నాలుగు నెలల బాబు.. అర్ధరాత్రి ఏడుపులు.. పక్కలో తల్లి మిస్సింగ్.. ఎక్కడికెళ్లిందా అని వెతుక్కుంటూ వెళ్తే..

ఝాన్సి (పెళ్లి నాటి ఫొటో)

అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ ఇంట్లో బాబు ఏడుపులు వినిపించాయి. బాబు పక్కనే కనిపించాల్సిన కూతురు మంచంలో లేదు. బాత్రూంకు వెళ్లిందేమోనని అనుకున్నారు. కానీ అక్కడ కూడా లేదు. ఎన్నిసార్లు పిలిచినా స్పందన లేదు.

 • Share this:
  ఏడాదిన్నర క్రితం పెళ్లయింది. ఎనిమిది నెలల క్రితం ప్రసవం కోసం పుట్టింటికి వచ్చింది. ప్రస్తుతం ఆమెకు నాలుగు నెలల బాబు. భర్త హైదరాబాద్ లో బ్యాంకు ఉద్యోగి. ఎంతో ఆనందంగా గడిచిపోవాల్సిన ఆమె జీవితం ఊహించని రీతిలో విషాదాంతంలా ముగిసింది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ ఇంట్లో బాబు ఏడుపులు వినిపించాయి. బాబు పక్కనే కనిపించాల్సిన కూతురు మంచంలో లేదు. బాత్రూంకు వెళ్లిందేమోనని అనుకున్నారు. కానీ అక్కడ కూడా లేదు. ఎన్నిసార్లు పిలిచినా స్పందన లేదు. ఇంటి చుట్టుపక్కల ప్రాంతంలో అసలే లేదు. చివరకు ఇంటికి కాస్త దగ్గరలోని బావిలో ఆమె విగతజీవిలా కనిపించింది. అనుమానాస్పద రీతిలో ఆమె శవమై తేలింది. నాలుగు నెలల బిడ్డను, భర్తను వదిలేసి తనువు చాలించింది. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కింతలి గ్రామానికి చెందిన సనపల గిరిబాబుతో మజ్జిలిపేటకు చెందిన పైడి ఝన్సీతో ఏడాదిన్నర క్రితం పెళ్లయింది. గిరిబాబు హైదరాబాద్ లోనే ఓ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. ఎనిమిది నెలల క్రితం ప్రసవం కోసం ఝాన్సీ మజ్జిలిపేట లోని తన పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి అక్కడే ఉంటోంది. నాలుగు నెలల క్రితం ఆమె బాబుకు జన్మనిచ్చింది. భర్త అప్పుడప్పుడు వచ్చి భార్యను బిడ్డను చూసి వెళ్లేవాడు. అంతా హ్యాపీగా ఉందనుకున్న సమయంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఓ ఘటన ఆ కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో మిగిల్చింది. తల్లి పక్కలో లేకపోవడంతో ఆ బిడ్డ ఏడ్వడం మొదలు పెట్టాడు.
  ఇది కూడా చదవండి: ఓ ప్రేమ జంట రియల్ క్రైమ్ స్టోరీ.. టాలీవుడ్ లో కలకలం రేపిన కిడ్నాప్.. 6గంటల్లోనే చేధించిన పోలీసులు..

  బాబు ఏడుపుతో కుటుంబసభ్యులు ఉలిక్కిపడి లేచారు. చూస్తే మంచంలో ఝాన్సీ కనిపింలేదు. బాత్రూంలోనూ ఇంటి చుట్టుపక్కల వెతికి చూశారు. ఎక్కడా కనిపించకపోవడంతో అనుమానంతో దగ్గరలో ఉన్న బావిలో చూశారు. ఆ బావిలో విగత జీవిగా ఝాన్సి కనిపించింది. ఈ ఘటనపై పోలీసులు శనివారం కేసు నమోదు చేసుకున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్ కు తరలించారు. కాగా, కడుపునొప్పిని భరించలేకే తన కూతురు ఈ దారుణానికి పాల్పడిందని ఝాన్సి తండ్రి సూర్యారావు పోలీసులకు వెల్లడించాడు. ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయేమోనని ఆరా తీస్తున్నామనీ, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై దేవానంద్ తెలిపారు.
  ఇది కూడా చదవండి: హైదరాబాద్ లోని ఓ యువతిపై అమెరికా నుంచి తెలుగు టెకీ ఫిర్యాదు.. ఆమె గురించి ఆరా తీసిన పోలీసులకే..
  Published by:Hasaan Kandula
  First published: