WILL CENTRAL GOVERNMENT ACCEPTS CM JAGAN DECISION ON THIS IMPORTANT ISSUE FULL DETAILS HERE PRN
AP Government: ఆ విషయంలో జగన్ సర్కార్ కు షాక్ తప్పదా..? కేంద్రం నిర్ణయం ఇదేనా..?
వైఎస్ జగన్ (ఫైల్)
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) తీవ్ర ఆర్ధిక కష్టాల్లో ఉంది. గత కొన్నాళ్లుగా ఏపీ ప్రభుత్వం (AP Government) చెబుతున్న మాటలివే. ఐతే ఇటీవల ఏపీ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై ప్రశ్నల వర్షం కురుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) తీవ్ర ఆర్ధిక కష్టాల్లో ఉంది. గత కొన్నాళ్లుగా ఏపీ ప్రభుత్వం (AP Government) చెబుతున్న మాటలివే. ముఖ్యంగా ఉద్యోగుల పీఆర్సీ వివాదంలో ప్రభుత్వం చెబుతున్నది ఇదే. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఉద్యోగులు సహకరించాలని కోరుతోంది. అంతేకాదు వచ్చే ఆదాయమంతా ఉద్యోగులకే కేటాయితే మిగతా రంగాల పరిస్థితేంటనే ప్రశ్నలు కూడా వేస్తోంది. అలాగే కొన్ని పథకాలు, ఇతర పనుల విషయంలోనూ సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యే ఆర్ధిక పరిస్థితినే ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ (AP CM YS Jagan) తీసుకున్న ఓ నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. ఇటీవల రాష్ట్రంలో పోర్టులు, ఎయిర్ పోర్టులు, ఫిషింగ్ హార్బర్లపై సమీక్ష నిర్వహించిన సందర్భంగా జిల్లాకో ఎయిర్ పోర్టు నిర్మించాలని నిర్ణయించారు. కేబినెట్ సమావేశంలోనూ ఈ నిర్ణయాన్ని ఆమోదించారు. ఇప్పుడిదే తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ఓవైపు రాష్ట్రం ఆర్ధిక కష్టాల్లో ఉందంటూ నిధులు, అప్పుల కోసం ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎక్కువశాతం ఢిల్లీలోనే ఉంటున్నారు. ఈ సమయంలో జిల్లాకో ఎయిర్ పోర్ట్ నిర్మించడం అవసరమా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అంతేకాదు రోడ్లకు డబ్బుల్లేవుగానీ ఎయిర్ పోర్టులు నిర్మిస్తారా అనే మాటలకు కూడా వినిపిస్తున్నాయి. అంతేకాదు ఎయిర్ పోర్టుల వల్ల పేద, మధ్యతరగతికి చెందిన ప్రజలకు ప్రయోజనం ఏంటనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు ప్రధాన విమానాశ్రయాలున్నాయి. వాటిలో విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, కర్నూలు, కడప, రాజమండ్రిలో ఎయిర్ పోర్టులున్నాయి. అన్ని విమానాశ్రయాలు నష్టాల్లోనే ఉన్నాయి. ఏపీలో ఎక్కువ ట్రాఫిక్ ఉన్న ఎయిర్ పోర్టు తిరుపతి. అలాంటి విమానాశ్రయమే ఏడాదికి రూ.35 కోట్ల నష్టంలో నడుస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం తిరుపతి ఎయిర్ పోర్టును ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే కర్నూలు, కడప వంటి ఎయిర్ పోర్టులకు రాకపోకలు సాగించేందుకు విమానాయన సంస్థలకు ఏపీ ప్రభుత్వం ఏడాదికి కొంతమొత్తం చెల్లిస్తోంది. గతంలో ట్రూ జెట్ కి ఆ కాంట్రాక్ట్ ఉండగా.. ఇప్పుడు ఇండిగో చేతికి వెళ్లింది.
ఇదిలా ఉంటే జిల్లాకో ఎయిర్ పోర్టు అంటూ రాష్ట్రం తీసుకున్న నిర్ణయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. గతంలో తెలంగాణ ప్రభుత్వం ఆరు కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణానికి అనుమతి కోరగా.. కేంద్రం కేవలం మూడింటికి మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. ఇప్పటికే ఏపీలో ఆరు ఎయిర్ పోర్టులుండగా.. భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మించాల్సి ఉంది. అలాంటిది మరో ఆరు ఎయిర్ పోర్టులకు అనుమతులివ్వడం కష్టమే. మరి ఈ విషయంలో సీఎం జగన్ ఎలా ముందుకెళ్తారో వేచి చూడాలి.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.