HOME »NEWS »ANDHRA PRADESH »will bjp accept to give tirupati seat to janasena and fulfill pawan kalyan hopes ak

Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను బీజేపీ ఖుషి చేస్తుందా ? అందుకు ఒప్పుకుంటుందా ?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను బీజేపీ ఖుషి చేస్తుందా ? అందుకు ఒప్పుకుంటుందా ?
పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫోటో)

Tirupati By Election: బీజేపీ, జనసేన పొత్తు బలంగా ఉండాలంటే... తమ పార్టీకి కూడా బీజేపీ ప్రాధాన్యత ఇవ్వాలని జనసేన కోరుతున్నట్టు తెలుస్తోంది.

  • Share this:
    జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీకి మద్దతిచ్చేందుకు కమిటైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్... ప్రస్తుతం ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరుపుతున్నారు. ఈ రోజు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో చర్చలు జరిపిన పవన్ కళ్యాణ్.. రేపు కూడా పలువురు ఇతర బీజేపీ నేతలతో సమావేశం కానున్నారని తెలుస్తోంది. తిరుపతి లోక్‌సభ స్థానాన్ని తమకు కేటాయించాలని బీజేపీ అగ్రనాయకులను అడిగేందుకే ఢిల్లీకి పవన్‌ వచ్చారని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేయాలని ఆ పార్టీ నేతలు పవన్ కళ్యాణ్‌ను కోరారు.

    అయితే బీజేపీ కోసం జీహెచ్ఎంసీలో పోటీ నుంచి వెనక్కి తగ్గిన పవన్ కళ్యాణ్.. ఏపీలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో బరిలోకి దిగాలని భావిస్తున్నారు. పొత్తుల్లో భాగంగా ఈ సీటును జనసేనకు కేటాయించాలని ఆయన బీజేపీ ముందుకు ప్రతిపాదన పెట్టినట్టు సమాచారం. ఇందుకు బీజేపీ ఓకే చెబితే.. జీహెచ్ఎంసీలో ఆ పార్టీ తరపున ప్రచారం చేయడానికి సిద్ధమని పవన్ కళ్యాణ్ కమలనాథులకు చెప్పినట్టు సమాచారం.



    అయితే ఢిల్లీ వస్తే అన్ని అంశాలు చర్చించుకుందామని పార్టీ నాయకత్వం చెప్పిందని తెలుస్తోంది. దీంతో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఢిల్లీకి వెళ్లారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీజేపీ, జనసేన పొత్తు బలంగా ఉండాలంటే... తమ పార్టీకి కూడా బీజేపీ ప్రాధాన్యత ఇవ్వాలని జనసేన కోరుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోని తిరుపతి సీటు తమకు కేటాయించాలని అడుగుతున్నట్టు సమాచారం. అయితే తిరుపతి సీటు విషయంలో బీజేపీ నాయకత్వం ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో బీజేపీనే పోటీ చేస్తుందని ఆ పార్టీ సీనియర్‌ నేత జీవీఎల్‌ నరసింహారావు స్పష్టం చేశారు.

    తిరుపతిలో గతంలో తాము గెలిచామని.. అందుకే అక్కడ తామే పోటీ చేస్తామని అన్నారు. దీంతో వచ్చే ఏడాది జరగబోయే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల సీటు కోసం బీజేపీ, జనసేన మధ్య అప్పుడే చర్చ మొదలయ్యాయనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు తిరుపతి లోక్ సభ స్థానం నుంచి గురుమూర్తికి అవకాశం కల్పించాలని వైసీపీ భావిస్తుండగా.. కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మీని టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపాలని చంద్రబాబు సూత్రప్రాయం నిర్ణయం తీసుకున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:November 24, 2020, 20:33 IST