Home /News /andhra-pradesh /

WOMAN BRUTALLY KILLED BROTHER DAUGHTER IN PEDABAYALU VISAKHA MANYAM UMG

నరరూప రాక్షసి.. పసిపిల్లని చంపి రక్తం తాగేసిన మహిళ.. విశాఖ మన్యంలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నరరూప రాక్షసులు.. మనుషుల్ని బతికుండంగానే పీక్కుతిని రక్తాన్ని తాగేస్తారు. అసలు ఆ మాట వింటనే ఒళ్లంతా జలదరిచ్చి ఓ గగుర్పాటుకు గురవుతాము. ఈరోజుల్లో అలాంటి వాళ్లు ఉంటారా..? అనేది కూడా ఊహించలేము. కానీ ఓ మహిళ ఆ నరరూప రాక్షసుల కన్నా అతి కిరాతకంగా వ్యవహరించింది. క్రూరత్వంగా ఆరేళ్ల తన మేనకోడలిని నరికేసి ఆ తర్వాత రక్తం తాగింది. ఈ అమానవీయ ఘటన విశాఖ  మన్యంలో చోటుచేసుకుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India
    నరరూప రాక్షసులు.. మనుషుల్ని బతికుండంగానే పీక్కుతిని రక్తాన్ని తాగేస్తారు. అసలు ఆ మాట వింటనే ఒళ్లంతా జలదరిచ్చి ఓ గగుర్పాటుకు గురవుతాము. ఈరోజుల్లో అలాంటి వాళ్లు ఉంటారా..? అనేది కూడా ఊహించలేము. కానీ ఓ మహిళ ఆ నరరూప రాక్షసుల కన్నా అతి కిరాతకంగా వ్యవహరించింది. క్రూరత్వంగా ఆరేళ్ల తన మేనకోడలిని నరికేసి ఆ తర్వాత రక్తం తాగింది. ఈ అమానవీయ ఘటన విశాఖ  మన్యంలో చోటుచేసుకుంది.

    పూర్తి వివరాల్లోకి వెళితే.. విశాఖ మన్యంలోని పెదబయలు మండలం లకేయపుట్టు గ్రామానికి చెందిన వంతాల రస్మో అనే మహిళకు పెళ్లయింది. అయితే, భార్యభర్తల మధ్య ఇటీవల కొద్దికాలంగా గొడవలు జరగడంతో.. భర్తతో గొడవపడి పుట్టింటికి వచ్చింది. అయితే, భర్త దగ్గరకు వెళ్లకుండా పుట్టింట్లోనే ఉంటోంది. దాంతో రస్మో తమ్ముడి భార్య, కుటుంబ సభ్యులు ఇక్కడ ఉండకూడదు భర్త దగ్గరకు వెళ్లాలని నచ్చజెప్పారు. ఎంతకీ వెళ్లకపోవడంతో అత్తారింటికి వెళ్లాలని గట్టిగా చెప్పారు. ఈ విషయమై ఇంట్లో చాలా సార్లు గొడవలు కూడా జరిగాయి. దాంతో తమ్ముడి భార్యపై రస్మో కక్ష పెంచుకుంది.

     ఇదీ చదవండి: ఏపీలో రసవత్తర రాజకీయం.. జనసేన పొత్తు ఆ పార్టీతోనే.. క్లారిటీ వచ్చేసింది..?


    రస్మో తమ్ముడు ఏడాది కిందట చనిపోగా.. ఆరేళ్ల పాప ఉంది. రస్మో తమ్ముడి భార్య మీద కోపాన్ని మేన కోడలిపై చూపించాలని అనుకుంది. దాంతో కట్టెలు తీసుకొద్దాము కొండకు వెళ్దామా అంటూ రస్మో ఆరేళ్ల పాపను తన వెంటపెట్టుకుని వెళ్లింది. కొండపైకి చేరుకున్న తర్వాత కట్టెలు కొట్టే గొడ్డలితో అతి కిరాతకంగా నరికేసి.. ఆ తర్వాత రక్తాన్ని జుర్రుకుని తాగింది.

    అదే సమయంలో అటుగా వెళ్తున్న కొందరు గ్రామస్తులు ఈ ఘటన చూసి ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యారు. పసిపాపను అత్యంత క్రూరంగా చంపడమే కాకుండా.. నరరూప రాక్షసుల్లా రక్తాన్ని తాగడంతో భయపడిన గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో రక్తపు మడుగుల్లో ఉన్న చిన్నారి మృతదేహం, ఒళ్లంతా రక్తంతో ఉన్న రస్మోని చూసి పోలీసులు కూడా గగుర్పాటుకు గురయ్యారు.



    చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించిన పోలీసులు.. రస్మోని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. చిన్నారి తండ్రి ఏడాది కిందటే మరణించగా.. ఆ తల్లి ఆరేళ్ల పాపతోనే ఒంటరిగా జీవిస్తోంది. ఇలాంటి సమయంలో చిన్నారి కూడా ఇలా దారుణంగా హత్యకు గురవ్వడంతో ఆ తల్లి విలవిలలాడిపోతోంది. ఆటవిక సమాజంలో చూసే ఘటనను ఇలా ప్రత్యక్షంగా చూడటంతో గ్రామస్థులు కూడా ఒణికిపోతున్నారు. రస్మో తీరును చూసిన ప్రతి ఒక్కరూ భయబ్రాంతులకు గురవుతున్నారు.
    First published:

    Tags: Crime, Crime news, Murder, Visakhapatnam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు