WOMAN BOOKED FOR HAVING RELATION WITH CHEDDI GANG AFTER SHE MADE POLICE COMPLAINT ON LOVE CHEATING IN ANAKAPALLI DISTRICT FULL DETAILS HERE PRN
Shocking: ప్రియుడిపై కేసు పెట్టి అడ్డంగా బుక్కైంది.. చెడ్డీగ్యాంగ్ లో ఉంటే లోపలేయరా మరి..!
ప్రతీకాత్మక చిత్రం
Anakapalli: ప్రియుడు మోసం చేశాడంటూ హడావిడి చేసింది. తనకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. కట్ చేస్తే పోలీసులు ఆమెనే లోపలేశారు. ఆమె హిస్టరీ గురించి తెలసి షాకయ్యారు.
ప్రియుడు మోసం చేశాడంటూ హడావిడి చేసింది. తనకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. కట్ చేస్తే పోలీసులు ఆమెనే లోపలేశారు. ఆమె హిస్టరీ గురించి తెలసి షాకయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం గోపాలపట్నం పరిధిలోని ఎల్లపువానిపాలెంకు చెందిన కాండ్రేగుల శ్రీవాణి జ్యోతి అనే యువతి.. అదే మండలంలోని టెక్కలిపాలెంకు చెందిన పందాల సత్యనారాయణ అనే వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని తనను మోసం చేసినట్లు ఈనెల 27న అతడి ఇంటి ముందు ఆందోళనకు దిగింది. అంతేకాదు ప్రేమ వ్యవహారానికి సబంధించిన ఆధారాలు చూపిస్తూ గోపాలపట్నం, సబ్బవరం పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు కూడా చేసింది. తనకు న్యాయం జరగలేదంటూ హడావిడి చేసింది.
మరోవైపు తన కుమారుడు కనిపించడం లేదంటూ సత్యనారాయణ తల్లి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బులివ్వకుంటే చంపేస్తానని శ్రీవాణి బెదరించడంతో ఎక్కడికో వెళ్లిపోయాడని.. ఆమె నుంచి సత్యనారాయణకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొంది. శ్రీవాణిపైనే అనుమానం వ్యక్తం చేసింది.
ఐతే ఈ రెండు ఫిర్యాదులను తీసుకొని శ్రీవాణిపై దృష్టిపెట్టిన పోలీసులకు ఓ షాకింగ్ నిజం తెలిసింది. శ్రీవాణి తెలుగు రాష్ట్రాలను హడలెత్తించిన చెడ్డీగ్యాంగ్ సభ్యురాలని తెలుసుకున్నారు. ఆమెపై ఒకటికాదు రెండు కాదు ఏకంగా 40 కేసులున్నట్లు గుర్తించారు. అంతేకాదు అమె గతంలో రెండుసార్లు ఆరునెలల చొప్పున జైలు శిక్ష కూడా అనుభవించినట్లు పోలీసులు తెలిపారు.
సత్యనారాయణ తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీవాణి మాయం చేసిందా అనే కోణంలో విచారిస్తున్నారు. ఆమె ఫోన్ కాల్ డేటాతో పాటు సత్యనారాయణ సెల్ ఫోన్ నెంబర్ ను ట్రేస్ చేసేపనిలో పడ్డారు. గతంలో శ్రీవాణి చేసిన దొంగతనాలు, చెడ్డీ గ్యాంగ్ తో ఉన్న సంబంధాలపై లోతుగా విచారణ జరుపుతున్నారు.
ఇదిలా ఉంటే గత ఏడాది చెడ్డీ గ్యాంగ్ ఏపీలో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అర్ధరాత్రుళ్లు ఖరీదైన ఇళ్లకు సమీపంలో మకాం వేశి తెల్లవారుజామున 2-3 గంటల మధ్య దోపిడీలకు పాల్పడేవారు. చెడ్డీలు ధరించడం ఎదురొచ్చినవారిపై రాళ్లతో దాడిచేసి సొత్తు దోచుకెళ్లడం చేసేవారు. ఐతే వారిని మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన వారుగా గుర్తించిన పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేశారు. ఐతే అనకాపల్లి కేసులో శ్రీవాణీ స్థానిక దొంగల ముఠాతోనే జట్టుకట్టిందా లేక ఇతర రాష్ట్రాల వారితో కలిసిందా అనేది తెలియాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.