Home /News /andhra-pradesh /

WIFE KILLED HUSBAND WITH THE HELP OF LOVER IN GUNTUR DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

Affair: భర్త భోజనంలో నిద్రమాత్రలు కలిపి ప్రియుడికి ఫోన్.., ఆ తర్వాత ఇద్దరూ కలిసి..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Extramarital affair: వాళ్లిద్దరిదీ ప్రేమ వివాహం. ఎనిమిదేళ్ల బంధానికి ఇద్దరు పిల్లలు పుట్టారు. కానీ బంధానికి విలువ ఇవ్వాల్సిన భార్య.. మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఓరోజు భర్త భోజనంలో నిద్రమాత్రలు కలిపి ప్రియుడికి చేసింది.

ఇంకా చదవండి ...
    వాళ్లిద్దరిదీ ప్రేమ వివాహం. ఎనిమిదేళ్ల బంధానికి ఇద్దరు పిల్లలు పుట్టారు. కానీ బంధానికి విలువ ఇవ్వాల్సిన భార్య.. మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఓరోజు భర్త భోజనంలో నిద్రమాత్రలు కలిపి ప్రియుడికి చేసింది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని గుంటూరు జిల్లా (Guntur District) పొన్నూరు పట్టణానికి చెందిన జయచిత్ర నాగరాజు.. నెల్లూరు జిల్లా (Nellore District) బిట్రగుంటకు చెందిన మహ్మద్ అబ్దుల్ సోని ఎనిమిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఆరు సంవత్సరాల క్రితం నాగరాజు కుటుంబంతో సహా పొన్నూరులో స్థిరపడ్డాడు. నాగరాజు కారు డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇంతలో ఏమైందో ఏమో తెలియదుగానీ నాగరాజు అదృశ్యమయ్యాడు. అతడు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేయగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రియుడి మోజులో భార్యే భర్తను చంపి నాటకమాడినట్లు వెల్లడైంది.

    నాగరాజు భర్య సోనీకి స్థానికంగా ఉండే వెంకటసాయి అనే యువకుడితో పరిచయమైంది. పరిచయం కాస్తా వివాహేతర సంబంధంగా మారడంతో ఇద్దరూ తరచూ ఏకాంతంగా కలుస్తున్నారు. ఓ రోజు భార్య విషయం నాగరాజుకు తెలిసి మందలించాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ప్రియుడితో తన సుఖానికి భర్త అడ్డొస్తున్నాడని భావించిన భార్య.. ఎలాగైనా అంతమొందించాలని స్కెచ్ వేసింది. తన ప్లాన్ ను ప్రియుడితో చెప్పింది. అతడు కూడా ఒప్పుకోవడంతో ఓ రోజు రాత్రి భోజనంలో నిద్రమాత్రలు కలిపి భర్తకు పెట్టింది. అతడు నిద్రలోకి జారుకోగానే ప్రియుడికి ఫోన్ చేసి పిలించింది. స్నేహితుడితో సహా అక్కడికి చేరుకున్న సాయి.. నాగరాజును హత్య చేసి మృతదేహాన్ని ఓ వాహనంలో తీసుకెళ్లి బాపట్ల సమీపంలోని ఓ కాలువలో పడేశారు.

    ఇది చదవండి: రూ.100 పెడితే 5లక్షలు మీ సొంతం.. నెంబర్ గేమ్ లో చిక్కుకుంటే అంతే సంగతులు.. ఎక్కడో తెలుసా.‌.!


    ఐతే భర్తను హత్య చేసిన విషయాన్ని సోని.. తన చెల్లెలితో చెప్పింది. భయపడిపోయిన ఆమె జరిగిన విషయాన్ని మృతుడి అన్నకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భార్యతో పాటు ఆమె ప్రియుడు, వీరికి సహకరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.

    ఇది చదవండి: ఆ న్యూడ్ వీడియో కాల్ విలువ రూ.10లక్షలు... డేటింగ్ యాప్ పేరుతో సర్వం దోచేసిన యువతి..


    ఇటీవల నెల్లూరు జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. నరేంద్ర అనే యువకుడు శ్రీకాకుళం నుంచి వలస వచ్చిన వివాహితతో సంబంధం పెట్టుకున్నాడు. విషయం ఆమె భర్తకు తెలియడంతో తిరిగి స్వగ్రామానికి వెళ్లిపోయారు. నరేంద్ర కూడా మహిళ కోసం ఆమె స్వగ్రామానికి వెళ్లగా.. అక్కడ ఆమె భర్తతో గొడవ జరిగింది. ఇంతలోనే అతడు ఓ బావిలో శవమై తేలాడు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Extramarital affairs, Guntur, Wife kill husband

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు