WIFE ATTACKED ON HUSBAND WITH HELP OF LOVER IN CHITTOOR DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT
Extramarital Affair: భార్యను ప్రియుడితో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త.. ఆ తర్వాత ఉంది అసలు ట్విస్ట్..
ప్రతీకాత్మక చిత్రం
Affair: పెళ్లై భర్త ఉండగానే పరాయి పురుషుడి మోజులో పడిందో భార్య. ప్రియుడితో కలిసి ఏకాంతంగా ఉండగా భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. కానీ ఆస్పత్రి పాలయ్యాడు. ఈ షాకింగ్ ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లా (Chittoor District) లో జరిగింది.
ఎంతో సాఫీగా సాగాల్సిన దాంపత్య జీవితాన్ని క్షణిక సుఖాల కోసం పాడు చేసుకుంటున్నారు కొందరు. అక్రమ సంబంధాల కోసం పచ్చనికాపురాల్లో చేజేతులా నిప్పులు పోసుకుంటున్నారు. అలా పెళ్లై భర్త ఉండగానే పరాయి పురుషుడి మోజులో పడిందో భార్య. ప్రియుడితో కలిసి ఏకాంతంగా ఉండగా భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. కానీ ఆస్పత్రి పాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని చిత్తూరు జిల్లా (Chittoor District) పలమనేరు మండలం వంకరవారిపల్లికు చెందిన గణేష్ (40) నందిని (35)లకు కొన్నేళ్ల క్రిందల వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య అంటే ఎంతో ఇష్టంగా చూసుకొనే వాడు గణేష్.
కూలీ పనులు నిమిత్తం గణేష్ ఇతర ప్రాంతాలకు వెళ్లి వస్తూ.. కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. దీంతో భర్త తనను దూరం పెడుతున్నాడని.. పట్టించుకోవడం లేదని భావించింది. ఈ క్రమంలోనే ఆమెకు నల్లంగాడు గ్రామానికి చెందిన రెడ్డప్పతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. గత ఏడాది పాటుగా గుట్టుచప్పుడు కాకుండా వివాహేతర సంభందని కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన గణేష్ ఆమె నడవడిక, కదలికలపై నిఘా పెట్టాడు. దీంతో రెడ్డప్పతో నందిని సాగిస్తున్న లైంగిక సంబంధాన్ని గుర్తించాడు. అప్పటినుంచి భార్యకు తెలియకుండా ఆమెను ఫాలో అవడం మొదలుపెట్టాడు.
శుక్రవారం భర్త గణేష్ కు మస్కా కొట్టిన నందిని. భర్త బయట పనికి వెళ్లిన సమయంలో ప్రియునితో కలసి ఊరిచివర మామిడితోటలో ఎంజాయ్ చేయాలని ప్లాన్ వేసింది. పని నుంతి తిరిగొచ్చిన గణేష్ కు భార్య కనపడకపోయే సరికి ఊరంతా గాలించాడు. ఆమె ఊరి పొలిమేరలో ఉన్న ఓ మామిడి తోపులో ఉన్నట్లు తెలుసుకొని అక్కడకు వెళ్ళాడు గణేష్. అదే సమయంలో భార్య నందిని.. ప్రియుడు రెడ్డప్పతో ఏకాంతంగా గడుపుతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. తననే మోసం చేస్తావా అంటూ ఆమెపై దాడికి యత్నించాడు. ఐతే ప్రియుడితో కలిసి భర్తపైనే ఎదురుదాడి చేసింది నందిని. దీంతో తీవ్రంగా గాయపడ్డ గణేష్.. ఆస్పత్రి పాలయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవల కర్నూలు జిల్లా నంద్యాలలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. అప్పులవాళ్ల బాధ భరించలేని భర్త ఇతర ప్రాంతాల్లో ఉంటూ అప్పుడప్పుడు ఇంటికి వచ్చివెళ్తున్నాడు. ఈ క్రమంలో భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఓ రోజు భార్యను, ఆమె ప్రియుడితో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. దీంతో ఆమె తన ప్రియుడితో కలిసి భర్తపై దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డాడు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.