హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

లిక్కర్‌కు కొత్త కండిషన్... మాస్క్‌తో పాటు గొడుకు పట్టాల్సిందే..

లిక్కర్‌కు కొత్త కండిషన్... మాస్క్‌తో పాటు గొడుకు పట్టాల్సిందే..

మద్యం షాపు నిర్వాహకులు, కొనుగోలు దారులకు ఏపీ డీజీపీ వార్నింగ్ ఇచ్చారు. ఖచ్చితంగా మాస్క్ ధరించడంతో పాటు మద్యం దుకాణల వద్ద గుంపులు గుంపులుగా గుమికుడరాదని పోలీస్ శాఖ స్పష్టం చేసింది.

    లిక్కర్ షాప్‌లు తెరచుకోవడంలో మద్యం బాబుల సంబరం అంతా ఇంతా కాదు. షాపుల తెరవక ముందే ఉదయం నుంచి క్యూ కడుతున్నారు. మద్యం దుకాణాల ముందు కిలోమీటర్ల మేర బారులు దీరుతున్నారు. సామాజిక దూరం పాటించాలని.. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదు. గుంపులు గుంపులుగా ఎగబడి మద్యం కోసం యుద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ అధికారులు కొత్త కండిషన్ తీసుకొచ్చారు. మద్యం కావాలంటే మాస్క్‌తో పాటు గొడగు తప్పనిసరి ఉండాలని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు గొడుగు పట్టుకుంటే.. కాస్త దూరం దూరంగా నిలబడాల్సి వస్తుంది. అప్పుడు సహజంగానే భౌతిక దూరం పాటిస్తారు. ఈ క్రమంలోనే గొడుగు నిబంధన తీసుకొచ్చారు అధికారులు.

    ఇప్పటికే గుంటూరు జిల్లా తెనాలిలో గొడుగు నిబంధన పెట్టారు. అక్కడ అది వర్కవుట్ అయ్యి.. అందరూ సామాజిక దూరం పాటించారు. ఈ నేపథ్యంలో అంతటా గొడుగును తప్పనిసరి చేశారు. నిబంధనలను పాటించకపోవడంతో ఏపీలో మద్యం ధరలను భారీగా పెంచిన విషయం తెలిసిందే. సోమవారం 25 శాతం పెంచిన ఎక్సైజ్ శాఖ.. మంగళవారం దానిపై అదనంగా మరో 50శాతం పెంచారు. పేదలకు మద్యం దూరం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రేట్లు భారీగా పెంచడంతో పాటు షాపులను తగ్గించడంతో ఏపీలో మద్యంపాన నిషేధం సాధ్యమవుతుందని వైసీపీ నేతలు స్పష్టం చేశారు. దీనిపై టీడీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఎదరుదాడి చేస్తున్నారు.

    అటు మద్యం షాపు నిర్వాహకులు, కొనుగోలు దారులకు ఏపీ డీజీపీ వార్నింగ్ ఇచ్చారు. ఖచ్చితంగా మాస్క్ ధరించడంతో పాటు మద్యం దుకాణల వద్ద గుంపులు గుంపులుగా గుమికుడరాదని పోలీస్ శాఖ స్పష్టం చేసింది. ఈ నిభందనలు అతిక్రమించిన షాపులను తక్షణమే మూసివేస్తామని హెచ్చరించింది. దీంతో పాటు మద్యం సేవించి గొడవలకు దిగడం, ఇతరులను వేధించడం, వివాదాలు సృస్టించడం, ప్రశాంతమైన వాతావరణానికి భంగం కల్పించే విధంగా వ్యవహరించొద్దని స్పష్టం చేసింది. ఈ విధంగా వ్యహరించే వారిపై జాతీయ విపత్తు చట్టం కింద కఠిన చర్యల తీసుకుంటామని హెచ్చరించింది.

    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: AP News, Liquor sales, Liquor shops, Wine shops

    ఉత్తమ కథలు