టిక్‌టాక్ వీడియోలు చేయోద్దని మందలించిన భర్త.. ఆత్మహత్య చేసుకున్న తల్లీకొడుకులు

రెండు నెలల క్రితం కరీమా కుటుంబం కారు ప్రమాదానికి గురయ్యింది. దీంతో వైద్యం కోసం రూ.4 నుంచి రూ.5 లక్షల వరకు రుణం తీసుకున్నాడు. దీంతో కుటుంబాన్ని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి.

news18-telugu
Updated: May 20, 2020, 5:25 PM IST
టిక్‌టాక్ వీడియోలు చేయోద్దని మందలించిన భర్త.. ఆత్మహత్య చేసుకున్న తల్లీకొడుకులు
ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న 15 నుంచి 39 సంవత్సరాల లోపు వారిలో 57.7 శాతం మంది భారత యువకులే ఉన్నారు.
  • Share this:
టిక్‌టాక్ వీడియోలు చేయోద్దన్నందుకు ఓ మహిళ తన కొడుకుతో కలిసి సెనైడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన విజయవాడలోని టూటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని వైఎస్ఆర్ కాలనీలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. వైఎస్ఆర్ కాలనీకి చెందిన షేక్ కరీమా(35), తన భర్త శంషుద్దీన్‌, కుమారుడితో కలిసి స్థానికంగా నివాసం ఉంటోంది. భర్త శంషుద్దీన్ బంగారు ఆభరణాల దుకాణంలో పాలిషర్‌గా పనిచేస్తున్నాడు. అయితే లాక్‌డౌన్ నేపథ్యంలో భర్త శంషుద్దీన్ ఉద్యోగం కోల్పోయాడు. ఇదిలావుంటే.. రెండు నెలల క్రితం కరీమా కుటుంబం కారు ప్రమాదానికి గురయ్యింది. దీంతో వైద్యం కోసం రూ.4 నుంచి రూ.5 లక్షల వరకు రుణం తీసుకున్నాడు. దీంతో కుటుంబాన్ని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. దీనికితోడు ఇటీవలే వారి పెద్దకుమార్తె వివాహం చేసుకుంది. వీటి నుంచి మానసిక ప్రశాంతత కోసం టిక్‌టాక్ వీడియోలతో ఎక్కువ సేపు గడిపేది. ఈ నేపథ్యంలో కరీమాతో భర్త శంషుద్దీన్ ఘర్షణపడ్డారు. దీంతో కరీమా బంగారాన్ని పాలిష్ చేసేందుకు ఉపయోగించే సైనైడ్ తాగి ఆత్మహత్య చేసుకుంది.

మైనర్ అయిన ఆమె కుమారుడు అదే రీతిలో ఆత్మహత్యకు పాల్పడింది. ఇరుగుపొరుగు టిక్‌టాక్‌లో వీడియోలను పోస్టు చేసినందుకు మహిళతో భర్త గొడవపడినందుకు ఆత్మహత్య చేసుకున్నట్టు చెబుతున్నారు. పోలీసులు మాత్రం ఆర్థిక సమస్యల కారణంగా మహిళ ఆత్మహత్యకు పాల్పడినట్టు పేర్కొన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను తరలించి కేసు నమోదు చేశారు.
First published: May 20, 2020, 5:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading