హోమ్ /వార్తలు /andhra-pradesh /

Sad News: ఒక్కసారి డాక్టర్ దగ్గరికెళ్తే సరిపోయేది.. చిన్నపాటి నిర్లక్ష్యం ఎంతపని చేసిందో చూడండి..!

Sad News: ఒక్కసారి డాక్టర్ దగ్గరికెళ్తే సరిపోయేది.. చిన్నపాటి నిర్లక్ష్యం ఎంతపని చేసిందో చూడండి..!

Kadapa News: ఓ మహిళ తనకు అనారోగ్యంగా ఉంటే డాక్టర్ దగ్గరకు వెళ్లింది. ఆయన ఇచ్చిన మందులను సమయానికి  వేసుకుంది. రెండు నెలల తర్వాత ఊహించని విధంగా అనారోగ్యానికి గురైంది.  డాక్టర్లు ట్రీట్ మెంట్ ఇస్తుండగానే ప్రాణాలు కోల్పోయింది.

    ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు హాస్పిటల్ కు వెళ్తాం. అక్కడ డాక్టర్ రాసిచ్చిన మందులు వేసుకుంటాం. క్రమం తప్పకుండా మందులు వాడితే తిరిగి కోలుకుంటాం. మందులు సరిగా వాడకుంటే ఎంతమంది డాక్టర్ల దగ్గరకు వెళ్లినా ఫలితం ఉండదు. ఓ మహిళ తనకు అనారోగ్యంగా ఉంటే డాక్టర్ దగ్గరకు వెళ్లింది. ఆయన ఇచ్చిన మందులను సమయానికి వేసుకుంది. రెండు నెలల తర్వాత ఊహించని విధంగా అనారోగ్యానికి గురైంది. డాక్టర్లు ట్రీట్ మెంట్ ఇస్తుండగానే ప్రాణాలు కోల్పోయింది. ఐతే మృతిపై విచారించగా డాక్టర్లకు కూడా ఫ్యూజులు ఎగిరిపోయినంత పనైంది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కడప జిల్లా (Kadapa District) రాజంపేటకు చెందిన నాగసుబ్బమ్మ అనారోగ్యానికి గురికావడంతో గత ఏడాది డిసెంబర్ (December) లో కడపలోని ఓ ఆస్పత్రికి వెళ్లింది.

    ఆమెకు థైరాయిడ్ (Thyroid) వచ్చినట్లు గుర్తించిన అక్కడి డాక్టర్ మందులు రాసిచ్చారు. ఆమె కుమారుడు రాజంపేటలోని ఓ మెడికల్ షాపులో మందులు తెచ్చారు. రెండు నెలలకు పైగా మందులు వాడారు. మందులు వాడుతున్నా ఆమెకు అరోగ్యం క్షీణించింది. కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి మరోసారి డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. వాడిన మందులు కూడా చూపించడంతో డాక్టర్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు.

    ఇది చదవండి: రియల్ దృశ్యం సినిమా చూపించాడు.. రెండేళ్ల తర్వాత పోలీసులకు చిక్కాడు.. ఈ క్రైమ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్..

    నిజానికి డాక్టర్ యాంటీ థైరాక్సిన్ 10 ఎంజీ రాసిస్తే.. మెడికల్ షాపు లో మాత్రం థైరాక్సిన్ సోడియం 100 ఎంజీ మందులిచ్చాడు. ఆ మందులు వాడటం వల్లే ఆరోగ్యం క్షీణించినట్లు తేలింది. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు ఆమెను నెల్లూరులోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టర్లు ట్రీట్ మెంట్ స్టార్ట్ చేసినా ఆప్పటికే పరిస్థితి విషమించడంతో మృతి చెందింది.

    ఇది చదవండి: ఇలా అయితే అమ్మాయిలు బయటికెళ్లడానికే భయపడతారు.. ఛీ ఛీ మరీ ఇంత నీచమా..?

    దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మెడికల్ షాపు యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డాక్టర్ రాసిన మందులకు విరుద్ధంగా ట్యాబ్లెట్స్ ఇవ్వడంతోనే ఇదంతా జరిగిందని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. దీంతో పోలీసులు సదరు మందులను స్వాధీనం చేసుకొని మెడికల్ షాపు నిర్వాహకులను విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

    ఇది చదవండి: వాళ్లిద్దరి మధ్య అలాంటి సంబంధం.. పక్కింటామె జోక్యం చేసుకుందని తెలిసి.. ఏం చేశాడంటే..!

    సాధారణంగా మెడికల్ షాపుల్లో మందులు తీసుకున్న తర్వాత డాక్టర్ కు చూపించి ఎలా వాడాలన్నది తెలుసుకుంటుంటారు. ఐతే ఇక్కడ కడపలో డాక్టర్ కు చూపించుకొని.. మందులు రాజంపేటలో కొనుగోలు చేయడం వల్ల మెడికల్ షాపులో వేరే మందులు ఇచ్చినా బాధితులు సరిగా తెలుసుకోలేకపోయారనేది స్పష్టమవుతోంది. ఈ వ్యవహారంలో చిన్నపాటి నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.

    First published:

    ఉత్తమ కథలు