Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    AP Police: పోలీసులకు ఏపీ డీజీపీ సవాంగ్ వార్నింగ్.. అలా చేస్తే..

    AP DGP Gautam Sawang: అవినీతిని రాష్ట్రంలో లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని.. అందుకు అనుగుణంగా పోలీసులు పని చేయాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.

    news18-telugu
    Updated: August 26, 2020, 3:01 PM IST
    AP Police: పోలీసులకు ఏపీ డీజీపీ సవాంగ్ వార్నింగ్.. అలా చేస్తే..
    ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్(ఫైల్ ఫోటో)
    • Share this:
    Andhra Pradesh Police: కోవిడ్ సమయంలోనూ పోలీసులు బాగా పని చేశారని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. అయితే ఒకరిద్దరి వల్ల పోలీసు వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుందని వ్యాఖ్యానించారు. ప్రజల్లో పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అనే భావన వచ్చిందని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. పోలీసులు తప్పు చేస్తే శాఖాపరమైన చర్యలతో పాటు న్యాయపరంగా కూడా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మార్పు రావాలంటే కచ్చితంగా కఠినంగా ఉండకతప్పదని అన్నారు. రాబోయే మూడు నెలల్లో పోలీసు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తామని ఆయన చెప్పారు. పోలీసు శాఖలో సమగ్రత, అవినీతి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వెల్లడించారు. ప్రభుత్వం మన ప్రవర్తనను గమనిస్తోందని డీజీపీ సవాంగ్.. సామాన్యులకు సేవ చేయడం పోలీసుల బాధ్యత అని మరోసారి స్పష్టం చేశారు. ప్రభుత్వం పోలీసులకు వారాంతపు సెలవులు ఇచ్చిందని అన్నారు.

    కరోనా త్వరలో తగ్గిపోవాలని కోరుకుంటున్నానని.. పోలీసులుగా మనం ముందుంటామని.. కరోనాలో కూడా మనమే ముందుంటామని అన్నారు. అన్ని జిల్లాలలో అవగాహన, పరివర్తన, బాధ్యతల నిర్వహణకు సంబంధించిన కార్యక్రమాలు జరగాలని డీజీపీ సవాంగ్ తెలిపారు. ఏపీ పోలీసులకు టెక్నాలజీ స్కిల్స్‌లో పది అవార్డులు వచ్చాయని.. మొత్తం డిపార్ట్మెంట్‌కు 26 అవార్డులు వచ్చాయని గుర్తు చేశారు. మొత్తం కరప్షన్‌ను రాష్ట్రంలో లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని.. అందుకు అనుగుణంగా పని చేయాలని తెలిపారు. అందరూ మార్పుకు అనుకూలంగా పనిచేస్తారని ఆశిస్తున్నానని డీజీపీ సవాంగ్ వ్యాఖ్యానించారు.
    Published by: Kishore Akkaladevi
    First published: August 26, 2020, 3:01 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading