WOMAN LOST HIS ARM AFTER SHE PUT HAND OUT SIDE FROM BUS WINDOW IN SRIKAKULAM DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN
Srikakulam Woman: బస్సులో కునుకుతీస్తూ చేయి బయటపెట్టింది.. కాసేపటికే షాకింగ్ సీన్..
ప్రతీకాత్మకచిత్రం( Photo Credit: Facebook)
Srikakulam: బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు చేతులు బయటపెట్టరాదు అని రాసి ఉంటుంది. కానీ కొందరు ప్రయాణికులు మాత్రం పొరబాటునో, లేకుంటే ఆదమరిచి చేతులు బయటపెడుతుంటారు. అలాంటివే ప్రమాదాలకు దారితీస్తాయి.
బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు చేతులు బయటపెట్టరాదు అని రాసి ఉంటుంది. కానీ కొందరు ప్రయాణికులు మాత్రం పొరబాటునో, లేకుంటే ఆదమరిచి చేతులు బయటపెడుతుంటారు. కొందరు ఏకంగా తలే కిటికీలో నుంచి బయటపెట్టి జర్నీని ఎంజాయ్ చేయాలని చూస్తారు. కానీ డ్రైవర్లు మాత్రం వెంటనే వారిని వారిస్తారు. కానీ ఆర్టీసీ బస్సులో ప్రయణిస్తున్న ఓ మహిళ నిద్రపోతూ చేతిని బయటపెట్టింది. కానీ కొద్దిసేపటికే ఆమె చేయి తెగిపడింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం నడిమికెల్లకు చెందిన పేలూరి పైడితల్లి అనే మహిళ.. శనివారం శ్రీకాకుళం (Srikakulam) లోని ఓ ఆస్పత్రికి వెళ్లింది. తిరిగి ఇంటికెళ్లేందుకు శ్రీకాకుళం నుంచి పాలకొండ వరకు బస్సులో వచ్చింది. పాలకొండ నుంచి పార్వతీపురం వెళ్లేందుకు పల్లెవెలుగు బస్సు ఎక్కింది.
డ్రైవర్ వెనుక వరుసలోని విండో సీట్ లో కూర్చుంది. బస్సు బయలుదేరిన కాసేపటికే కునుకుతీసింది. ఈ క్రమంలో చేయి బయటకు పెట్టింది. బస్సు వీరఘట్టంలోని హైస్కూల్ వద్దకు చేరుకునేసరికి ఎదురుగా వస్తున్న ఆటో బస్సుకు రాసుకుంటూ వెళ్లింది. ఆటో పై భాగంలో ఉండే ఇనుప రాడ్డు గలడంతో ఆమె చేయి తెగిపడిపోయింది. పైడితల్లి కేకలు వేయడంతో స్పందించిన ప్రయాణికులు ఆమెకు సపర్యలు చేసి వీరఘట్టం ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం తరలించారు.
గత ఏడాది నవంబర్ 20న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా గౌరీపట్నంకు చెందిన లోహిత్ రాణి అనే యువతి.. తన ఫ్రెండ్ పెళ్లి కోసం వచ్చింది. లోహిత్ రాణితో పాటు మరో ఆరుగురు చెన్నైలో సీఏలుగా పనిచేస్తున్నారు. మరో ఇద్దరు బీటెక్ పూర్తి చేశారు. పెళ్లికి వచ్చిన స్నేహితులంతా గౌరీపట్నంలోని లోహిత్ రాణి ఇంట్లో బస చేశారు. ఆ తర్వాత సరదాగా షికారుకు బయలుదేరారు. గోదావరి జిల్లాల్లో ఉన్న పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఆ క్రమంలోనే గౌరీపట్నం నుంచి కారులలో మారేడుమిల్లికి బయలుదేరారు.
ఐతే కారు మధురపూడి విమానాశ్రయం గేటు-బూరుగుపూడి గ్రామం మధ్య ప్రయాణిస్తుండగా.. లోహిత్ రాణి చల్లగాలి కోసం కారు కిటికీ నుంచి తల బయటకు పెట్టారు. అదే సమయంలో కారు రోడ్డు అంచు దిగడంతో పక్కనే ఉన్న విద్యుత్తు స్తంభానికి ఆమె తల బలంగా తగిలింది. స్నేహితులంతా వెంటనే ఆమెను రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందింది. అలాగే శ్రీశైలంలోనూ గత ఏడాది బస్సు నుంచి తల బయటకుపెట్టిన ఓ యువతి ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.