రాత్రి 8 వరకే వైన్ షాప్‌లు.. రేపటి నుంచే అమలు..

ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు మద్యం అమ్మినా.. బెల్ట్ షాపులను నడిపినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది.

news18-telugu
Updated: September 30, 2019, 10:38 PM IST
రాత్రి 8 వరకే వైన్ షాప్‌లు.. రేపటి నుంచే అమలు..
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
ఏపీలో దశలవారీగా మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని సీఎం జగన్ పక్కాగా ప్రణాళికలు రూపొందించారు. ఏపీలో మంగళవారం నుంచే నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది.  రేపటి నుంచి ప్రభుత్వం దుకాణాల ద్వారానే మద్యం విక్రయాలు జరుగుతాయి. రాష్ట్రంలో మద్యం దుకాణాలను 20శాతం మేర తగ్గించింది ప్రభుత్వం.  అంతేకాదు వైన్ షాపుల్లో మద్యం అమ్మే వేళల్లో కీలక మార్పులు చేసింది. రేపటి నుంచి ఉదయం 11 నుంచి రాత్రి 8 వరకు మాత్రమే మద్యం షాపులు తెరిచి ఉంటాయని వెల్లడించింది ఏపీ సర్కార్. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు మద్యం అమ్మినా.. బెల్ట్ షాపులను నడిపినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది.

ఏపీలో 4,380 మద్యం షాపులు ప్రభుత్వ ఆధీనంలోేనే నడుస్తాయి. పట్టణాలు, నగరాల్లోని మద్యం దుకాణాల్లో ఒక సూపర్ వైజర్, ముగ్గురు సేల్స్‌మెన్ ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక సూపర్ వైజర్, ఇద్దరు సేల్స్‌మెన్ పనిచేస్తారు. గ్రామాల్లో మద్యం మహమ్మారిని తరిమేందుకు గ్రామ, వార్డు సచివాలయాల్లో 14,944 మహిళా కానిస్టేబుళ్లను నియమించింది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే ఐఎంఎల్‌ డిపోల నుంచి మద్యాన్ని, పోస్టర్లను, ఇతర సామాగ్రిని మద్యం షాపులకు తరలించారు. కొత్త నిబంధనలను సంబంధించిన పోస్టర్లను ఆయా షాపులకు అంటించారు.

కొత్త నిబంధనలు ఇవే:
ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే మద్యం షాపులు.

ప్రభుత్వ మద్యం దుకాణాల్లో షాపులకు పర్మిట్‌ రూమ్స్‌, లూజ్‌ సేల్స్‌ నిషేధం.

ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం అమ్మితే సిబ్బందిపై చర్యలు తప్పవు.

ఒక వ్యక్తికి గరిష్ఠంగా మూడు బాటిళ్ల కంటే ఎక్కువ మద్యాన్ని అమ్మడానికి వీల్లేదు.ఎవరి వద్దననా 3 బాటిళ్లకు మించి ఎక్కువ దొరికితే వారిపై కేసులు నమోదు.

ఔట్ సోర్సింగ్ సిబ్బంది ద్వారా ప్రభుత్వ వైన్ షాప్స్‌లో మద్యం అమ్మకాలు.

 
First published: September 30, 2019, 4:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading