హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YCP Rebals: సస్పెన్షన్ కు గురైన ఆ నలుగురి ఎమ్మెల్యేల దారి ఎటు..? సీట్లపై హామీ వచ్చిందా..?

YCP Rebals: సస్పెన్షన్ కు గురైన ఆ నలుగురి ఎమ్మెల్యేల దారి ఎటు..? సీట్లపై హామీ వచ్చిందా..?

ఈ నలుగురి ఎమ్మెల్యేల దారెటు

ఈ నలుగురి ఎమ్మెల్యేల దారెటు

YCP Rebals: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిణామాల్లో ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓట్ వేశారనే అనుమానంతో నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో వారి ఫ్యూచర్ ఏంటి..? ఇప్పటికే వేరే పార్టీలో సీటుపై హామీ వచ్చిందా..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nellore, India

YCP Rebals: ఊహించిందే జరిగింది.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ (TDP) అభ్యర్థి గెలుపు పక్కా అని ఆ పార్టీ ప్రచారం చేసినట్టే అయ్యింది. ఎమ్మెల్సీ అభ్యర్థి విజయానికి 22 ఓట్లు కావాలి అంటే.. టీడీపీకి ఉన్నవి 19 ఓట్లే అయితే.. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలతో కలిపితే ఇంకా ఒక్క ఓటు మాత్రమే కావాలని.. ఆ ఓటు వైసీపీ (YCP) అసమ్మతి నేతలే వేస్తారంటూ టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. అదే సమయంలో వైసీపీ మాత్రం ఏడుకి ఏడు తామే నెగ్గుతామని ఎన్నిక ముగిసనంత వరకు కామెంట్ చేస్తూ వచ్చింది. ఆఖరికి ఎన్నిక ముగిసిన తరువాత కూడా 175కి 175 పోల్ అయ్యాయని.. వైసీపీ నేతలంతా తాము చెప్పిన అభ్యర్థులకే ఓటు వేశారని.. ఏడుకి ఏడు పక్కా అంటూ ప్రకటనలు చేశారు. కానీ ఫలితం ఊహించని షాక్ ఇచ్చింది. అత్యధికంగా టీడీపీకి 23 ఓట్లు వచ్చాయి. అందులో రెండు వైసీపీ రెబల్ ఓట్లు అనుకుంటే.. మరో ఇద్దరు వైసీపీ నేతలే టీడీపీకి అనుకూలంగా వేశారు. దీంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ లైన్ ను క్రాస్ చేసి ఓటు వేసిన ఆ నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుండి సస్పెండ్ చేశారు.

మరి ఇప్పుడు ఆ నలుగురు ఎమ్మెల్యేల దారెటు..? అన్నది ఆసక్తికరంగా మారింది. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి , మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిని సస్పెండ్‌ చేశారు. అయితే వీరందరికీ ప్రతిపక్ష పార్టీ నుంచి ఒక్కో ఎమ్మెల్యేకు

10 నుంచి 15 కోట్ల రూపాయల వరకు ముడుపులు ముట్టాయన్నది ఆరపోన.. అయితే టీడీపీ రెబల్, జనసేన ఎమ్మెల్యేలకు జగన్ ఎంత ఇచ్చారంటూ వారు రివర్స్ లో ప్రశ్నిస్తున్నారు.

ఎవరి వాదన ఎలా ఉన్నా.. ఈ నలుగురు ఎమ్మెల్యే ఎన్నికల ముందు లేదా ఒకటి రెండు నెలల తరువాత.. టీడీపీ కండువా కప్పుకుంటారు అనే ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా ఈ నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ అధిష్టానంపై చాలా అసంతృప్తితో ఉన్నారు. సమయం దొరికినప్పుడల్లా పార్టీపై ప్రత్యక్షంగాను, పరోక్షంగానూ విమర్శలు, సెటైర్లే వేస్తూ వచ్చారు. కొన్నిసార్టు సొంత పార్టీ నాయకులపై విమర్శలు కూడా చేశారు. వీటంటినీ గమనిస్తూ వచ్చిన అధిష్టానం అవకాశం కోసం ఎదురుచూసింది. ఇప్పుడు క్రాస్ ఓటింగ్ పేరుతా వారిపై చర్యలు తీసుకుంది.

ఇదీ చదవండి : ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు..?

అయితే పార్టీ నుంచి సస్పెండ్ చేసినా వారు ఎమ్మెల్యేలుగానే కొసాగుతారు కాబట్టి.. ఇప్పట్లో ఉప ఎన్నిక లేనట్టే.. కానీ ఒకవేళ వారిలో ఎవరైనా అధికారికంగా టీడీపీలో చేరితే.. వైసీపీకి రాజీనామా చేయాల్సి వస్తుంది.. లేదా అలాంటి ఆధారల వైసీపీకి దొరికితే వారి పై అనర్హత వేటు వేయొచ్చు.. అప్పుడు మాత్రం ఉప ఎన్నిక తప్పని సరి.. అయితే వారు అధిష్టానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ప్రస్తుతానికి ఏ పార్టీ కండువ కప్పుకునే అవకాశం ఉండదు అంటున్నరు. ఎంపీ రఘురామ లా రెబల్ ఎమ్మెల్యేగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి.

ఇదీ చదవండి : క్రాస్ ఓటింగ్ అనుమానంతో ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయొచ్చా..? ఆ నలుగురి భవిష్యత్తు కార్యచరణ ఏంటి..?

అయితే ఎన్నికల ముందు మాత్రం.. టీడీపీలో జాయిన్ అవుతారని.. ఇప్పటికే అందులో ఆనం రామనారాయణ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిలకు టికెట్ హమీ కూడా వచ్చినట్టు సమాచారం. వారి సొంత నియోజకవర్గాల్లోనే మళ్లీ టీడీపీ తరపున పోటీ చేసే అవకాశం ఉంది. అలాగే

మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి కూడా సీటుపై భరోసా లభించినట్టు టాక్.. అయితే ఎక్కడ అన్నది ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది అంటున్నారు. మరో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి మాత్రం ఎలాంటి హామీ ఇవ్వలేదని.. పార్టీలో మాత్రం సమున్నత స్థానం ఇస్తామని మాత్రమే చెప్పినట్టు

ప్రచారం జరుగుతోంది. శ్రీదేవి టీడీపీలో జాయిన్ అయినా టిక్కెట్ ఇస్తారన్న గ్యారెంటీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు.

First published:

Tags: Anam Ramanarayana Reddy, Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, AP Politics, Kotamreddy sridhar reddy

ఉత్తమ కథలు