WILD ANIMALS ATTACKING ON VILLAGES FOR WATER AS NO SUFFICIENT RESOURCES IN FOREST AREAS VIZIANAGARAM DISTRICT ANDHRA PRADESH FULL DETAILS HERE PRN VZM
AP News: వేసవి వస్తే చాలు ఆ ప్రాంతమంతా గజగజా వణుకుద్ది.. కంటిమీద కునుకుండదు.. కారణం ఇదే..!
ప్రతీకాత్మకచిత్రం
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎండలు (Summer) మండిపోతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతు పెరిగిపోవడంతో అడవి జంతువులు అటవీ శివారు గ్రామాలపై పడుతున్నాయి. విజయనగరం (Vizianagaram), పార్వతీపురం మన్యం జిల్లా తీవ్ర ఉష్ణోత్రలకు ఎండుతున్న సెలయేర్లు, గెడ్డలుతాగునీటి కోసం మైదాన ప్రాంతాల వైపు వస్తున్న వైనంవేటగాళ్ల ఉచ్చులో పడి మృత్యువాత పడుతున్నాయి.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎండలు (Summer) మండిపోతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతు పెరిగిపోవడంతో అడవి జంతువులు అటవీ శివారు గ్రామాలపై పడుతున్నాయి. విజయనగరం (Vizianagaram), పార్వతీపురం మన్యం జిల్లా తీవ్ర ఉష్ణోత్రలకు ఎండుతున్న సెలయేర్లు, గెడ్డలుతాగునీటి కోసం మైదాన ప్రాంతాల వైపు వస్తున్న వైనంవేటగాళ్ల ఉచ్చులో పడి మృత్యువాత పడుతున్నాయి. ఏటా వేసవిలో ఇదే పరిస్థితి. నీటి నిల్వలు పెంచేందుకు తగిన ఏర్పాట్లు చేసేలా చర్యలు తీసుకోవడంలో అధికారులు చొరవచూపడం లేదు. పార్వతీపురం మన్యం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో వన్య ప్రాణులు వేసవి తాపానికి విలవిల్లాడుతున్నాయి. తాగునీటి కోసం మైదాన ప్రాంతాల వైపు వస్తున్నాయి. ఇదే సమయంలో కొన్ని కంచెల వంటి ఉచ్చులో పడుతుంటే.. మరికొన్ని వేటగాళ్ల ఉచ్చులకు బలుతున్నాయి. తాజాగా కొమరాడ మండల కేంద్రంలోని పవర్ ప్లాంట్ కు ఆనుకొని ఉన్న పొలాల్లోకి కొండల పై నుండి వచ్చిన జింక కంచె ఉచ్చులో పడి మ్ళతి చెందింది.
ఇక రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత అధికంగానే ఉండనున్న నేపధ్యంలో.. అటవీ ప్రాంతంలో నీటి ఎద్దడి తీవ్రంగానే ఉండే అవకాశం ఉందని.. వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో మరిన్ని వన్యప్రాణులు మైదాన ప్రాంతాల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది జనవరి తర్వాత జిల్లాలో ఏ ప్రాంతంలోనూ ఓ మోస్తరు వర్షాలు కురవలేదు. ఇక మండువేసవిలో ప్రస్తుతం 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్ర ఎండలకు ఏజెన్సీలోని గెడ్డలు, వాగులు, సెలయేర్లలో ఉన్న కొద్దోగొప్పో ఉన్న నీరు కూడా అడుగంటుతోంది. దీంతో అటవీ ప్రాంతంలో ఉంటే వన్యప్రాణులకు తాగునీటి కష్టాలు తీవ్రమయ్యాయి.
దాహార్తి తీసుకోవడానికి మైదాన ప్రాంతాలవైపు వస్తున్నాయి. రాత్రి 7 గంటల నుంచి తెల్లవారు ఐదు గంటల వరకు మైదాన ప్రాంతాల్లోని చెరువుల, కొనేరులు, ఇతర తాగునీటి వనరులను వెతుక్కొని వచ్చి తాగునీటి అవసరాలు తీర్చుకుంటున్నాయి. తాజాగా పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలోని అంబేద్కర్ గురుకుల పాఠశాల పక్కన పవర్ ప్లాంట్ కు సంబంధించిన పొలాలకు వేసిన ముళ్ల కంచెలో ఓ జింక చిక్కకుంది. తాగునీటి కోసం సమీపంలోని కొండల నుండి వచ్చిన జింక ముళ్లకంచెలో చిక్కుకొని బయటకు రాలేక ఊపిరాడక మృతి చెందింది.
జిల్లాలోని పాలకొండ, వీరఘట్టంతో పాటు కురుపాం, జియ్యమ్మవలస, గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, పార్వతీపురం, సాలూరు ఏజెన్సీ ప్రాంతాల్లోని వన్య ప్రాణులు మైదాన ప్రాంతాల వైపు వచ్చి ప్రమాదాల బారిన పడుతున్నాయి. వాటిల్లో ప్రధానంగా జింకలు, దుప్పులు, అడవి కోళ్లు, కుందేళ్లు, అడవిపందులు వంటివి ఉన్నాయి. అటవీ శాఖాధికారులు ఏర్పాటు చేసిన తాగునీటి కుంటల వైపు వన్య ప్రాణులు వెళ్లి దాహార్తిని తీర్చుకొనే సందర్భాలు చాలా తక్కువ. పాలకొండ రేంజ్ పరిధిలో కేవలం 15 ప్రాంతాల్లో మాత్రమే తాగునీటి కుంటలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు సగం వాటికి మాత్రమే తాగునీటిని నింపారు. వాటి ద్వారా వన్యప్రాణులకు తాగునీటి అవసరాలు అందడం లేదు. గతంలో ఏనుగులు మైదాన ప్రాంతాల వైపు రాకుండా ఉండేందుకు వీలుగా పాలకొండ, వీరఘట్టం, సీతంపేట మండలాల పరిధిలో చిన్నపాటి చెరువులను తవ్వారు. ప్రస్తుతం అవి పూడికలతో నిండుపోయి వృథాగా పడి వున్నాయి.
ఏనుగుల గుంపు భీబత్సం
విజయనగరం జిల్లాలోని పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల్లో వేసవి వచ్చిందంటే ఏనుగుల గుపంపు అలజడి అంతా ఇంతా కాదు. వేసవిలో తాగునీటి అవసరాల కోసం ఏనుగుల గుంపులు గ్రామాలలోని చెరువులు, పొలాల వైపు దూసుకొస్తున్నాయి. ఇదే సమయంలో గ్రామాల్లోని ఇళ్లు, పొలాలను ధ్వంసం చేస్తుంటాయిగత కొన్నేళ్లుగా పార్వతీపురం ఏజెన్సీలో ఇదే తంతు. ఈ దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోగా, కొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. వేలాది ఎకరాల పంట నాశనం అయింది. ఈ ఏడాదిలో ఇప్పటికే భామిని మండలంలోకి చొరబడిన ఏనుగుల గుంపు ఆ ప్రాంతంలో పంటలను నాశనం చేశాయి. అక్కడి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి.
అధికారుల చర్యలు విఫలంఇలా కొన్నేళ్లుగా ఇబ్బందులు పెడుతున్న ఏనుగుల గుంపును ఒడిసా అటవీ ప్రాంతంలోకి తరలించేందుకు అటవీ శాఖ అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా.. అవి విఫలమయ్యాయి. ఏజెన్సీలోకి తరలించి, గ్రామాల్లోకి రాకుండా ఉండేందుకు ఎలిఫేంట్ జోన్ ఏర్పాటు చేసామని అధికారులు తెలిపారు. కానీ ఎన్ని చేసినా.. ఏనుగుల గుంపు ను మాత్రం ఎవరూ ఆపలేక పోయారు. ఇలా మొత్తం ఎనిమిది ఏనుగుల గుంపు ఒడిసా నుండి రాగా ప్రస్తుతం 5 ఏనుగులు మాత్రమే మిగిలాయి. మూడు ఏనుగులు కరెంట్ షాక్ తోనూ, అనారోగ్యం కారణంగా మ్ళతి చెందాయి. పార్వతీపురం ఏజెన్సీలోని వన్య ప్రాణుల తాగునీటి కష్టాలను తీర్చేందుకు చర్యలు చేపడుతున్నామని, అయితే ఏజెన్సీ ప్రాంతంలో సెలయేర్లు, గెడ్డలు అడుగంటిపోయాయని అటవీ అధికారులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.