WIFE KILLED HUSBAND FOR HARASSING HER IN PRAKASHAM DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GNT
Wife And Husband: ఎన్ని బాధలు పెట్టినా భరించింది... కానీ ఓపిక నశించిన భార్య ఏంచేసిందంటే.!
ప్రతీకాత్మకచిత్రం
భార్యభర్తల (Wife and Husband) బంధం అంటే పదికాలాల పాటు చల్లగా ఉండాలని భావిస్తుంటారు. భర్త ప్రతి అడుగులో భార్య.. భార్యను ప్రతిక్షణం కనిపెట్టుకుని ఉండే భర్త ఉంటే చాలు వారి జీవితం సవ్యంగా సాగుతుంది.
భార్యభర్తల (Wife and Husband) బంధం అంటే పదికాలాల పాటు చల్లగా ఉండాలని భావిస్తుంటారు. భర్త ప్రతి అడుగులో భార్య.. భార్యను ప్రతిక్షణం కనిపెట్టుకుని ఉండే భర్త ఉంటే చాలు వారి జీవితం సవ్యంగా సాగుతుంది. భర్త ఎన్ని ఇబ్బందులు పెట్టినా భార్య భరిస్తూ వస్తుంది. తాగొచ్చి కొట్టినా కట్టుకున్నవాడే కదా అని భావిస్తుంది. భర్త ఎన్ని చిత్రహింసలు పెట్టిన భరించింది. మగవాళ్ళు శాసించే ఈ వ్యవస్థలో ఇవన్ని అలవాటు పడిన వారు మౌనంగా ఉంటూ భరించింది. కానీ ఒక్కోసారి భర్తలు శాడిస్టుల్లాగా వ్యవహరిస్తారు. తమకు కావాల్సింది పొందడం కోసం కట్టుకున్న భార్య అని కూడా చూడలేదు తన పైశాచిక అందాన్ని తీర్చుకోవటం కోసం మద్యం తాగి వచ్చి ఆమెను నిత్యం వేధించడమే కాకుండా తీవ్రంగా కొడుతుండేవాడు. దీంతో ఇక తన సహనం నశించి పోయిన భార్య కఠిన నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రకాశం జిల్లా (Prakasham District) గిద్దలూరుకి చెందిన అంకాళమ్మ, చిరంజీవి దంపతులు వీరికి ముగ్గురు సంతానం. రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఐతే మద్యానికి బానిసైన చిరంజీవి ప్రతి రోజూ తాగొచ్చి భార్యను చిత్రహింసలు పెడుతుండేవాడు. ఇన్నాళ్లూ ఆ వేధింపులను భరిస్తూ వచ్చింది అంకాలమ్మ. ఐతే ఇటీవల భర్త వేధింపులు పెరిగిపోవడంతో పెద్దల దృష్టికి తీసుకెళ్లింది. వాళ్లు చిరంజీవిని మందలించి పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు.
ఐతే ఆ తర్వాత మారకపోగా వేధింపులు ఎక్కువయ్యాయి. ఆదివారం రాత్రి ఫుల్లుగా తాగొచ్చిన చిరంజీవి భార్యను కొట్టడం మొదలుపెట్టాడు.ఈ గొడవలో తీవ్ర ఆగ్రహానికి లోనైన అంకాలమ్మ భర్తను రోకలిబండతో మోది హత్య చేసింది. అనంతరం తనంతట తానే పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవల విజయనగరం జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. భర్త వేధింపులను భరించలేకపోయిన భార్య... క్షణికావేశంలో అతడ్ని హత్య చేసింది. అంతకుముందు అనంతపురం జిల్లాలోనూ భర్త వేధింపులు భరించలేక భార్య హత్య చేసింది. భర్త తాగొచ్చి మేడపై భార్యతో గొడవపడుతున్నాడు. భర్త తిట్లను అప్పటివరకు భరించిన భార్య.. అతడు కొట్టడానికి మీదకి రావడంతో అతడి మర్మాంగంపై కొట్టింది. దీంతో అతడు కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఐతే తన భర్త మద్యం మత్తులో మిద్దెపై నుంచి కిందపడిపోయాడని భార్య పోలీసులకు చెప్పింది. దర్యాప్తులో భర్త శరీరంపై గాయాలుండటంతో తానే హత్య చేసినట్లు ఒప్పుకుంది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.