ఆడవాళ్లు చిన్న చిన్న విషయాలకే అలక పాన్పు వేస్తారు. అలాంటిది పెళ్లి రోజున (Marriage Day) వాళ్లు అడిగింది ఇవ్వకపోతే ఇంకేమైనా ఉందా.. ఇల్లు పీకి పందిరేయరూ..! శ్రావణ మాసం (Sravana Masam) సందర్భంగా వరలక్ష్మి వ్రతం (Varalaxmi Vratham) రోజు చీర కొనాలని భర్తని అడిగింది.. అదే రోజు పెళ్లి రోజు కూడా కావడంతో తనకు కొత్త చీర కావాలని చెప్పింది. అయితే, ప్రస్తుతం పరిస్థితి బాగాలేదని చెప్పినా వినకపోవడంతో ఇద్దరి మధ్య కాస్తంత గొడవ జరిగింది. దాంతో వెంటనే ఇంట్లోకి వెళ్లిన మహిళ, చీర కొనివ్వలేదన్న కోపంతో చున్నీతో ఉరేసుకుంది.
కోనసీమ జిల్లా చేబ్రోలుకు చెందిన మల్లిపూడి శ్రీనివాసరావుకు శంఖవరం మండలం నెల్లిపూడికి చెందిన పద్మినితో 2017లో వివాహమైంది. ఈ నెల 11వ తేదీ శ్రీనివాసరావు తన పొలంలో పనులు చూసుకుని ఇంటికి వచ్చాడు. భర్త రావడాన్ని గమనించిన భార్య పద్మని.. శ్రీనివాసరావు దగ్గరకు వెళ్లి ఈ ఏడాది వరలక్ష్మీ వ్రతం, పెళ్లి రోజు ఒకేసారి వచ్చాయని చీర కొనాలని అడిగింది. అయితే, ఇప్పుడు పరిస్థితులు బాగలేవని ఇప్పుడు కొనలేనని శ్రీనివాసరావు సమాధానం చెప్పాడు. తోటివారందరూ వరలక్ష్మీ వ్రతానికి కొత్త చీరలు కొనుక్కుంటున్నారని.. ఆ రోజు పెళ్లి రోజు కూడా అయినా తనకు చీర కొనాల్సిందేనని భీష్మించింది.
దాంతో భార్యభర్తమ ఇద్దరి మధ్య చిన్నగా మొదలైన గొడవ తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. భర్త ఎంతకీ చీర కొననని చెప్పడంతో ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్న పద్మిని చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. భార్య ఉరేసుకోవడాన్ని చూసిన భర్త బిగ్గరగా కేకలు వేయడంతో.. సమీపంలోని బంధువులు, స్థానికులు తలుపులు బద్దలుకొట్టి ఆమెను కిందకు దింపి ఆస్పత్రికి తరలించారు.
ఇదే కోనసీమ జిల్లాలో మరో ఘటన కూడా చోటుచేసుకుంది. తనను ప్రేమించానంటూ తనపై అత్యాచారం చేశాడని ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. జిల్లాలోని వడ్లమూరుకు చెందిన మాకన రాజేశ్ తనను ప్రేమించాలంటూ విజయవాడలోని ఓల్డేజ్ హోంలో కూలీగా చేస్తున్న 31 ఏళ్ల మహిళను మానసికంగా వేధించేవాడు. ఒకరోజు మహిళ అంగీకారం లేకుండానే అత్యాచారం చేసి.. ఆ తర్వాత పెళ్లి గురించి అడిగితే తిరస్కరించాడని ఫిర్యాదులో పేర్కొంది.
పెళ్లి గురించి మళ్లీ మాట్లాడితే అప్పట్లో సన్నిహితంగా ఉన్నప్పుడు ఫొటోలు దిగామని.. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తున్నాడని బాధితురాలు అంగర పోలీసుల ఎదుట వాపోయింది. తాను 2018 నుంచి విజయవాడలోనే ఉండేదానినంటూ బాధితురాలు తెలిపింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Attempt to suicide, Crime news, Husband, Wife