హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Extramarital Affair: ప్రియుడితో కలిసి భర్తను చంపింది.. సూసైడ్ అని నమ్మించింది.. కాలి చెప్పుతో మిస్టరీ వీడింది..

Extramarital Affair: ప్రియుడితో కలిసి భర్తను చంపింది.. సూసైడ్ అని నమ్మించింది.. కాలి చెప్పుతో మిస్టరీ వీడింది..

నరేంద్ర, శ్రీవిద్య (పెళ్లి ఫోటో)

నరేంద్ర, శ్రీవిద్య (పెళ్లి ఫోటో)

Shocking Story: ఈ రోజుల్లో వివాహ బంధాలకంటే అక్రమ సంబంధాలకే ప్రాధాన్యమిచ్చేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. తమ బాగోతానికి అడ్డుగా వస్తున్నారని కట్టుకున్నవారిని సైతం మట్టుబెడుతున్న ఘటనలు ప్రతిరోజు వెలుగుచూస్తూనే ఉన్నాయి.

Anna Raghu, News18, Amaravati

ఈ రోజుల్లో వివాహ బంధాలకంటే అక్రమ సంబంధాలకే ప్రాధాన్యమిచ్చేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. తమ బాగోతానికి అడ్డుగా వస్తున్నారని కట్టుకున్నవారిని సైతం మట్టుబెడుతున్న ఘటనలు ప్రతిరోజు వెలుగుచూస్తూనే ఉన్నాయి. పెళ్లికి ముందే బావతో ఎఫైర్ పెట్టుకున్న మహిళ.. ప్రియుడితో కలిసి భర్తను కిరాతకంగా చంపింది. భర్త ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించింది కానీ అతడి కాలి చెప్పు మర్టర్ మిస్టరీని బయటపెట్టింది. ఓ ఈ కథలో పోలీస్ ఇన్ స్పెక్టర్ కీలకంగా వ్యవహరించి నిందితులకు శిక్షపడేలా చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని గుంటూరు జిల్లా (Guntur District) ఫిరంగిపురం మండలం పొనుగుబాడుకు చెందిన నల్లబోతు నరేంద్రకు అదే గ్రామానికి చెందిన మేనమామ కుమార్తె అయిన శ్రీవిద్యతో మూడున్నరేళ్ల క్రితం పెళ్లైంది. నరేంద్ర సెక్యురిటీ గార్డుగా పనిచేస్తుండగా శ్రీవిద్య నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తోంది.

ఐతే గతేడాది డిసెంబర్ 19న తనను ఇంటికి తీసుకెళ్లేందుకు నరసరావుపేట రావాల్సిందిగా శ్రీవిద్య భర్తకు ఫోన్ చేసింది. ఆ తర్వాతి రోజు నరేంద్ర నాదెండ్ల మండలం సాతులూరు పొలిమేరలో శవమై కనిపించాడు. అతడి మృతదేహం పక్కన మద్యం సీసాలో పరుగుమందు కనిపించడంతో అందరూ ఆత్మహత్య అనుకున్నారు. శ్రీవిద్య కూడా తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడంటూ బోరున విలపించింది.

ఇది చదవండి: ప్రాణం తీసిన శోభనం.. ఫస్ట్ నైట్ భయంతో యువకుడు ఏం చేశాడంటే..!


పోలీసులు కూడా సూసైడ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఐతే మృతుడి కాలికి ఒకే చెప్పు ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చి చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. రెండో చెప్పు కనిపించలేదు. ఐతే విచారణ నిమిత్తం పోలీసులు నరేంద్ర ఇంటికి వెళ్లినప్పుడు శ్రీవిద్య బావ కారులోర రెండో చెప్పు కనిపించడంతో ఇన్ స్పెక్టర్ శోభన్ బాబుకి అనుమానం వచ్చి విచారణ జరిపారు. దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

కేసులో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ శోభన్ బాబు (ఫైల్)

ఇది చదవండి: ప్రతిరాత్రి ఆ మాట చెప్పాల్సిందే..! సిలబస్ లో డబుల్ మీనింగ్ డైలాగ్స్..


విచాణలో భాగంగా శ్రీవిద్యకు ఆమె బావ గొట్టిపాటి వీరయ్య మధ్య ఎక్కువ ఫోన్ కాల్స్ ఉండటాన్ని గమనించి కూపీలాగారు. పెళ్లికాక ముందునంచే శ్రీవిద్యకు ఆమె బావ వీరయ్యతో అక్రమ సంబంధం ఉంది. ఐతే అయిష్టంగానే నరేంద్రతో పెళ్లికి ఒప్పుకున్న శ్రీవిద్య.. ఆ తర్వాత కూడా వీరయ్యతో ఎఫైర్ కొనసాగించింది. తమ సుఖానికి అడ్డొస్తున్న భర్తను చంపేయాలని శ్రీవిద్య, వీరయ్య భావించారు. తమ ప్లాన్ ప్రకారం వీరయ్య తన తోడల్లుడు నరేంద్రకు ఫోన్‌ చేసి ఓ వ్యక్తి నుంచి తనకు రూ.10 లక్షలు రావాల్సి ఉందని, వసూలుకు సాయం చేయాలని కోరాడు. ఆ డబ్బు వస్తే జనవరి 1న బుల్లెట్ కొనిస్తానని ఆశ చూపాడు.

ఇది చదవండి: ఏపీలో ఉప్పెన తరహా సీన్.. కూతురు వెంటపడుతున్నాడని యువకుడి మర్మాంగం


డిసెంబర్ 19న భార్యను ఇంటికి తీసుకురావడానికి నరసరావుపేటకు బయలుదేరిన నరేంద్రను కారులో ఎక్కించుకున్నాడు. మార్గమధ్యంలో గుంజి బాలరాజు, చౌడయ్య అనే మరో ఇద్దరినీ కారులో ఎక్కించుకున్నాడు. మద్యం, తినుబండారాలు తీసుకొని వినుకొండ మండలం కొత్తపాలెం వద్ద ఓ చోట కారు నిలిపారు. అప్పటికే మత్తులో ఉన్న నరేంద్రకు సైనెడ్ కలిపిన మద్యం అందించారు. అతడు ప్రాణాలు వదిలాక మృతదేహాన్ని సాతులూరు పొలిమేరలో కాల్వ కట్టపై పడేశారు.న రేంద్ర మృతదేహం పక్కన సగం ఖాళీ చేసిన మద్యం సీసాలో పురుగుమందు కలిపి పెట్టారు. దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. మొత్తానికి పోలీస్ లు చెప్పు ఆధారంగా వారికీ వచ్చిన అనుమానం దిశగా విచారణ చేసి వీరయ్య, బాలరాజు, చౌడయ్యనుశ్రీ విద్యను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. కోర్టులో నేరం రుజువుకావడంతో నిందితులకు జీవిత ఖైదు విధించారు.

First published:

Tags: Andhra Pradesh, Extramarital affairs, Guntur, Wife kills husband

ఉత్తమ కథలు