హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

KCR-YS Jagan: కేసీఆర్ ప్లాన్‌కు ఏపీ సీఎం జగన్ మద్దతు ఉంటుందా ?.. దూరంగానే ఉంటారా ?

KCR-YS Jagan: కేసీఆర్ ప్లాన్‌కు ఏపీ సీఎం జగన్ మద్దతు ఉంటుందా ?.. దూరంగానే ఉంటారా ?

YS Jagan-KCR: ఈ విషయంలో సీఎం జగన్ ఆలోచన, విధానం తెలుసుకాబట్టే సీఎం కేసీఆర్.. ఈ అంశంపై ఏపీ ముఖ్యమంత్రితో చర్చలు జరపడం లేదనే వాదన కూడా కొంతకాలంగా వినిపిస్తోంది.

YS Jagan-KCR: ఈ విషయంలో సీఎం జగన్ ఆలోచన, విధానం తెలుసుకాబట్టే సీఎం కేసీఆర్.. ఈ అంశంపై ఏపీ ముఖ్యమంత్రితో చర్చలు జరపడం లేదనే వాదన కూడా కొంతకాలంగా వినిపిస్తోంది.

YS Jagan-KCR: ఈ విషయంలో సీఎం జగన్ ఆలోచన, విధానం తెలుసుకాబట్టే సీఎం కేసీఆర్.. ఈ అంశంపై ఏపీ ముఖ్యమంత్రితో చర్చలు జరపడం లేదనే వాదన కూడా కొంతకాలంగా వినిపిస్తోంది.

  తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. కేసీఆర్‌కు చెక్ పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంటే... బీజేపీకి జాతీయస్థాయిలో ఇబ్బందులు తెచ్చిపెట్టాలని కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నాయి. ఇందుకోసం ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలతో సమావేశమవుతున్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ విజయం సాధిస్తే.. ఈ విషయంలో సీఎం కేసీఆర్ మరింత దూకుడు ప్రదర్శిస్తారనే చర్చ కూడా రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. అయితే పలు రాష్ట్రాల్లో బలంగా ఉన్న నేతలతో చర్చలు జరుపుతూ బీజేపీకి వ్యతిరేకంగా వారిని కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్న సీఎం కేసీఆర్.. తన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో ఈ మేరకు చర్చలు జరుపుతారా ? అన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ అనేకసార్లు కలుసుకున్నారు. పలు అంశాలపై చర్చించుకుంటున్నారు.

  పలు అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నట్టు కనిపించినా.. అవేవీ కేసీఆర్, జగన్ మధ్య ఉన్న సంబంధాలపై ప్రభావం చూపిన దాఖలాలు లేవనే చెప్పాలి. అయితే తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీకి మధ్య ఉన్నంత వైరం.. ఏపీలో వైసీపీ, బీజేపీకి మధ్య లేదు. ఇందుకు కారణం ఏపీలో బీజేపీ అంత బలంగా లేకపోవడమో. తెలంగాణలో తన సత్తా చాటుతున్న బీజేపీ.. ఏపీలో మాత్రం అంతగా ప్రభావం చూపడం లేదు. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీని ఓవర్‌టేక్ చేసి మరీ రాజకీయాల్లో ముందుకు సాగిన బీజేపీ.. ఏపీలో మాత్రం అక్కడి ప్రతిపక్ష పార్టీ టీడీపీని అధిగమించి ముందుకు సాగడంలో సక్సెస్ కావడం లేదు.

  ఈ కారణంగా ఏపీలోని అధికార వైసీపీ, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్.. రాజకీయంగా బీజేపీని పెద్దగా పట్టించుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఇక బీజేపీకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో పోరాడాలని పట్టుదలగా ఉన్న కేసీఆర్‌కు.. ఈ విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఏ మేరకు సహకారం అందిస్తారని ఎవరికీ అర్థంకావడం లేదు. కేంద్రంతో సఖ్యతగా ఉంటూ రాష్ట్రానికి కావాల్సిన నిధులు, ఇతర ప్రయోజనాలు పొందాలని వైసీపీ భావిస్తోంది. ఇప్పటికిప్పుడు కేంద్రంలోని బీజేపీతో తీవ్రంగా విభేదించాల్సిన అవసరం వైసీపీకి పెద్దగా లేదని.. అందుకే ఆయన ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి ముందుకు నడవడం అంత ఈజీగా జరిగే పనికాదనే చర్చ కూడా సాగుతోంది.

  KCR-Congress: కేసీఆర్ కొత్త ప్రయత్నాలు.. కాంగ్రెస్‌లో మొదలైన టెన్షన్.. అదే జరిగితే..?

  YS Jagan Chiranjeevi: ఎవరేమన్నా ఆ విషయంలో చిరంజీవికే ప్రాధాన్యత.. సీఎం జగన్ మరోసారి క్లారిటీ ఇచ్చేశారా ?

  ఈ విషయంలో సీఎం జగన్ ఆలోచన, విధానం తెలుసుకాబట్టే సీఎం కేసీఆర్.. ఈ అంశంపై ఏపీ ముఖ్యమంత్రితో చర్చలు జరపడం లేదనే వాదన కూడా కొంతకాలంగా వినిపిస్తోంది. అయితే కేసీఆర్ తరహాలోనే జాతీయస్థాయిలో వైసీపీకి అత్యంత ప్రాధాన్యత ఉండేలా చూసుకోవాలని భావిస్తున్న వైఎస్.. ఇందుకు అనుకూలమైన సమయం కోసం ఎదురుచూస్తున్నారనే వాదన కూడా ఉంది. మొత్తానికి బీజేపీకి కౌంటర్ ఇచ్చేందుకు తనదైన వ్యూహాలతో ముందుకు సాగుతున్న సీఎం కేసీఆర్‌కు ఏపీ సీఎం వైఎస్ ఏ మేరకు సహకారం అందిస్తారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.

  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, CM KCR, Telangana

  ఉత్తమ కథలు