరే వ్యక్తిని పోటీలో నిలబెట్టారని ఆరోపిస్తూ తన పొలంలో నుంచి వెళ్లేది లేదుంటూ వారిని అడ్డుకున్నారు.
మృతురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వేడుకున్నా వినకపోవడంతో రోడ్డుపైనే మృతదేహాంతో ఉండిపోవాల్సి వచ్చింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి బుజ్జమ్మతో చర్చలు జరిపినా ఆమె మాత్రం ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. గ్రామస్తుల మాటలు నమ్మి లక్షల రూపాయలు పోగొట్టుకున్నానని ఆమె ఆరోపించారు. పోలీసులు, అధికారులు ఆమెతో చర్చలు జరిపి ఒప్పించడంతో చివరకు అనుమతిచ్చింది. దాదాపు మూడు గంటల తర్వాత అంత్యక్రియలు నిర్వహించారు.
ఇటీవల ఇలాంటి ఘటనే శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. కొత్తూరు మండలం మెట్టూరుగూడకు చెందిన 65 ఏళ్ల రాయవలస మహలక్ష్మి ఆనారోగ్యంతో మృతి చెందింది. అయితే తెలిసినవారు.. సన్నిహిత బంధువుల చివరి చూపుకోసం రాత్రి అంతా ఉంచి ఇవాళ అంత్యక్రియలు చేయాలనుకున్నారు. అంతిమ యాత్ర తరువాత మృతదేహాన్నిమెట్టూరు బిట్-3 నిర్వాసితకాలనీలోని శ్మశానవాటికకు తీసుకువచ్చారు. అక్కడ వరకు అంతా సవ్యంగానే సాగింది. తరువాత అసలు సమస్య మొదలైంది.
ఆ శ్మశాన వాటిక చుట్టుపక్కల ఇళ్లున్నాయని, ఇక్కడ అంత్యక్రియలు చేస్తే ఒప్పుకోమని స్థానికులు అడ్డుపడ్డారు. మెట్టూరుగూడకు నూతనంగా కేటాయించిన శ్మశానవాటికకు మృతదేహాన్ని తరలించాలి అక్కడ అంత్యక్రియలు చేసుకోవాలని కోరారు. ఇళ్ల మధ్య అంత్యక్రియలు చేస్తామంటే ఎలా ఒప్పుకుంటామని నిలదీశారు. అందుకు మెట్టూరువాసులు ఒప్పుకోలేదు. ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తున్న శ్మాశనవాటికను కాదంటే ఎలా అని ఎదరు ప్రశ్నించారు. ఇలా ఒకరితో ఒకరు వాదించుకున్నారు. ఆ వాదన కాస్త ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. అందులో ఎవరూ వెనక్కు తగ్గ లేదు. పంతానికి పోయి కాలనీలోని నడిరోడ్డుపైనే మృతదేహాన్ని వదిలేసి మెట్టుూరుగూడకు చెందిన వారు వెళ్లిపోయారు.
మృతదేహాన్ని రోడ్డుపైనే వదిలేయడంతో ఆ గ్రమస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న అధికారులు.. పోలీసులు ఇరు వర్గాలకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. వేరే చోట అంత్యక్రియలు చేసుకోవాలని సూచించారు. కానీ వారు అందుకు ఒప్పుకోలేదు.. పాత శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేసుకోనీయండి అంటే స్థానికులు ఒప్పుకోలేదు. ఎవరూ వెనక్కు తగ్గలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra pradesh news, Ap local body elections, AP News, Gram Panchayat Elections, Telugu news