నిమ్మగడ్డ కేసులో సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎలక్షన్ కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌ను కొనసాగించాలని హైకోర్టు వెలువరించిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

news18-telugu
Updated: May 29, 2020, 3:59 PM IST
నిమ్మగడ్డ కేసులో సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం
నిమ్మగడ్డ రమేశ్ కుమార్ (ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీ ఎలక్షన్ కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌ను కొనసాగించాలని హైకోర్టు వెలువరించిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వెల్లడించారు. ఒక్కో స‌మ‌యంలో కోర్టుల్లో న్యాయం జ‌ర‌గ‌క‌పోవ‌చ్చని... అలాంట‌ప్పుడు పై కోర్టుకు వెళ్లే అవ‌కాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. నిమ్మగడ్డ కేసుకు సంబంధించి న్యాయ‌నిపుణుల‌తో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. మరోసారి నిమ్మగడ్డ వ్యవహారశైలిపై అంబటి రాంబాబు మండిపడ్డారు. మద్యం, డబ్బు పంపిణీని వ్యతిరేకిస్తూ నిమ్మగడ్డ లేఖ రాయడం సమంజసమా అని ఆయన ప్రశ్నించారు. ఇటువంటి లేఖల వల్ల ప్రజాస్వామ్యం మంట కలిసిపోతుంద‌ని వ్యాఖ్యానించారు.

పక్షపాతంగా వ్యవహరిస్తున్న నిమ్మగడ్డ రమేశ్‌ను తొలగిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగ‌బ‌ద్ధంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చామ‌ని... కోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తే గౌరవిస్తామని అంబటి రాంబాబు అన్నారు. కోర్టు ఇచ్చిన తీర్పును ప‌రిశీలించి అభ్యంతరాలు ఉంటే పై కోర్టుకు అప్పీలు చేసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ అధికారాలు ఏమిటో ప్రభుత్వానికి తెలుసని అంబటి రాంబాబు తెలిపారు. ప్రభుత్వానికి పరిమిత అధికారాలు ఎలా ఉంటాయో మిగతా వ్యవస్థలకు పరిమితికి లోబడి అధికారాలు ఉంటాయ‌ని ఆయన వ్యాఖ్యానించారు. రాజ్యాంగానికి లోబ‌డే అన్ని వ్యవస్థలు పని చేయాల‌ని అంబ‌టి అభిప్రాయపడ్డారు.

First published: May 29, 2020, 3:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading