హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kadapa Woman: భర్తతో గొడవపడి విడిపోయింది.. అతడు రెండో పెళ్లి చేసుకోవడంతో ఒళ్లుమండి ఏం చేసిందో చూడండి..!

Kadapa Woman: భర్తతో గొడవపడి విడిపోయింది.. అతడు రెండో పెళ్లి చేసుకోవడంతో ఒళ్లుమండి ఏం చేసిందో చూడండి..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆప్యాయతకు అనురాగానికి అద్దంపట్టేలా భార్య భర్తలు ఉండాలని పెద్దలు అంటారు. కాపురంలో ఎలాంటి కలహాలు వచ్చినా ఇద్దరూ కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలని చెప్తారు. ఒక్కోసారి కొన్ని అనుమానాలు భార్యభర్తల దాంపత్య జీవితాన్ని తారుమారు చేస్తుంటాయి.

ఇంకా చదవండి ...

GT Hemanth Kumar, News18, Tirupati

ఆప్యాయతకు అనురాగానికి అద్దంపట్టేలా భార్య భర్తలు ఉండాలని పెద్దలు అంటారు. కాపురంలో ఎలాంటి కలహాలు వచ్చినా ఇద్దరూ కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలని చెప్తారు. ఒక్కోసారి కొన్ని అనుమానాలు భార్యభర్తల దాంపత్య జీవితాన్ని తారుమారు చేస్తుంటాయి. భార్యపై భర్తకు ఉన్న అనుమానం.., భర్తపై భార్యకు మదిలో మొదలైన అనుమానాలతో జీవితాలను నాశనం చేస్తున్నాయి. భార్య వేరొక వ్యక్తితో వివాహేతర సంభంధం పెట్టుకుందన్న అనుమానంతో దూరం పెట్టాడు ఓ భర్త. భార్యను విడిచి వేరొక ఇంట్లో నివాసం ఉంటున్నాడు. తన తోడుకు మరో మహిళా కావాలని అనుకున్నాడేమో గానీ రెండో పెళ్లి చేసుకున్నాడు. భర్త రెండవ వివాహం చేసుకున్నాడని తెలుసుకున్న మొదటి భార్య చేసిన పనికి జనం పరుగులు పెట్టాల్సి వచ్చింది. అంతేకాదు పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది.

వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కడప జిల్లా (Kadapa District) రైల్వే కోడూరులో నివాసం ఉంటున్న స్వామి నాయక్ కు కొన్నేళ్ల క్రిందట లక్ష్మీ బాయి తో వివాహం జరిగింది. వీరికి బాబు, ఇద్దరు కుమార్తెలున్నారు. సాఫీగా సంసారం సాగుతున్న తరుణంలో భార్యపై అనుమానం పెంచుకున్నాడు స్వామి నాయక్. భార్య వేరొకరితో అక్రమ సంబంధం నడిపిస్తుందని ఆరోపించేవాడు. అదే విషయంపై ఇద్దరిమధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి. అప్పుడప్పూడూ వీళ్ల పంచాయతీ పోలీస్ స్టేషన్ కు వెళ్తుండేది. ఇదంతా అక్కడున్నవారికి సర్వసాధారణే. ఇద్దరి మధ్యా కీచులాటలు పెరిగిపోవడం, ఒకరంటే ఒకరికి అస్సలు పడకపోవడంతో ఇద్దరూ విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారు. పిల్లలు తండ్రి వద్దే ఉండేవారు.

ఇది చదవండి: కూతుర్ని పెళ్లి చేసుకున్నాడని కక్షగట్టిన అత్త.. పరువు కోసం దారుణం..


ఈ క్రమంలో పిల్లలతో ఒంటరిగా ఉంటున్న స్వామినాయక్ రెండో పెళ్లి చేసుకోవాలని భావించాడు. అతడ్ని పెళ్లి చేసుకోవడానికి ఓ మహిళ ఒప్పుకోవడంతో ఆమె మెడలో తాళికట్టాడు. అంతేకాకుండా గుట్టుచప్పుడు కాకుండా కాపురం పెట్టాడు. ఐతే ఈ విషయం తెలుసుకున్న మొదటి భార్య లక్ష్మీబాయి కోపంతో ఊగిపోయింది. నేరుగా భర్త ఉంటున్న ఇంటికి వెళ్లింది. అక్కడ రెండో భార్యతో కలిసి నిద్రిస్తున్న భర్తను చూసి కోపం నషాళానికెక్కింది.

గురువారం రాత్రి నిద్రిస్తున్న భర్త స్వామినాయక్ తో పాటు అతడి రెండో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. తండ్రి పక్కనే పడుకున్న బాలుడికి కూడా గాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో ముగ్గురిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భర్తపై ప్రేమ ఉంటే కాసేపు మాట్లాడుకొని కాంప్రమైజ్ అవ్వాలిగానీ.. అతడు రెండో పెళ్లి చేసుకునేవరకు ఊరుకొని.. ఇప్పుడు హత్యాయత్నం చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Extramarital affairs, Kadapa

ఉత్తమ కథలు