WILL CM JAGAN FALLOW TELANGANA CM KCR WHAT IS THE AP CM PLAN WHERE IS THE 2024 ELECTIONS NGS
CM Jagan: తెలంగాణ సీఎం కేసీఆర్ ను జగన్ ఫాలో అవుతున్నారా..? మంత్రులకు అందుకే క్లాస్ పీకారా..?
వైఎస్ జగన్, కేసీఆర్ (ఫైల్ ఫోటో)
CM Jagan: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. తెలంగాణ సీఎం జగన్ ఫార్ములాను ఫాలో అవుతున్నారా..? ఇటీవల ఆయన వ్యాఖ్యలు చూస్తే అలాంటి అభిప్రాయమే వ్యక్తమవుతోంది.. తాజాగా కేబినెట్ భేటీలోనూ మంత్రులకు అదే సూచన చేయడం వెనుక ఉద్దేశం అదేనా..? ఇంతకీ జగన్ ఏం చేయాలి అనుకుంటున్నారాంటే..?
CM Jagan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. ఈ ఎన్నికలకు ఇంకా రెండుళ్లు సమయం ఉంది.. అయినా ఇప్పటికే ఎలక్షన్ మూడులోనే ఉన్నాయి అన్ని పార్టీలు.. అధికార వైసీపీ (YCP) సైతం గడప గడపకు ప్రభుత్వం (Gadapa Gadapaku Government) పేరుతో.. జనంలోనే ఉంటోంది. ఈ కార్యక్రమం చేపట్టడం వెనుక జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా..? అవుననే అంటున్నారు ఆయన సన్నిహితులు. ఎందుకంటే సీఎం జగన్ (CM Jagan) నోట ఈ మధ్య కాలంలో ఎన్నికల మాటే వినిపిస్తోంది. ఒకవేళ ముందస్తు ఉన్నా లేకున్నా..? పార్టీ నేతలు జనంలోకి వెళ్లాలని వైసీపీ అధినేత, సీఎం జగన్ ఆదేశించడం వెనుక వ్యూహం ఏంటనేది వైసీపీ కీలక నేతలకు కూడా అర్థం కావడం లేదు. ప్రజల్లో ఉండటం పైనే సీఎం జగన్ ఎందుకు ఫోకస్ పెడుతున్నారు. గురువారం జరిగిన కేబినెట్ సమావేశం (Cabinet Metting)లో కూడా జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులకు సీఎం జగన్ డైరెక్షన్ ఇవ్వడం వెనుక వ్యూహం అదేనా అనే చర్చ ఇప్పుడు మొదలైంది. మంత్రులకు రెండు రోజులే శాఖాపరమైన డ్యూటీ అప్పగించారు.
తాజాగా జరిగిని కేబినెట్ భేటీలో మంత్రులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు సీఎం.. సోమ, మంగళవారాల్లో సెక్రటేరియట్లో వుండాలని మంత్రులకు క్లాస్ పీకినట్టు సమాచారం. మిగిలిన 5 రోజులు జనంతోనే ఉండాలని మంత్రులకు జగన్ ఆదేశాల వెనుక త్వరలో ఎన్నికలు రాబోతున్నాయనే సంకేతాలు అందుతున్నాయి. సీఎం వ్యూహాలు చూస్తే.. 2023 ఎలక్షన్ ఇయర్ కానుందా? అనే సంకేతాలు అందుతున్నాయి.
ఈ విషయంలో జగన్.. తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఫాలో అవుతున్నారా..? కేసీఆర్ 2018లో చేసిన పని.. ఇప్పుడు జగన్ చేయబోతున్నారా..? అంటే 2023లోనే ముందస్తుకి వెళ్ళి మరోసారి సీఎం పీఠం ఖాయం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా..? 2022 నుంచే రాబోయే ఎన్నికలకు జగన్ ప్లాన్ చేస్తున్నట్టు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి కూడా గతంలో కొట్టినట్టుగానే టీ20 మ్యాచ్ స్కోర్ చేయాలని భావిస్తున్నారు. అంటే 150 కి తగ్గకుండా సీట్లు సాధించడమే ఆయన లక్ష్యంగా చేసుకున్నారంటున్నారు. సింహం సింగిల్ గానే వస్తుందని చెబుతున్న వైసీపీ నేతలు పక్కా ప్లాన్ తో మళ్ళీ అధికారం కైవసం చేసుకోవాలని భావిస్తున్నారు.
2019లో ఫ్యాన్ గాలి స్పీడ్ కు.. ప్రతిపక్షాలన్నీ చల్లాచెదురయ్యాయి. ఎవరూ ఊహించని విధంగా 151 సీట్లతో తిరుగులేని ఆధిపత్యంతో సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ మూడేళ్ల కాలంలో సీఎం జగన్ ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, అమ్మ ఒడి, జగనన్న తోడు, జగనన్న చేదోడు, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ బీమా, మనబడి నాడు-నేడు, ఆరోగ్యశ్రీ, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యాకానుక, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ వాహన మిత్ర వంటి పథకాలతో పాటు పేదలందరికీ ఇళ్ల పథకాన్ని జగన్ ప్రభుత్వం అమలు చేస్తోంది. జనంలో తనకున్న క్రేజ్ ని ముందస్తు ఎన్నికల ద్వారా మరింత పెంచుకోవాలని సీఎం భావిస్తున్నారు.
ఇప్పటికే ఏపీలో జిల్లాల విభజన కూడా పూర్తయింది. మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు అసెంబ్లీ సాక్షిగా జగన్ ప్రభుత్వం ప్రకటించింది. విశాఖ కేంద్రంగా ఏపీ రాజధానిని ఏర్పాటు చేసేందుకు సీఎం జగన్ సన్నాహాలు చేస్తున్నారు. కొత్త జిల్లాల్లో పార్టీ పటిష్టత, ఎన్నికలకు సిద్ధం చేయడం కోసం సీనియర్లకు అప్పగించారు. మాజీ మంత్రులకు ఈ గురుతర బాధ్యత అప్పగించారు కూడా. విపక్షం అంత స్ట్రాంగ్ గా లేకపోవడంతో ముందుగానే జనంలోకి వెళ్లాలని.. ప్రభుత్వ వ్యతిరేకత పెరగకుండా చూడాలి అని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. మిషన్ 2023 పేరుతో ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం వుంది. 2019లో వచ్చిన మెజారిటీ ఏమాత్రం తగ్గకుండా.. 2023లో ఓట్లు రాబట్టాలని జగన్ ఆలోచనగా చెబుతున్నారు. విశాఖ విషయంలో జగన్ కి ఒక విజన్ వుందని ఇటీవల సినిమా వారితో చర్చలు జరిపినప్పుడు కూడా ప్రముఖంగా విశాఖను ప్రస్తావించారు. 2024 వరకు ఎన్నికలకు సమయం ఉన్నా.. ముందస్తు ఎన్నికల దిశగానే జగన్ ఆలోచన వుంది అన్నది సీఎం సన్నిహిత వర్గాల సమాచారం. ఇప్పటికే జనాకర్షక పథకాలతో మేనిఫెస్టో తయారుచేసే పనిలో వున్నారని తెలుస్తోంది. సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళితే మిగతా పార్టీలకు కూడా కంటిమీద కునుకు వుండదంటున్నారు. రాబోయే రోజుల్లో ఏపీలో ఎన్నికల హీట్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. జగన్ ఇప్పటికే గడపగడపకు వైసీపీ కార్యక్రమం ద్వారా వైసీపీ నేతల్ని క్షేత్రస్థాయికి పంపి జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.