ఏపీ రాజధాని తరలింపు ప్రయత్నాలకు కేంద్రం చెక్ ?

కరోనా ఎఫెక్ట్ తగ్గిన వెంటనే వైసీపీ ప్రభుత్వం రాజధానిని విశాఖకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

news18-telugu
Updated: April 17, 2020, 1:19 PM IST
ఏపీ రాజధాని తరలింపు ప్రయత్నాలకు కేంద్రం చెక్ ?
అమరావతి-విశాఖపట్టణం
  • Share this:
ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలోనూ రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు ఆగడం లేదు. కరోనా అంశంతో పాటు రాజధాని తరలింపు అంశంపై కూడా టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. కరోనా ఎఫెక్ట్ తగ్గిన వెంటనే వైసీపీ ప్రభుత్వం రాజధానిని విశాఖకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తోందని... జూన్‌లో విశాఖకు రాజధానిని తరలించాలని చూస్తోందని కొందరు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఓ స్వామిజీ ఇచ్చిన సూచన మేరకు జగన్ ప్రభుత్వం ఈ రకమైన నిర్ణయం తీసుకుందని సదరు టీడీపీ నేత ఆరోపణలు చేశారు.

ఇదిలా ఉంటే ప్రస్థుత పరిస్థితుల్లో ఏపీ రాజధాని విషయంలో యథాతథ స్థితిని కొనాసాగించాలని కేంద్రం భావిస్తోందని తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఓ కీలక నేత మరికొందరు నేతలతో పంచుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా విపత్తు నేపథ్యంలో తీవ్ర నిర్ణయాలు వద్దనే భావనలో కేంద్రం ఉందని... ఇదే విషయాన్ని ఏపీ ప్రభుత్వానికి కేంద్రం తగు రీతిలో చెబుతుందని ఆ నేత చెప్పినట్టు సమాచారం. అయితే రాజధాని మార్పు అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని గతంలో స్పష్టం చేసిన కేంద్రం... ఈ విషయంలో జోక్యం చేసుకుంటుందా లేదా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి రాజధాని తరలింపు ప్రక్రియకు కరోనా వైరస్ తాత్కాలికంగా బ్రేకులు వేసిందని వైసీపీ భావిస్తుంటే... కరోనా ఎఫెక్ట్ తగ్గిన తరువాత రాజధాని తరలింపు అంశంలో కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం లేకపోలేదని టీడీపీ భావిస్తోంది.

First published: April 17, 2020, 1:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading